ట్రింగ్ ట్రింగ్... ఫోను మోగింది.పరాకు ప్రభాకర్ చిరాగ్గా ఫోనెత్తిండు, "పరాకు హియర్, అవతలెవరు?""ఒరే... గుర్తు పట్టలేదా నేనయ్యా..."సీట్లోంచి చెంగున లేచిండు పరాకు, నమస్కారం కూడా పెట్టిండు, అవతలాయనకు కనపడక పొయినా... "మిమ్మల్ని గుర్తు పట్టనంత వారమా జగడపాటి గారు? ఏమిటో తీరిక చేసుకుని మా వంటి వారి మీద దయ చూపారు?""ఆపవయ్యా నీ భట్రాజు పొగడ్తలు. అవతల నా బోల్తా హిల్స్ రేట్లు [...]