అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ..(నిన్నటి తరువాయి.. )దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు [...]
చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి  వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా [...]
పొద్దున్నే లేవడం లేటైనా వాకింగ్ మానలేక గబగబా తెమిలి బయల్దేరా. మిష్టర్ సూర్యదేవ్ అప్పుడే ఎదురైపోయాడు. వెలుతురు రాకుండా వాకింగ్ చేస్తే బావుంటుంది కానీ ఇలా మిష్టర్ సూర్యదేవ్ వంక చూస్తూ ఆ వెచ్చని చూపులు తనువుని తాకుతూండగా నడవడం కూడా భలేగా ఉంటుంది. లేటవడం కూడా బావుంది అనుకున్నా. ఓ ఎఫ్.ఎం లో గణేష సుప్రభాతం పాడుతున్న బాలమురళీకృష్ణగారి గాత్రం తాలూకూ బేస్ వైబ్రేషన్ [...]
కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "సత్యచరణ్". శ్రీ బిభూతిభూషణ బందోపాధాయ్య బెంగాలీ నవల "అరణ్యక్"కు శ్రీ సూరంపూడి సీతారామ్ గారు "వనవాసి" పేరుతో బహు చక్కని తెలుగు అనువాదాన్ని అందించారు. సౌందర్యారాధకులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైపోయేటటువంటి నవల ఇది.క్రింద లింక్ లో వ్యాసాన్ని చదవవచ్చు:http://www.koumudi.net/Monthly/2014/october/oct_2014_navalaa_nayakulu.pdf
కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని భక్తిని ప్రబోధిస్తాయి. కొన్ని మార్గనిర్దేశం చేస్తాయి. మరికొన్ని తెలివితేటల్ని పెంచుతాయి. ఇన్నింటిలో మనకేది కావాలో ఆ తరహా పుస్తకాల్ని మనం చదవుకుంటూ ఉంటాం. ఇవే కాక కేవలం హాస్యభరితమైన రచనలు కొన్ని ఉంటాయి. అవి కేవలం మానసిక ఉల్లాసాన్ని మాత్రమే అందిస్తాయి. అలాంటి పుస్తకాలు చదువుకునేప్పుడు మన ఒత్తిడులన్నీ మర్చిపోయి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు