మన అందరికి తెలిసిన ఏడురంగుల ఇంద్రధనస్సే కాకుండా ఎనిమిదో రంగును మనకు పరిచయం చేయడానికి అనిల్ డ్యాని తన కవితలతో మన ముందుకు వచ్చేసారు. ముఖ చిత్రంలోనే ఆ రంగు ఏమిటన్నది చెప్పకనే చెప్పేసారు. యథాలాపంగా చెప్పడం మొదలు పెట్టినా సమాజపు తీరు తెన్నులు ఏమిటనేది ఈరోజు గాయపడ్డ సూరీడుతో రేపటి ప్రభాతమైనా ఆంక్షలు లేకుండా రావాలన్న కాంక్షని, ధర్మస్థలిలో వెలివాడల ఒంటరి కేకల [...]
అంతర్యుద్ధమే అనునిత్యము అలవికాని ఆశల ఆరాటాలకు అర్ధం లేని అనుబంధాలకు నడుమ వెసులుబాటు లేని వ్యాపకాల వ్యామెాహానికి లోనైన మనసుల నిర్వికార వాంఛల నిరోమయాలు కన్నీళ్లకు కట్టుబడని వేదనలను నేలరాలుతున్న జీవితాల రోదనలను అక్షరాలకు పరిమితం చేస్తున్న భావాలు సమాధాన పరిచే వెదుకులాటను వెంటబడుతూ వేధిస్తున్నా వెతలకతలను అంతం చేసే ఆయుధ కర్మాగారమెక్కడని...!!
మాటలు రాని మౌనానికి మార్గ నిర్దేశనం చేసే గురువేమెా ఓడిన ప్రతిసారి బుజ్జగించే అమ్మ ఒడి సేదదీర్పేమెా జ్ఞాపకాలను గుట్టుగా దాచిన పాతకాలపు భోషాణపు పెట్టేమెా కాలంతో పోటి పడుతూ క్షణాలతో పరుగులు పట్టే గమనమేమెా చీకటింటికి ఓదార్పుగా చేరిన కలలను దాచే వెన్నెల కలశమేమెా నాతో చేరి ముచ్చట్లాడుతూ ఆత్మబంధమై మిగిలిన నేనేనేమెా..!!
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు