నేటి పత్రికలలో ఏది నమ్మాలో, ఏది నమ్మలేమో తెలియని పరిస్థితి.సీ. ఏది సత్యమొ మరి ఏది అసత్యమో, తేలిచి చెప్పుట వీలుకాదుమనవాడు పలికిన మాట విషమయిన ఆచరణీయము అమృత మదియెఆవలిప్రక్కవా రాడిన సూనృతము తెవులుగొనిన వీరి చెవుల బడదుమానవతావాద మానవాలు మతవాదముల బడినదయి సమసిపోయె    ఆ.  నిజము చాటుచు తమ నిష్పక్షపాతముకవచమై వెలుంగ ఘనముగాను నిలిచి సత్యమునకు నెలవులౌ పత్రికల్కాలగర్భ [...]
ఒక చరము (సెల్ఫోను) చేతి కందితే అంతకన్నా మహాప్రసాదం లేదు, పెద్దలకూ పిన్నలకూ నేడు.తే. ఆటల మయిదానము చేతి కందివచ్చెనురకలు పరుగులు తెరల నొదిగిపోయెకనులు చేతివ్రేళ్లు విడిచి కదుల వేవి జగము నింపుకొనె దనలో చరము భళిరమరింత చెప్పాలంటే, వెలుగునీడలు అనే పాతచిత్రంలోని ఈ క్రిందిపాటను ఒకసారి గుర్తుచేసుకోండి. అదే బాణీలో ఈ సాహిత్యాన్ని పాడుకోండి.  https://www.youtube.com/watch?v=kIEz9AtpqwIపల్లవి - [...]
పల్లవి - మంగాబుధి హనుమంతా, నీ శరణ మంగవించితిమి హనుమంతా.చరణం ౧ -బాలార్క బింబము ఫలమని పట్టిన,ఆలరిచేతల హనుమంతా.తూలని బ్రహ్మాదులచే వరముల,నోలి చేకొనిన హనుమంతాచరణం ౨-జలధి దాట నీ సత్త్వము కపులకునలరి తెలిపితివి హనుమంతాఇలయు నాకసము నేకముగా నటుబలిమి పెరిగితివి భళిహనుమంతాచరణం ౩ -పాతాళములోపలి మైరావణునాతల జంపిన హనుమంతాచేతుల మోడ్చుక శ్రీవేంకటపతినీతల గొలిచే హిత హనుమంతాపై [...]
ప్రక్కననిల్తు నాయుధము పట్టను పోరను నీ రథంబు పైనెక్కి రణాంగణంబుఁ జరియింతు ధనంజయ యుద్ధభూమియందక్కరవచ్చుపల్కులటు దక్క సహాయము జేయజాల నేనెక్కుడు యన్న వెన్నని విధేయుడ పాకగృహంబునందునన్సతీమణి వంటింట్లోకి సవ్యసాచిలా ప్రవేశించి నప్పుడు నా పాత్ర ఇదే. ప్రక్కన నిల్చి సలహా లీయడమే.
గన్నవరపు నరసింహమూర్తిగారు, వున్నావ నాగేశ్వరరావుగారు ఫేస్బుక్కులో గాలిబ్ కవితలను పెట్టి వారి అనువాదాలు ప్రచురించారు.అది చూసి నేను నరసింహమూర్తిగారితో ద్విపదలో వ్రాయుటలో సౌలభ్య ముండునని సూచించాను. దానిక ప్రతిగా వారు నన్నే ఆ కార్యము మీద వేసుకోమన్నారు.అది నిన్నటి మాట. ఈ రాత్రికి కానీ తీరికదొరకలేదు. కూచున్న కాసేపులో ద్విపదలోనే మూడు కవితలకూ అనువాదాలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు