ఇది అలనాటి మాయాబజార్ సినిమాలో ఒక అందమైన సన్నివేశం. ఇక్కడ రచయిత పెండ్యాల నాగేంద్రరావు గారు హిడింబ చేత "అలమలం" అనిపిస్తారు. ఈ మాట విండానికి నవ్వుతెప్పించేటట్టుగా ఉండి, అదేదో అర్ధంలేని మాటగానో లేదా అర్ధంకాని ఆటవిక పదజాలం గానో పొరపడే ప్రమాదముంది. నిజానికి ఇది ఎంతో అందమైన సంస్కృతపదం. అలం అంటే సంస్కృతంలో "చాలు" అని అర్ధం. అలమలం అంటే "చాలుచాలు" అని అర్ధమన్నమాట. ఇప్పుడీ [...]
మనలో చాలా మంది “యథారాజా తథా ప్రజాః” అనే నానుడి విని ఉంటాం. అయితే ఇది ఒక మంచి సంస్కృత నీతి శ్లోకంలో చివరి అర్ధభాగమని ఎంతోమందికి తెలియక పోవచ్చు. ఇదిగో మరి ఆ శ్లోకం.రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః, పాపేపాపా-స్సమే సమాః ।లోకాస్త మనువర్తంతే, యథారాజా తథాప్రజాః ।।రాజు ధర్మంగా నడుచుకుంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజు పాపి అయితే ప్రజలూ పాపప్పనులే చేస్తారు. రాజు పాపపుణ్యాలు [...]
పుస్తకం వనితా విత్తం, పరహస్తగతం గతం |అథవా పునరాయాతి, జీర్ణం భ్రష్టా చ ఖణ్డశః ||పుస్తకం, ఆడమనిషి, డబ్బు. ఇవి మూడూ ఒకసారి చేతులు మారితే మళ్ళీ రావు. ఒకవేళ వచ్చినా, పుస్తకమైతే చిరిగిపోయో, ముడతలు పడిపోయో, అనేకరకాలుగా జీర్ణమైపోయి వస్తుంది. మరి ఆడపిల్లైతే భ్రష్టు పట్టి వస్తుంది. ఇది ప్రస్తుత కాలానికి పూర్తిగా వర్తించదు. పాతరోజుల్లో కన్యాదానం చేసిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు [...]
ఒక అవధానికీ, ప్రవచనకర్తకీ చాలా తేడా ఉంటుంది. అవధానిగారు వేదికనెక్కి ఆయన ప్రజ్ఞనీ, ధారణ శక్తినీ బాగా ప్రదర్శిస్తూంటే పదిమందీ బాగుందనుకుంటారు. అప్పుడు ఆ పండితుడు చేసేది కేవలం కళాత్మకమైన భాషానైపుణ్య ప్రదర్శనమే తప్ప సమాజం, సంస్కృతి, దైవం, వేదాంతం మొదలైన విషయాల మీద ప్రసంగించటంగానీ (విషయాల్ని విడమర్చి చెప్పడం) ప్రవచించడంగానీ (మంచిమాట) చేయటం లేదు. ఇలాంటి అవధానం చేసే [...]
ఇది జరిగి అప్పుడే కొంతకాలమైంది. చాగంటి కోటేశ్వరరావుగారు అందరికీ తెలిసిన మంచి ప్రవచన కర్త. ఆయన పదిమంది మంచికోరి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం తన తృప్తికోసం తనకి తెలిసిన పౌరాణిక, ధార్మిక విషయాలని వాటి వెనుక నిగూఢంగా ఉన్న తత్త్వార్థంతో సహా మామూలు మనుషులకర్థమయ్యే భాషలో విడమర్చి చెప్తూ తనకి తెలియకుండానే ఎంతోమందికి మార్గదర్శకులైన మంచిమనిషి. అలాంటి చాగంటిగారు ఆ మధ్య [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు