కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది  ఉన్న  వీడియో!దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను.  ‘ఇళయనిలా  పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో  ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది.  సినిమా పేరు ‘మధుర గీతం’.     వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా అనూహ్యంగా , అప్పటికప్పుడు జరిగిన [...]
  ఎదుటి వ్యక్తి పేరును సంబోధిస్తూ సంభాషిస్తుంటే వాళ్ళను ఇట్టే ఆకట్టుకోవచ్చట. మనస్తత్వశాస్త్రవేత్తలు  చెప్పే మాట ఇది! కారణం? ఎవరి పేరు వాళ్ళకు ప్రియాతిప్రియంగా ఉంటుంది కదా? కాబట్టి అలా పిలవటం  నచ్చి, ఆ పిల్చినవాళ్ళమీద ఇష్టం దానికదే వచ్చేస్తుందన్నమాట.  దీనికి మినహాయింపులూ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ పేరు ససేమిరా నచ్చదు. (పాత చింతకాయ పచ్చడి పేరైతే నచ్చకపోవటం [...]
'All is well that ends well' అంటారు.  కథకైనా, సినిమాకైనా తగిన క్లైమాక్స్ లేకపోతే అది వెలితిగా ఉంటుంది.  ఒక్కోసారి ఆ లోపం ఆ కథనో, సినిమానో దెబ్బతీసేదిగా కూడా ఉంటుంది. ‘సాగర సంగమం ’లో చివర్లో  కథానాయకుడి పాత్ర చనిపోకూడదని దర్శకుడు విశ్వనాథ్ భావిస్తే... ఆ పాత్ర చనిపోవాల్సిందేనని కమల్ హాసన్ పట్టుబట్టాడట. ఇక ‘స్వాతిముత్యం’ క్లైమాక్స్ లో ఆ  పాత్ర చనిపోవాలని దర్శకుడు అంటే... [...]
  ఒక వ్యక్తి కళా ప్రతిభలోని ప్రత్యేకత  ఆ  వ్యక్తి  బతికున్నపుడు అంతగా తెలియకుండా... ఆ వ్యక్తి కన్నుమూశాక   తెలిస్తే... ? నాకైతే... ఆ కళాకారుణ్ణి   వ్యక్తిగతంగా  కలుసుకోలేకపోయానని చాలా బాధ వేస్తుంది.   అలా... ప్రతి కళాకారుడి విషయంలోనూ అనిపించకపోవచ్చు.    సినీ సంగీత దర్శకుడు  రమేశ్ నాయుడు అన్నా... ఆయన స్వరపరిచిన  పాటలన్నా  నాకు చాలా ఇష్టం.  ఆయన సజీవంగా ఉన్నపుడు కూడా ఆయన [...]
రచయితలు రాసిన  కథల నిడివిని  కుదించి,  వేరేవాళ్ళు తమ సొంత మాటల్లో చెపితే అది- ‘రీ టెల్లింగ్’. కథ సారాన్ని క్లుప్తంగా చెప్పటం దీని లక్షణం.   రీ టెల్లింగ్ అనే ఈ అనుసరణ కథ.... ఒరిజినల్ కథ పరిధిలోనే  ఉండాలనీ,  కథలోని పాత్రల స్వభావాలను ఏమాత్రం మార్చకూడదనీ ఎవరైనా  ఆశిస్తారు. దానికి విరుద్ధంగా సొంత కల్పనలను జోడిస్తే? అప్పుడది రీ టెల్లింగ్ కాదు... ఫ్రీ టెల్లింగ్  అవుతుంది. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు