గాలికి గుమ్మంతెర కదిలినా చెట్ల ఆకులు జలజలా రాలినట్టు నువ్వు కవిత్వమై రాలవచ్చు గాలిలో గాలి మాత్రమే ఉన్నట్టు శబ్దంలో శబ్దం మాత్రమే ఉన్నట్టు కదలికలో కదలిక మాత్రమే ఉన్నట్టు నీలో జీవితం మాత్రమే ఉంటే  గుమ్మంతెర కదిలినా నువ్వు జీవితమై స్పందించవచ్చు  మరేమీ కాని జీవితానివి మాత్రమే అయినప్పుడు మరేమీ కాని స్వేచ్చవి మాత్రమే అయినప్పుడు వెర్రిబాగుల [...]
వేర్పాటు భావమే మనస్సు, ఏకత్వ భావమే హృదయం.మనస్సు భయాన్నీ, కోరికనీ పుట్టిస్తుంది,హృదయంనుండి ప్రేమా, పంచుకోవటం వికసిస్తాయి.హృదయం ఆనందాన్ని మిగిల్చే బాధ కలిగిస్తే,మనస్సు బాధని మిగిల్చే సంతోషాన్నిస్తుంది.నువ్వు కదిలినపుడు మనస్సువి, నిశ్చలంగా ఉన్నపుడు హృదయానివి.నేను అది, నేను ఇది అనే భావాలే మనస్సు, 'నేను' అనే స్వచ్చమైన స్పురణయే హృదయం.పరిశీలించుకొని చూస్తే మనస్సుగా [...]
నాకు నచ్చిన భావాలను నీకు నచ్చిన మాటలలో చెప్పటం కవిత్వంనీకూ, నాకూ మధ్యనున్న ఖాళీలో శతకోటిభావాలను దర్శించటం కవిత్వంభావాల పంచరంగుల బొమ్మలతో కాసేపు ఆడుకోవటం కవిత్వంపంచ మహాభూతాలని తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలోనిన్ను నువ్వూ, నన్ను నేనూ మరిచిపోవటం కవిత్వందాక్కోవటం కవిత్వం, దొరికిపోవటం కవిత్వందాక్కొంటూ, దొరికిపోతూ అలసిపోయిన నువ్వూ, నేనులుఒకటిగా [...]
'కొన్ని సమయాలు' పత్రికలో చదివిఎవరో మాట్లాడుతూ ఏ సందర్భం ఉద్దేశించారన్నారుఏ ఉద్యమం మీద అక్షరాల నీళ్ళు చల్లుతున్నారని వారి ఉద్దేశ్యంఅది ఏ ఉద్యమం గురించీ కాదుమన అందరి జీవితోద్యమం గురించని కవి చెప్పాడుబాగానే ఉంది కాని, సమాజస్పృహ కావాలి కదా అన్నారు ఆకాశంలో ఎగిరే పక్షినిపంజరంలోని పక్షి ఊచలచాటు నుండి చూస్తూపాపం అది ఆకాశంలో బంధించబడింది ఏంచేయాలో తెలియక [...]
బాగా చిన్నపుడు, ఆలోచించటం నేర్చుకొంటున్నపుడు ముక్తికోసం మునులు తపస్సు చేస్తారని చదివి జీవితం ఇంత అందమైంది కదా, ఆనందనిధి కదా జన్మ ఒక శాపమైనట్టు, పాపమైనట్టు వాళ్ళెందుకు స్వేచ్ఛకోసం తపించారని జనం మధ్య వెచ్చగా బ్రతకటం మాని అరణ్యాలకి వలసవెళ్ళారని అమాయకంగా, వాళ్ళంటే దయగా తలుచుకొనేవాడిని నిద్రపోతున్నపుడు ఊరిలో సడిలేకుండా ప్రవేశించిన వరదలా కబుర్లలో మునిగి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు