కన్నీరింకిన కనుదోయి కలత పడుతున్న మనసు కల'వరాల' నడుమ ఊగిసలాడుతున్నాయి  అపసవ్యపు జీవితాలు అర్ధాంతరపు బతుకులు అడ్డదిడ్డంగా అడుగులేస్తూ తడబడుతున్నాయి పరుగులెత్తే క్షణాల కాలం మరచిన గతాల గురుతులు మరలనివ్వని గుండె సవ్వడులైనాయి చేజారిన చేవ్రాలు వెక్కిరిస్తూ వీడని చిక్కుముళ్ళైన వాస్తవాన్ని వద్దని వారిస్తూ వాపోతోంది...!! 
1.  మనసు బాధను మాయం చేస్తున్నా_మౌనగానాన్ని ఆలపిస్తూ...!! 2.  దైవమూ చిన్నబోతోంది_మానవత్వం మరచిన మనుష్యులను చూస్తూ..!!
 నేస్తం,        ఆస్తులు అందరు సంపాదిస్తారు కానీ వాటిని సద్వినియోగ పరిచేది కొందరే. ఆ కొందరిలో నాకు అత్యంత సన్నిహతులు కృష్ణకాంత్ గారు ఉండటం నాకు చాలా సంతోషకరమైన విషయం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నారంటే అది వారి నిరంతర కృషికి నిదర్శనం. మాటలు అందరు చెప్తారు కానీ చేతల్లో ఎంతమంది చేస్తున్నారు అంటే వేళ్ళ మీద [...]
మానవ అద్భుత మేథాశక్తికి మరో రూపమైన  యంత్రాల చేతిలో కీలుబొమ్మలౌతున్న జీవ చైతన్యం సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విజ్ఞానం కొత్త పుంతల ఒరవడిలో పడి యాంత్రికతగా మారుతున్న నేటి సగటు మనిషి జీవితాలు పరిపూర్ణ మానవుని నుంచి అసంపూర్ణ ఉనికిగా మారుతున్న పరిణామ క్రమాన్ని స్వాగతిస్తున్నంత కాలం కొడిగడుతున్న అనుబంధాలు రెప రెపలాడుతూనే ఉంటాయి. 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు