పక్షి రెక్కల వేగం పెంచింది చూడు.  అంతాన్ని  సమీపిస్తుంది.నా జీవిత పాత్రని మధువుతో త్వరగా నింపుచెట్ల మీద, కంచెల  నిండా, ఉదయాన్నే ఎన్ని పూవులువిచ్చుకొని, గాలిలో నవ్వుతున్నాయో చూడుపక్కనే ఎన్ని అందమైన పూవులు వాడి,ధూళిలో నశించాయో అదీ చూడు.
చలం నాయికలలో అత్యంత ముద్దుకొలిపే చక్కనిది ఈ చుక్కమ్మ.  చుక్కమ్మ అనే కధలో ఈమెను మనకు చలం పరిచయం చేస్తారు.ఈ కధ చదివిన చాలా రోజులకు కూడా నేను చుక్కమ్మను కొంచం కూడా మర్చి పోలేదు.ఏ నాగరికతా సోకని స్త్రీ కి, ఆమె స్త్రీత్వానికి, కరుణకు, కల్మషం లేని ప్రేమకు ప్రతిరూపం ఈమె. చుక్కమ్మ భర్త, ఇద్దరు పిల్లలతో తమ సొంతదైన కొద్ది భూమిలో నివసిస్తూ ఉంటుంది. భర్త తాగుబోతై ఎవరితోనో గొడవ [...]
అరుణ గురించి వ్రాయటం అంటే ఎంత సాహసమో తెలిసి, చలం నాయికలను పరచయం చెయ్యాలనే ఉత్సాహం తో వ్రాస్తున్నాను.స్త్రీ ని ఎవరు నదితో పోల్చారో (లేక నదిని ఎవరు స్త్రీ గా చెప్పారో) వారు ఎంత చక్కగా పోల్చారు? నది చిన్నగా బలహీనంగా సున్నితంగా మొదలౌతుంది, కొత్తనీరు వచ్చి చేరంగానే ఎన్ని కళలు పోతుంది? ఉరుకుతుంది, అటూ ఇటూ పరుగులు పెడుతుంది. ఏ ఆనకట్టలు ఆమెను ఆపగలవు? సముద్రుని ప్రేమలో [...]
కళ్యాణి అనే పేరుతొ అరుణ పబ్లిషింగ్ వారి పుస్తకం లో కల్యాణి అనే కధ గూర్చి క్లుప్తం గా..కళ్యాణి కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిగా బ్రతుకుతూ ఉంటుంది. తన గతం చేసిన గాయాల వల్ల కావచ్చు తను మగవారంటే విముఖం గా తనకు వచ్చిన కొద్ది పాటి సంగీతాన్నీ రేడియో లో పాడి జీవితం వెళ్ళ దీస్తూ ఉంటుంది. కాని ఆమె అందానికి ఆమె పాటలోని సహజత్వానికి ఎందఱో ఆకర్షితులు అవుతూ ఒంటరి గా ఉన్న ఆమెను [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు