గత సంవత్సరం కొందరు ఉత్సాహవంతులు 'సమైక్యాంధ్ర' అంటూ భీభత్సమైన హడావుడి చేశారు. మైకు కనబడితే చాలు - 'మన తెలుగు భాష అత్యంత తీయనైనది, మన తెలుగు జాతి అత్యంత పవిత్రమైనది. ఈ భాషని నిలువుగా కోస్తారా? ఈ జాతిని ముక్కచెక్కలు చేస్తారా?' అంటూ భారీ డైలాగుల్తో తెగ రెచ్చిపొయ్యారు.  మన తెలుగు జాతి నిజంగా అంత గొప్పదా? అదే నిజమైనట్లైతే - ప్రస్తుత పరిస్థితుల్లో మన వాదన ఎలా [...]
 ప్రముఖ బ్లాగర్ శ్రీ రాధేమాధవ్ వినాయక చవితి సందర్భంగా చేసుకున్న పూజ వినాయకుడు  పైన వినాయకుడి విగ్రహాన్ని గురించి వ్రాసేప్పుడు  "పూజ విగ్రహం"  అని వ్రాయటం జరిగింది. వినాయక చవితికి పూజ చేసుకోవటం అంటే  మట్టి విగ్రహంతో మాత్రమే చేసుకోవాలి. మరే రకమైన విగ్రహాలకు పూజ చేసినా వినాయక చవితి ఫలితం దక్కదని నిన్ననే నాకు మూగన్నుగా పట్టిన నిద్రలో వచ్చిన కలలో వినాయకుడు [...]
ఈసారి వినాయక చవితికి ఎలాంటి విఘ్నాధిపతి ప్రతిమని తీసుకరావాలన్న ఆలోచనలో నేనున్నాను.. ప్రతీసారీ ఇంటికి దగ్గరలోని వినాయకులని చేసే వారి వద్ద పూజాప్రతిమని తీసుకుంటాను. ఈసారికి ఎప్పటిలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనబడే సుద్దతో చేసిన వినాయకుడి ప్రతిమ బదులుగా మట్టితో చేసిన గణపతిని తీసుకుందామని ఆలోచన. టీవీలలో, పేపర్లలో... మట్టితో చేసిన వినాయకుడిని కొలిచి, పర్యావరణాన్ని [...]
మీకూ,  మీ మిత్రులకూ,  మీ కుటుంబ సభ్యులకూ,  వినాయక చవితి శుభాకాంక్షలు.  శుక్లాం భరధరం విష్ణుం,  శశివర్ణం చతుర్భుజం,  ప్రసన్న వదనం ధ్యాయేత్,  సర్వ విఘ్నోప శాంతయే. 
గత కొన్ని నెలలుగా నాకు ఆందోళనగా వుంది. రాష్ట్రవిభజన అంశం తెరపైకి వచ్చినప్పట్నుండి నాకీ ఆందోళన మొదలైంది. అందుకు కారణం రాష్ట్రం విడిపోతుందని కాదు, ఎక్కడ మా గుంటూరు రాజధాని అవుతుందేమోనని! నాకు మా ఊరంటే చాలా ఇష్టం. ప్రతి ఊరికీ ఒక విశిష్టత వుంటుందిట. నాకిక్కడి ఇరుకు సందులు, గతుకు రోడ్లూ, దుమ్మూధూళీ.. అన్నీ కూడా హాయిగా వుంటాయి. రోడ్డు పక్క బజ్జీబళ్ళూ, కిళ్ళీబడ్డీలు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు