ఉదయం పది గంటలకన్నా పది నిమిషాల ముందు  ఎండలు బాగా ముదిరిన మార్చి నెల  ఎండ మాడ్చేస్తుంది.  బురఖా వేసుకున్నామె ఒకరు  బాంక్ లోపలకి ప్రవేశిస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డ్  అడ్డుకున్నాడు. లోపల పూజ జరుగుతుంది చెప్పులు విప్పి  రండమ్మా అని. "ఇదేమన్నా గుడా! బ్యాంక్.  ఇక్కడ అలాంటివి  పాటించాల్సిన పనేంటి? " అంటూ చెప్పులు విప్పకుండానే లోపలికి ప్రవేశించి  చుట్టూ పరికించింది.  ఇంకా [...]
మామూలేగా ... ఉదారవాద ప్రదర్శన పై మనుషులకెందుకో వ్యామోహం క్షణానికో సారి చచ్చి మరుక్షణమేమళ్ళీ పుడుతుండగా నడకలోనూ నడతలోనూ నటనే జీవితమంతా రంగులరాట్నమే అని వక్కాణిస్తూ.. ఎవరిదో ఒక పాదం క్రింద ఆలోచనలని అణగద్రొక్కడం జీవితం ఖల్లాస్ అనుకోవడం మామూలేగా ..
Life is blended with Kitchen వాక్యాన్ని చెక్కుతుండగా కాఫీ ఇవ్వవే .. అంటావ్ అధికారం ధ్వనిస్తూ నిమిషాల్లో బ్లెండెడ్ కాఫీ పొగలు కక్కుతుంది కానీ వాక్యమెక్కడికో జారుకుంటుంది నిసృహగా కలల బరువుతో ఈ రెప్పలు బాధ్యతల బరువుతో ఆ రెక్కలు ఎన్నటికీ విచ్చుకోలేవని నిత్యం సరిక్రొత్తగా అర్ధమవుతాయి. తడిచిన కళ్ళతో పాఠం నేర్చుకుని మరీ ..భోదిస్తాం. అమ్మలూ... వంటిల్లు స్త్రీలకి కిరీటం ఎప్పుడైనా [...]
రమ్మంటే రాదు  ఎంత విదిల్చినా రాని సిరా చుక్కలా   తనంతట తానే వచ్చి  పాతదే అయినా మళ్ళీ సరికొత్తగా వొచ్చి  తిరిగి  పోనట్లు బెట్టు పోతుంది  రాలుతున్న ఆకుల రాగాన్ని  కొత్త చివురులందుకున్నంత గ్రాహ్యంగా  ఆలోచన పోగు అతుక్కోక తగని అవస్థలవుతుంటే  పడమటి సంజె  వెలుగులో సాగే పొడుగు నీడలా  పక్కుమంటుంది, సౌందర్య తృష్ణ మరీ రగులుకుంటుంది   గరిక కొమ్మ మీద నీటి పక్షిలా మనసు [...]
ఒకానొకప్పుడు నిజంగా చెప్పాలంటే  ఓ పదహారు ప్రాయంలో రేడియోలో ఏ పాట విన్నా .. అబ్బా ! ఈ పాట ఎంతబావుంది, ఎవరు పాడుకున్నారో , అబ్బాయి చిలిపిగా నవ్వుకున్నాడా ? అమ్మాయి బుగ్గలు సిగ్గులతో కెంపులయ్యాయా? పాట సాహిత్యం ఎంత బాగుంది ..నీ మనసు నా మనసు ఏకమై ..అంటున్నారు. ఏకమైతేనే ఇలా అనిపిస్తుందా ? లేకపోతే ఇలా అనిపించదా ? ఇలా పాట పాడుకోవాలంటే శోభన్ బాబు లాంటి అబ్బాయిని ఎక్కడ వెతుక్కోవాలి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు