ఉత్పలాలమాల చంద్రునికి -పున్నమి తోడుగా జిలుగు పొంగుచు వెల్లువలౌచు నింగిలోవెన్నెల రాజిలెన్, వెలుగు వెల్లలు వేసినయట్లు నేలపైకన్నులకింపుగా కళలు కాంతులు నింపుచు వేడుకై, యహో! చెన్నుగనుండగా నితర చెల్వములేల, సఖా! సుధామయా!చంపకాలమాల చంద్రునికి -దినమొక తీరుగా కళలు తేరుచు, మెల్లగ మెల్లమెల్లగామనమున నింగిలో వలెనె మక్కువ నిండుచు చల్లచల్లగాకనులను మూసినన్, తెఱచి గాంచిన వోలెనె [...]
ఉ. సారములెల్ల నేర్చిన విశారదు తండ్రికి నొక్క దెబ్బకీ భూరి ప్రపంచమెల్ల విన బొబ్బలు వెట్టుచు స్తంభమొక్కెడన్ తీరుగ వ్రచ్చిలన్ వెడలి తీండ్రిలు వానిని మట్టుబెట్టవే! పారము ముట్ట, నా దుడుకు బద్దలు చేయగరమ్ము శ్రీహరీ! కం.  ఇచ్చకములనాడగ, మదిముచ్చట పడినట్లు చేయ మోహములెన్నో.హెచ్చగుచుండగ , మరిమరియిచ్చట నెగ్గుటలెటులను నెఱుకయు నిమ్మా..కం. మాయామేయము జగమిదికాయమ్మైనను [...]
కవి అనుభూతినీ, పదకల్పననూ సొంతం చేసుకోగల చదువరి అంతే లోతైన అనుభూతితో తాదాత్మ్యం పొందిఉండడం సహజమైన సత్యం. అప్పుడే, ఆక్షణంలో అయినా, జన్మలకతీతమైన కాలాంతరంలోనైనా.--------లక్ష్మీదేవి.
ఆశలతో కరచాలనం చేయాలని,ఆ కరగ్రహణం చేసి ఆనందాకరాల మెట్టాలని,ఆవలి తీరం చేరేదాక దిగంతాలవైపు పయనం సాగించాలని,గమనమే గమ్యం కన్నా రమ్యం చేయాలని, జీవం పోయిన శవంకనులు కలలు కనవు, ఏనాడో ఎండిపోయి ఉన్నా తేనెపాప ఈదేంత కొలనుగానిండిపోవడం తప్ప.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు