వ్యాసకర్త: ప్రసూన రవీంద్రన్ ************** “బాల్యం నన్ను వెంటాడుతూనే ఉంది” అని త్రిపుర అన్నా, “తియ్యటి బాల్యం లోకి మరోసారి పయనించి రావాలని” ఎనభయ్యవ దశకం, అంతకు ముందు పుట్టిన మనమంతా అనుకున్నా, అందుకు కారణాలు చెప్పమంటే ఏం చెబుతాం? ఎలా చెబుతాం? ఎన్ని చెబుతాం? బాల్యం అన్నమాట తల్చుకోగానే ఆ అనుభూతులు మరోసారి సర్రున నరాల్లో పొంగి మొహం ఎర్రగా కందిపోగా వరుసగా చెప్పెయ్యమూ ..”నది [...]
వ్యాసకర్త: సుజాత మణిపాత్రుని.  బాలల పుస్తకాలు రాసేవాళ్ళు అరటిపండు వొల్చినట్టు కొన్ని ముద్దైన కథలు చెప్తూంటారు.  బాల సాహిత్యంలో కష్టాలూ, కడగళ్ళూ ఉన్నా, ముగింపు పాసిటివ్ గా ఉండేదే మంచి కథ అని నా నమ్మకం.   ఈ రోజుల్లో పిల్లలు ఊహించలేనంత  దారుణాలకూ, దాడులకూ గురవుతున్నారు.  కష్టాలు మనసుల్ని రాటు తేలుస్తాయి. మనుషుల్ని దగ్గరగా కూడా తెస్తాయి, ప్రేమ తో, ఐక్యత తో  కుటుంబం అంతా [...]
సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన విశిష్టమైన భగవతీ చరణ్ వర్మ హిందీ నవల “భూలే బిస్రే చిత్ర” కు తెనుగు అనువాదం ’స్మృతిరేఖలు’ అనే ఈ పుస్తకం. కథాకాలం – 1880 నుంచి 1930 మధ్యన. నాటి భారతదేశం విదేశీదాస్యంలో మగ్గుతోంది. స్వాతంత్ర్యోద్యమం ఊపిరి పోసుకొంటోంది. ఆ రాజకీయ నేపథ్యంలో భారతదేశంలోని మధ్య/ఎగువ తరగతి సాంఘిక జీవనాన్ని, వ్యక్తికి సమాజానికి మధ్య ఘర్ణణను, వ్యక్తిపై సమాజ [...]
వ్యాసకర్త: Sujata Manipatruni పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950) అనువాదం : మద్దిపట్ట్ల సూరి (1920-1995) ************ కొన్ని పుస్తకాలకి గొప్ప చరిత్ర వుంటుంది. ఎప్పుడో చిన్నప్పటి పథేర్ పాంచాలి. సత్యజిత్ రే సినిమా గానే తెలుసు. టీవీలో ఎప్పుడో చూసిన చిన్న బిట్ – వానల్లో బురదల్లో పల్లెలో పడుతూ లేస్తూ నడుస్తూ వస్తున్న పెద్ద మనిషిని ఇద్దరు చిన్న పిల్లలు నవ్వుతూ గమనిస్తున్న దృశ్యమే [...]
వ్యాసకర్త: పూదోట శౌరీలు ****************** ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు రాత్రిళ్ళు కథలు చెబుతూ పిల్లలను నిద్రబుచ్చేవాళ్లు. పిల్లలు గూడా ఆ కథలు వింటూ వూహాలోకంలో విహరిస్తూ, కమ్మని కలలు కంటూ నిద్రపోయేవాళ్లు. ఆ కథల్లో ఎక్కువ నీతికథలే వుండేవి. ఆ నీతులను గూడా ఎక్కువగా జంతువులు, పక్షులు, ప్రకృతి పాత్రలుగా చేసుకుని చెప్పేవాళ్లు. లేదా భేతాళ మాంత్రికుడు, [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు