పురస్కార గ్రహీతలకు అభినందనలు...
నా "అంతర్లోచనాలు" మంజు మనసు గోల కి దక్కిన గిడుగు రామమూర్తి పంతులు గారి పురస్కారం.
నిర్వాహకులకు, కాంతి గారికి, న్యాయ నిర్ణేతలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ...
రెండో ప్రపంచ యుద్దం మీదా, హిట్లర్ మీదా ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చార్లీ చాప్లిన్ తీసిన ''ది గ్రేట్ డిక్టేటర్'' విలక్షణమైనది.టాకీ చిత్రాలు మొదలైనా మూకీ చిత్రాలనే నిర్మిస్తూ వచ్చిన చాప్లిన్ మొట్టమొదటి సారిగా తన గొంతు విప్పింది ఈ చిత్రంలోనే.రెండో ప్రపంచ యుద్ధం ఇంకా మొదలు కాకముందే 1938లోనే చార్లీ చాప్లిన్ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు. [...]
మనసు
చచ్చిపోయిన క్షణాలు
నాకింకా గుర్తే
ఆంక్షల పర్వానికి
తొలి అడుగు పడినప్పుడు
అర్ధం కాని
ఆ పసితనపు ఛాయలు
ఇంకా కనుల ముందు
కదలాడుతునే ఉన్నాయి
కాలానుగుణంగా
మార్పులు చేర్పులు
అవమానాలు అవహేళనలు
సర్దుబాట్లు దిద్దుబాట్లు
తప్పని జీవితాలై
అలసిన దేహం కోరుకునేది
తన కోసమంటూ
ఆత్మీయతను
అరక్షణమైనా కేటాయించమని
అదే తీరని కోరికగా మిగులుతున్నా
అనునిత్యం అగ్నిహోత్రమై [...]
పురిటి మంచం నుండి
పుడకల శయ్య వరకు
పడిన అడుగులను
అక్షరాలు గుంపుగా చేరి
ఆకాశంలో నక్షత్రాలను
సముద్రంలో అలలను
లెక్కలేయాలన్న ఉబలాటంతో
అదరాబాదరా ఉరుకుల పరుగులతో
అలసటనెరుగక అవిశ్రాంతంగా
శ్రమిస్తూ సాగుతున్న జీవితంలో
చివరకు మిగిలేది ఏమిటన్న
ఆలోచనలకు ముగింపునిచ్చే స్థితిని
ఒంటరితనానికి అందించి
ఏకాంతానికి తావిస్తే
నాలుగు దిక్కుల సహవాసి
ఐదో దిక్కైన [...]