'మారాము చేసానులే...'మూసిన కిటికీ కమ్మీ నుంచిదూసుకువచ్చే వాన సడిలాబిగించిన ఆ పెదాల నుంచిచిన్న మాట!దుఃఖ మేఘం కమ్ముకున్నకనులుదిగులు భారం మోయనన్నతనువూఈ చేతులలో...'గారాము అనుకున్నా..లే!?'నిమిరిన మమత,సవరించిన మాటల ధార..తేటపడ్డ ఆకాశమైఅనుబంధం.
(NRI గా ఎదిగిన తను, పాటకి తనకి నడుమ అనుబంధాన్ని పూర్తిగా తనకి వచ్చిన తెలుగుతో అనుసంధానం చేస్తూ రాసుకుంది.. నేను కేవలం సరైన పర్యాయపదం, వ్యాకరణం సరిదిద్దాను)వరాల వానగా వచ్చిందో గీతం-మునుపెరగని ఆ పరిచయంలో రేగిన వాంఛతో మొదలైయిందీ, బంధం గట్టిపడింది.గానంతో కీర్తి శిఖరాలు చేరే అభిమతం ఉత్సాహపు వెల్లువైంది నాలో...హత్తుకొని మత్తెంకించేసి, బానిసైననాతో రాగాలు కట్టించింది.పాటలుగ [...]
ఈసరికేఇంకొన్ని రంగులుకలగాపులగం చేస్తూపోతుంటాయా అల్లరి మేఘాలు నన్నో, నా ఊహలనో అందబుచ్చుకునినువ్వు సృజించేవర్ణాల వలెనే.. ఒక్కసారిగాఎన్నో చుక్కలు హత్తుకున్నఆకాశంసిగ్గుగా చీకటిలోకితప్పుకుంటుంది, మెత్తగా వత్తిగిల్లిననా తనువులో, కనులు విప్పని చూపులలోనీ జాడమెరుపు నింపినట్లే...!
తడి చుంబనాలతోనేలని ఆవరించుకున్నఆకాశపు ఉనికి, కమ్ముకునే ఉంది ఇంకావాన పెదవులు విచ్చుకుని...పొడి ముద్దులతోధూమ్ర వర్ణపు మేఘాన్ని తోసుకుంటూపుడమి,ఎండ పొడతో పొగమంచు దేహంలో దాగినింగి కౌగిట చేరుతూ..అనునిత్యం!!!
సముదాయింపు సముద్రపు అలలా తీరాన ఆగక వెనుకకు పరుగులు తీస్తుంటే- వేదనలో నానిన మనస్సు సారం పెట్టిన భూమిలా తోస్తుంటే స్థిరంగా తెలుస్తుంది.. విషాదం వెదుక్కునేది సాంత్వన కాదని.ఫలించిన దుఃఖ్ఖం విచ్చి ప్రశాంత విత్తులుగా రాలుతుంటే తెరిపిన పడుతుంది.. మొలకెత్తే భావోద్వేగం శోకం వెలిసాక.ఓ ఘటన అనంతరం- నడి కడలి నీటి వంటి మనస్సు నిదానిస్తుంది..నిరంతరం...!
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు