శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - పాశుపతమ్ము వేసి హరి పార్థుని జంపెను నిర్దయాత్ముడై. ఉత్పలమాల:  ఆశగబబ్రువాహనుడు యర్జున పుత్రుడు నశ్వమేధమున్  దేశములన్ని దాటి తన దేశము వచ్చిన యశ్వమంట నా  వేశముతోడ యుద్ధమని వెంటనె రాగను నాగబాణమౌ  పాశుపతమ్ము వేసి హరి! పార్థుని జంపెను నిర్దయాత్ముడై. 
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే"లేదా..."భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై"ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - మంచుమల యింద్రనీలమై మండుచుండె.  తేటగీతి:   పెనముపైనట్లు కొలిమిని పెట్టినట్లు  మండుటెండలు మేనుల మాడ్చుచుండె  వినుడు మనమంత యొకనెల వెడలవలెను  మంచుమల, యింద్ర! నీల! మై మండుచుండె.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."అమృతపానమ్ముచే సుర లసురులైరి"లేదా..."అమృతముఁ గ్రోలినంత సుర లక్కట రాక్షసులై చరించిరే"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - మరణమందు తోడు మాధవునకు. ఆటవెలది:  పుడమి బాధ దీర్ప పోరుకై వెడలగ  మరణమందజేయ నరకునకును  వెంట బడుచు వచ్చె నంటగా సత్యభా  మ, రణమందు తోడు మాధవునకు.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు