***సంవత్సరమేదో గుర్తులేదు కానీ, అప్పుడే హైదరాబాదు వచ్చిన కొత్త. మల్కాజగిరిలో అన్నయ్యతో పాటు ఉండటవల్ల అవసరార్దం వంట చెయ్యాల్సి వచ్చింది. మోండా మార్కెట్టుకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమి దొరుకుతాయో చెప్పాడు అన్నయ్య. ఓ రోజు నేను ఒక్కడ్ణే వెళ్ళాను. అక్కడ నన్ను ఒక కూరగాయ ఊరించింది. అవి తీసుకున్నప్పటినుంచీ ఎప్పుడు వండుదామా అని కుతూహలంగా ఉండింది. నాకు బాగా గుర్తుంది ఆ రోజు [...]
మనసు శరీరం రెండూ అంతగా అదుపులో లేవు. జ్ఞాపకాలు ఏవీ జ్ఞప్తికి రావటంలేదు. అయినా టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి. పరుగెడుతున్నవయస్సులో వెనక్కు చూడటం కుదరుదు కదా! ఇప్పుడు నిలబడ్డవయస్సులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, సంఘటనలు, తారసపడ్డ వ్యక్తులు, ప్రయాణాలు, మజిలీలు, ....ఇవన్నీలేకుంటే జీవితమెలా అవుతుంది?నన్ను మలుపుతిప్పిన ఒకానొక వ్యక్తి కలిసినచోటుకు [...]
గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం  కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు [...]
 1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్  Chunduri Srinivasa Gupta   ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం ఇంటర్మీడియెట్  కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు,  ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. [...]
గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు. 9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు