పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా [...]
        రంగులు మార్చుకున్న ఆకులు రాలి శీతాకాలం ప్రవేశించాక అంతటా నిశ్చలం. ఆకుల వియోగంతో మూగవోయిన కొమ్మలు... బూడిద రంగు ఆకాశంలో బద్దకంగా రెక్కలు విదుల్చుకుంటున్న పక్షులు. లోపల, బయటా అలుముకున్న స్తబ్ధత.        చలి తాకిడికి కుంచించుకుపోయిన ఓ రోజుకి వార్షికోత్సవం పనులు మొదలెట్టలేదనే ఆలోచన తడుతుంది. పక్షి రెక్క విదిల్చి ముడుచుకున్నట్లు మెయిల్ ఒకటి వెళ్ళాక ఇక తప్పదన్నట్లు [...]
దేశం చుట్టూరా ఝామ్మని తిరిగి రావాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకనిపిస్తూ ఉంటుంది. ఇండియా చుట్టూనో, అమరికా చుట్టూనో తిరిగి రావడం కుదరని పని కాని అదిగో అక్కడ కనిపిస్తోందే, గ్రాండ్ టర్క్, అదో ద్వీపము. ఆ ద్వీపాన్ని కాలినడకన చుట్టేసి రావచ్చు. ఏడు ౘదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన ఈ చిన్న ద్వీపం, టర్క్స్ అండ్ కైకోస్ ద్వీప సమూహానికి రాజధాని. ఈ చిన్న ద్వీపంలో బాంక్, [...]
డెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు.ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ కథలు మేము చదివేశాం, చాలా బాగా ఉంటాయి శీను" అన్నారు అక్కయ్యలు. మొన్న [...]
        కరేబియన్ ఐలెండ్స్ చూడాలంటె శీతాకాలం మంచి సమయం, పైగా ఈస్ట్ కోస్ట్ చలి నుంచి కొంతకాలం తప్పించుకోవచ్చు. నాలుగేళ్ళ క్రితం ఇదే సమయంలో బహమాస్ కు వెళ్ళాం. ఈయేడాది కూడా అలాంటి ప్రయాణమే. డిసెంబర్ ఇరవైమూడవ తేదీ సాయంత్రం మయామీ నుండి ఓడలో బయలు దేరి, ఇరవైఐదున గ్రాండ్ టర్క్, ఇరవైఆరున డొమెనికన్ రిపబ్లిక్(యాంబర్ కోవ్), ఇరవైయేడున పోర్టోరికో చూసి ముప్పైవ తేదీ ఉదయం ఆరు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు