రెండు రోజుల క్రితం శ్రీశైల వెళ్లాను . స్వామీ దర్శనం తో పాటు  మళ్ళీ మళ్ళీ చాలా చూసాను. గతంలో చూసినవే. అందులో శివాజీ స్పూర్తి కేంద్రంతో పాటు .. ప్రత్యేకంగా దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలపై ఉన్న శిల్ప కళని చూసి తీరాల్సిందే. ఆ కుడ్య కళలో చరిత్ర కనబడుతుంది . చాలా ఫొటోస్ తీశాను. అందులో మచ్చుకు కొన్ని ... మిగతావన్నీ వీడియో చేసి చూపిస్తాను .
వెలుతురు బాకు ముందుమాట వనజ తాతినేని నా చేతిలో వెలుతురు బాకు " ని పెట్టి చానాళ్ళై పోయింది. ఇంత అలసత్వం యెప్పుడూ జరగలేదు. రకరకాల కారణాల వల్ల ఇంత జాప్యం జరిగింది, మీరెప్పటికైనా వ్రాయండి, మీ ముందుమాట వుండాలి "అన్న ఆమె అభిమానం తన గురించి ఎక్కువగా ఆలోచించేందుకు కారణమైంది."గతంలో "తను వుత్తమ కథకురాలిగా "భూమిక"అవార్డ్ ని అందుకున్న సందర్భంలో మొదటిసారి  కలుసుకున్నాం. [...]
తాజాగా .. కవిత్వ కథ పై ..... ఓ అభిమాన పాఠకుడి లేఖ. పాఠకులు keen observation లో ఉంటారని నా మెయిల్ కి వచ్చిన ఈ అభిప్రాయం చూసినప్పుడు తెలిసింది. 100% నా మనసులోని భావాలకి అనుగుణంగా వచ్చిన రివ్యూ యిది. stun అయ్యాను కూడా. ఈ పాఠకుడు నా మిత్ర బృందంలో వారే కావచ్చు. ఎనీ వే.. చాలా సంతోషం. ఈ లేఖపై ఉన్న దాన్ని యధాతధంగా ..టైప్ చేసి పోస్ట్ చేస్తున్నాను. గతంలో వాణి వెంకట్ ,సరళ మోహన్ ,మంజు యనమదల గారి లాగా ఈ
కవిత్వం వ్రాయడానికి  కలమూ కాగితమూ కీ బోర్డ్ డిజిటల్ పేజీ యే కావాలా యిప్పుడు ?  ఆ గుబురు మీసాల క్రింద దాక్కున్న చిన్న చిర్నవ్వు ఆ గడ్డం నొక్కు  చంద్రకాంతిని  సోలి  తూలి వెలిగే ఆ కళ్ళు  మేకప్ పొరలు దాయలేని  నుదిటి మీద మూడు అడ్డు గీతలు చాలవూ  ఆ చంద్ర బింబం లాంటి ఆ  ముఖాన్ని రెండు అరచేతుల మధ్యకి తీసుకుని  కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని  అరంగుళం దూరంలో ఆపేసి [...]
బి హైండ్ హెర్ స్మైల్ కథ పై ఒక నిజమైన పాఠకుడి ప్రతిస్పందన ..  పత్రికలో రాలేదని ..తాపత్రయపడి ..నాకు మెసేజ్ చేసి మెయిల్ ఐ డి ఇప్పించుకుని అభిప్రాయం పంపారు.  రచయితకు ఇంతకన్నా ఏం కావాలి !? కథ లింక్ ఇక్కడ   బిహైండ్ హెర్ స్మైల్
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు