శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - అల్లుడ నయ్యెదన్ సుతుడనయ్యెద ప్రాణవిభుండనయ్యెదన్. ఉత్పలమాల:  మెల్లగ నాలకింపుమిక మీకిటుజెప్పెద వీరుముగ్గురున్ చెల్లగ నాకు బంధువులు చేరుచునుందును వీరి లోయెదన్  ఇల్లిదెయత్త, తండ్రి, సతి నిట్టుల వర్సగజూడ నయ్యెదన్  అల్లుడ, నయ్యెదన్ సుతుడ, నయ్యెద ప్రాణవిభుండ, నయ్యెదన్.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్"లేదా..."గరుడుని చూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై"ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.
అందరికీ శ్రీ హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలు.     కందము:  హేమము గోరను నిను నే  క్షామమ్మే లేక ధరను సరివత్సరమే  ధీమాగా పాలించుము  హే!మా శ్రీ హేమలంబ హిత సహితముగా.  
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."హేవళంబి జగతి కిడుము లొసఁగు"లేదా..."వచ్చిన హేవళంబి కడు వంతలు లొసంగును మానవాళికిన్"ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు