ఇది అలనాటి మాయాబజార్ సినిమాలో ఒక అందమైన సన్నివేశం. ఇక్కడ రచయిత పెండ్యాల నాగేంద్రరావు గారు హిడింబ చేత "అలమలం" అనిపిస్తారు. ఈ మాట విండానికి నవ్వుతెప్పించేటట్టుగా ఉండి, అదేదో అర్ధంలేని మాటగానో లేదా అర్ధంకాని ఆటవిక పదజాలం గానో పొరపడే ప్రమాదముంది. నిజానికి ఇది ఎంతో అందమైన సంస్కృతపదం. అలం అంటే సంస్కృతంలో "చాలు" అని అర్ధం. అలమలం అంటే "చాలుచాలు" అని అర్ధమన్నమాట. ఇప్పుడీ [...]
కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారుండేవారట, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈయన పద్యాలు మంచి సరదాగానూ, తెలివిగానూ చెప్పేవారు. సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.ముందు చెప్పినట్టు [...]
ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడాబ్రాహ్మడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడకదీనుల జంపక దేశంబు నొంపక -- [...]
తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితుడైన మాటల రచయిత, దర్శకుడు, తెలుగంటే ప్రత్యేకమైన అభిమానమున్నవాడూ అయిన త్రివిక్రమ శ్రీనివాస్ (త్రివిక్రమ్) కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక సభలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, సాహిత్య విలువలున్న పాటలకి అంతగా అవకాశం లేని ఉత్త వ్యాపారాత్మకమైన తెలుగు సినిమాలలో కూడా తన సాహిత్య భరిత కవిత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తారో [...]
గురువు గారి 98వ జయంతి సభా విశేషాలు :29 ఏప్రిల్ 2018 నాడు శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన "మహాకవి నండూరి రామకృష్ణమాచార్య జయంతి మహోత్సవ" సభా విశేషాలను, వివిధ పత్రికలలో  ప్రచురించిన అ యా భాగాలను దర్శించండి ...సభాధ్యక్షులు : డా. రాపాక ఏకాంబరాచార్య గారు(ప్రసిద్ధ సాహితీ పరిశోధకులు)ముఖ్య అతిథి : శ్రీ దేవులపల్లి ప్రభాకరరావు గారు (తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు)నండూరి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు