ఎనలేని సంపద ఉన్నా ఎదను తాకిన గాయాలను మాన్పలేని జ్ఞాపకాలలో అనుక్షణం నలుగుతున్నా... మదిని కలచిన మౌనాలను అదిలించిన కాలాన్ని చూస్తూ ఎందరున్నా ఎవరూ లేని ఏకాంతంతో స్నేహం చేస్తున్నా.... సడి లేని మనసును తట్టి లేపుతూ ముసిరిన చీకటిలో వెదుకుతున్న వెలుగుల కాన్వాసుపై గీసిన సజీవ చిత్రాన్ని నేనై చేరాలని....!!
వారం వారం మనం చెప్పుకుంటున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం పద కవితా సాహిత్యంలోనూ,  రామయ్యను భక్తితో మురిపించి మెప్పించి తన పేరును రామదాసుగా మలచుకున్న భద్రాచల రామదాసైన కంచర్ల గోపన్న గురించిన వివరాలు చూద్దాం.... మేము చదువుకునే రోజుల్లో పదిలో అనుకుంటా మాకు రామదాసు గురించి ఉండేది... అప్పట్లో నాకు కథలంటే ఉన్న ఇష్టంతో మొత్తం చదివి బాగా గుర్తు ఉంచేసుకున్నా ... రామదాసు [...]
నేస్తం,           నువ్వు నేను ఇలా బోలెడు కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటామా... మరి మన నేస్తాలు అందరు ఇలా ఉండలేరెందుకు...? అప్పటికి ఇప్పటికి స్నేహంలో తేడానా లేక మన మనసుల్లో తేడానా... మనం పలకరిస్తే ఏదో మొహమాటానికి కొందరు మాట్లాడుతుంటారు కాని మనసులో ఉందో లేదో తెలియని ఆ స్నేహం మాటల్లో కనిపించడం లేదు.. జరిగి పోయిన కాలాన్ని ఎలానూ వెనక్కి తేలేము అలానే బాల్యాన్ని కూడా... మన వెంట [...]
1. వెన్నెల వసంతంలో విరిసింది_చెలి చెక్కిలి కెంపుల మెరుపు 2. చెలి మోవిలో కెంపుల జలతారు సిగ్గులు_వెన్నెలకు వన్నెలద్దుతూ 3. వెన్నెల వన్నెలు చిన్నబోయాయి_వసంతానికి కెంపుల వర్ణమెక్కడిదా అని 
ఓ చిన్న శబ్దం శతాబ్ధాలను మరిపించేంతగా జన్మ జన్మల వాంఛలు పేర్చుకున్న ఊహల సౌధాలు కళ్ళముందుగా తారాడుతున్న స్వప్నాల నీడల్లో మాయమౌతున్న నిజమైన అబద్దం వినిపించిన స్వరం ఇంకా గుర్తుంది... ఓ గుప్పెడు గుండె చప్పుడు గుర్తు చేస్తూనే ఉంది ఆ సవ్వడిని ఇప్పటికీ మోసపోయిన జీవితానికి సాక్ష్యంగా అల్లుకున్న బంధం విడివడక సాగుతున్న పయనానికి ఎటూ తేలని గమ్యం ఎక్కడో తెలియని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు