" ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే., చాలే చాలే ఇక చాలే " ఈ పాట పెళ్ళికి ముందు పాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే పెళ్లి అయిన తరువాత పాడితే ఎలా ఉంటుందా అని రాయటం (అదే కంపు చేయటం) మొదలు పెట్టాను. అస్సలు చరణాలు మార్చాల్సిన అవసరమే రాలేదు. పల్లవి || ఇంకేం ఇంకేం ఇంకేం చావాలే... చాలే నీ గోలే... నీకై నువ్వే వచ్చి చచ్చావే .. ఇకపై నా ఖర్మే ..  గుండెల పైనా పాశం వేశావే ..  గుమ్మంలోకి [...]
లవ్వు , నవ్వు లేని మనిషి ఉంటాడేమో కానీ, కొవ్వు లేని మనిషి ఉండడు. అస్సలు ఏమీ చేయకుండానే వచ్చేది ఈ కొవ్వు. ఈ కొవ్వును, దాని ద్వారా వచ్చే బరువును ఎలా తగ్గించుకోవాలో అని, తెగ ఇబ్బంది పడిపోతుంటాం. Gym కి వెళ్ళటం, ఉపవాసాలు ఉండి కడుపు మాడ్చుకోవటం లాంటివి చేస్తూ ఉంటాం. డబ్బులు కట్టి జిమ్ వెళ్ళటమే ఒక ఎత్తు ఐతే, ఈ మధ్య అంత కన్నా వింత ఒకటి చూశా. ముందు మనం $500 కట్టి చేరాలి. మండలం రోజుల్లో, [...]
అర్ధ రాత్రి నిద్రలో నన్ను తట్టి లేపింది.  తను : "పెళ్ళైనా కూడా నాతోనే ఎక్కువ సేపు గడుపుతున్నావు, మీ ఆవిడ ఏమీ అనుకోదా ?" అని నా కళ్ళల్లోకి చూస్తూ అమాయకంగా అడిగింది. నేను తనని నా చేతిలోకి తీసుకుంటూ  నేను : "నువ్వు లేకుండా నాకు రోజు గడవదు. ఎవరేమి అనుకున్నా సరే, నిన్ను వదిలి నేను ఉండలేను". తను : "ఏదో మాట వరసకు అంటావే గానీ, కొన్ని రోజులకే నన్ను కాదని వేరొకదాని దగ్గరకు [...]
ఉదయం :  నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం మౌనంగా… ధ్యానంలో ఉందీ.. మాగాణం.. సాయంత్రం : నిద్దర కొచ్చిన  బద్దకమల్లే ఆవలించిందీ ఆకాశం సెహ్వాగ్ కొట్టిన సిక్సరు బంతై [...]
నిన్న అతడు సినిమా చూస్తున్నానా.... అస్సలు ఆ సినిమా చూస్తున్నంత సేపు తివిక్రమ్ మీద ఈర్ష , అసూయలతో చూశాను. అస్సలు ఆ సంభాషణలు ఎలా రాశాడా అని. అలా మెచ్చుకుంటూ ఉండగానే ఒక పాట వచ్చింది. ఆ సినిమాలో పాటలు, మాటలకు ఏ  మాత్రం తీసిపోవు. ముఖ్యంగా ఆ పాట "సిరివెన్నెల గారు" రాసినది. ఆయన మాటల మాంత్రికుడు అయితే... ఈయన పాటల భేతాళుడు... సాదారణంగా అందంగా ఉన్న అమ్మాయి వెంట అబ్బాయిలు పడుతుంటారు. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు