సంగీతమే ఓ లలిత కళ.  మళ్ళీ దానిలోనూ  లలితమైనది-  లలిత సంగీతం! రేడియో మూలంగానే  ఈ లలిత సంగీతం  పుట్టింది.  సినిమా సంగీత  సునామీని  తట్టుకుని  తెలుగు శ్రోతలకు  చేరువైంది. ఏళ్ళు గడిచినా  మరపురాని స్మృతుల  పరిమళాలను  రసజ్జులకు  పంచుతోంది.  అలాంటి  ఒక చక్కని  రేడియో  పాట గురించి  కొద్ది సంవత్సరాల క్రితం తెలిసింది.  సాహిత్యం మాత్రమే  తెలిసిన ఆ పాటను -  వినటానికి మాత్రం చాలా [...]
‘బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్’  అని ఓ పాత్ర చేత అనిపిస్తాడు  షేక్ స్పియర్ ‘హేమ్లెట్’ నాటకంలో. క్లుప్తంగా  ఉంటేనే  జోక్ కి  విలువా,  సార్థకతా!  సాగదీస్తూ చెప్తేనో,  వివరించే ప్రయత్నం చేస్తేనో  .. ఆ జోకు  దారుణంగా విఫలమైనట్టే. చాలా కాలం క్రితం  ‘రసాయన మూలకాల రహస్యాలు’ అనే రష్యన్ అనువాద పుస్తకం చదివాను. పీఠికలో  ఓ  పిట్ట కథ ఆకట్టుకుంటుంది. అదేంటంటే.. ప్రాచ్యదేశంలో ఓ [...]
‘చందమామ’ పత్రికలో  రాతిరథం, యక్ష పర్వతం   సీరియల్స్ వస్తున్న రోజులు.. వాటిలో  ‘చీకటి కొట్లో బంధించటం’  గురించి చదువుతున్నపుడు ఆ శిక్షను  ఊహించుకుని  మనసులో హడలిపోయేవాణ్ణి. మరి  అలా  అంధకారంలో ఉండాల్సిరావటమంటే  భయంకరమే కదా! చిమ్మ చీకట్లో  వెలుగులు  చిలుకుతూ   నింగిలో  మినుకుమనే   చుక్కలూ,  నిప్పు కణికల్లా  గాల్లో  తేలివచ్చే  మిణుగురులూ  ఎంత ఆనందం కలిగిస్తాయో !   [...]
ఓ  సినిమా ఓ రచన... ప్రేక్షకుల, పాఠకుల  విశేష ఆదరణ పొందినంతమాత్రాన వాటిని మెచ్చని వాళ్ళు  ఉండరని చెప్పలేం. అసంఖ్యాకుల అభిప్రాయానికి  అది తేడాగా ఉంది కాబట్టి... ‘ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక  దారి’ అంటూ వారి అభిప్రాయాలనూ  ఈసడిస్తే... ఆస్వాదన తెలియదని  వారిని  తీసిపడేస్తే.. అది న్యాయంగా ఉంటుందా?  ‘పదుగురాడు మాట పాడియై ధర జెల్లు’ నిజమే. ‘ఒక్కడాడు మాట [...]
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాటల పరిచయం కాదిది... ఆమె పాటలతో నాకున్న కొద్ది పరిచయం!ఆమె గురించీ, ఆ సంగీత ప్రతిభ  గురించీ  ఎన్నేళ్ళ నుంచో  వింటూ వస్తున్నటికీ ఆమె పాటలను పనిగట్టుకుని వినలేదెప్పుడూ.  సంగీతమంటే ఇష్టం ఉండి కూడా,   సుబ్బలక్ష్మి  పాటలను వినాలని అనిపించకపోవడానికి  సినీ సంగీత ప్రభావం  కారణం కావొచ్చు.శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రేడియోలో విన్నపుడు  ప్రౌఢంగానూ,  అదేదో  [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు