చాలా రోజుల తర్వాత భాగవతం లోని ఒక భాగం చదివాను. భాగవతుడు అక్రూరుని ప్రసంగమే చదవడం అదృష్టమే.ఈ మత్తేభం నా దృష్టినాకర్షించింది.కలలం బోలెడి పుత్త్రమిత్త్ర వనితాగారాది సంయోగముల్జలవాంఛారతి నెండమావులకు నాసల్ సేయు చందంబునందలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృథాతత్త్వజ్ఞుఁడన్ నాకు నీవిలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ! అర్థము-లక్ష్మీనాథుడవైన కృష్ణా! దప్పిక [...]
అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాలలో కొన్నిఉత్పలమాలలు -ముగ్గురమ్మలు-వీణను చేతఁ బూని యలివేణిగ బ్రోచిన వాణి రూపమైపాణిని శూలమున్నిలిపి భక్తుల గాచిన గౌరి రూపమైరాణిగ, మెండుగా ధనపు రాసుల నిచ్చిన లక్ష్మి రూపమైజాణవు నిల్చితే ! జనని , సంతత భక్తిని నిల్పు నా మదిన్. ప్రవచనకర్త -వేదిక పైన నిల్చి సభ విస్మయమంద వచించు శక్తితోసాదరభావనన్ పరులు సంతసమందగ నుండు భక్తితోసోదరులంచు [...]
శార్దూలవిక్రీడితముకర్మంబందునఁ దక్క నే ఫలములన్ కాంక్షించలేదెన్న, డే దుర్మార్గంబుల క్రుంగుటల్ కనద, వే దుర్వ్యూహముల్ తోచినన్ మర్మంబుల్ సడలంగ జీరు తన సమ్మానంబు వర్ధిల్లగా. ధర్మంబియ్యది నిల్చియున్నది సదా దైవాంశ కన్పట్టగా తీర్మానమ్ముగ నెల్ల వారి శుభముల్ దృక్కోణమందుండగా. అలాగే ఈ ప్రసంగం కూడా వినదగ్గది.https://www.blogger.com/blogger.g?blogID=4174482763145446746#editor/target=post;postID=924532607569542971
కష్టమైన ప్రాసతో గురువుగారిచ్చిన సమస్యకు నా పూరణ ప్రయత్నాలు. సుజ్ఞానమ్మను భిక్షను నా జ్ఞానులు నరులకిడుదు,రప్రతిహతమౌ యజ్ఞతఁ బోగొట్టు కదా విజ్ఞతలే! నట్టి నరుడె విజయముఁ బొందున్. ( ఆ జ్ఞానులనబడే వారే నరులకు సుజ్ఞానమను భిక్షను ఇడుదురు. అడ్డూ ఆటంకమూ లేకుండా పెరిగే అజ్ఞను అట్టి విజ్ఞతలే కదా పోగొట్టును! అని వ్రాశాను. అన్వయము కుదరలేదంటే దిద్దుకుంటాను.) ధర్మ్యమ్మౌ నడవడికయు, [...]
భారతీయం ప్రవృత్తి , నివృత్తి మార్గాలను రెండిటినీ విశ్వసిస్తుంది. బోధిస్తుంది. కానీ ప్రధానంగా ప్రవృత్తిమార్గం ఎందుకైందిఅంటే నివృత్తి మార్గం బహు క్లిష్టమైనది. -- భగవద్గీత -కర్మయోగాన్ని, కర్మసన్యాస యోగాన్ని రెండిటినీ భగవద్గీత వివరిస్తుంది. అర్జునుడు అడుగుతాడుకూడా. కృష్ణా, మీరు ఒకపరి కర్మసన్న్యాసమును, ఆ వెంటనే కర్మయోగమును ప్రశంసించుచున్నారు.ఈ రెండిటిలో నాకు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు