"యథో మనః తథో భావ, యథో భావ తథో రసః" వంటి తాదాత్మ్యం కలుగజేసిన ఆణిముత్యాల వంటి ఈ Aligarh హిందీ చలనచిత్ర కవిత్వపు పలుకులకి నేను స్వేచ్ఛానువాదం చేస్తుండగా,  "త్రిపుర" కలంపేరు తో రచనలు చేసే నా మిత్రురాలు చేసిన అనుసృజన అందింది.  మేలైన భావన పొదిగిన ఆ రచన బాగుందని (నా అనువాదం ఆపి) మీకూ పంచుతున్నాను.  "poetry शब्दों में कहाँ होती है बाबा. कविता शब्दों के बीच में मिलती है. साइलेन्सस में. [...]
అప్పట్లోఏదో పండుగ కాలం లో,కనీసం ఎండాకాలం సెలవుల్లోఎవరో ఎగురవేస్తారురంగురంగుల గాలిపటాలుఎగిరే మబ్బుల్లా ఉంటాయి అవి!అంతకు మించిన ఎత్తుకి ఎగరాలనిఉవ్విళ్ళూరే ప్రాయం పరుగు పెట్టించేదిపసి హృదయం కూడా పటమైయేది కనుక...బడికి వెళ్లి వచ్చేదారిలోతుమ్మకంపల్లో,చిటారు కొమ్మల్లోగాలివానకు ఒరిగిన పిట్టల్లాచిరుకు పట్టిన చీరల్లాఅవే గాలిపటాలువంతులు వేసుకునివెదుక్కుని, [...]
పున్నాగల వానలై, పారిజాతాల పాన్పులైకొన్ని పూలు నేల కొరకే పూస్తాయిమరి కొన్ని తావులీనుతూగాలిని వదలని మల్లెల, జాజుల పరిమళాల చిలుకరిస్తే ఆగి ఆగి కదిలే వాయువులన్నీ వేణుగానాలై పోతాయినీటి ఒడిలో నిర్మలంగా పవళిస్తూతామర జాజరగా, కలువల కాంతిగాఆ పూలు మరి అలా విరియగానేకొలనులన్నీ అలల నవ్వులే. పుష్పించని జాతులు ఉంటాయి తరువుల్లోపంచవన్నెల పత్రాలు తయారు చేసుకుంటాయిసుమాల కాలాలు [...]
అక్షరం రాయబడని  కాగితంపై పరుచుకున్న మనసుని  చదువుతున్న తనని చూసి విషాదం విరిగిపోతున్న చప్పుడు కరిగించేస్తున్న  నిశ్శబ్దంలో నుండి గుండె కిందగా ఒక నవ్వు మొదలవుతున్న సవ్వడి వినగానే ఇందాక  తెల్లకాగితంపై రాలిపడ్డ రెండు కన్నీటి చుక్కలు ఇప్పుడు నవ్వుల చిగుర్లు వేసుకుంటూ తడి తడిగా  మనసుని  అల్లుకుంటున్నాయికంటి నిండుగా  వెన్నెల పూలని పుష్పిస్తూ
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు