అలివేణి  ఆధరమ్ములు మకరంధపు ఝరులని తలచి  తుమ్మెద ఝుమ్మని గ్రోలబోవగా  ఇoదువదన సౌదర్యంఇనుమడించ మదనుడినీ మంత్రముగ్ధుని గావించగా  ఉవిద పాదాల పారాణి శోభించ ప్రకృతి పరవశించి పోగా ఎలతీగబోణి కూని రాగాలు ఎలకోయిలకే చలనం తేగా     కలికి  కాటుక కన్నుల కాంతికి కలకంఠులందరికీ కనులు కుట్టగా  చెలియ సిగ సోయగాన మల్లియ మరువం  వెలవెలబోగా జవ్వని జడపాయలు జలపాతాలై [...]
ఎన్నెన్నో అందాలు, వెన్నెల సిరిగందాలు మది బృందావనిచేరే మృధు మందారాలై ఆకాశం నీలి అందాలు అందుకోమంది నాకోసం జాబిల్లి మధువు చిలకరించింది కూనలమ్మ కులుకులిచ్చింది వానలమ్మ వలపులిచ్చింది కోకిలమ్మ కొత్తరాగమాలపించింది పరువాలచిలకమ్మ  పంచాదారపలుకులిచ్చి పలకరించింది సయ్యాటనేర్పింది వయ్యారికలువభామ ఒంపుసొంపులద్దింది సంపెంగపూరెమ్మ పులకింత పంచింది [...]
కాకమ్మ,పిచ్చుకమ్మ కథ వినని వారున్నారా ..! పిచుకమ్మే మన కిష్టమయిన కథానాయిక మనపిట్టకధల్లో ... పిచ్చుకగూళ్ళను చూస్తూ అమ్మ చెప్పే కమ్మని కథలు వింటూ పెరిగాం...  పిచుకమ్మ లేని కమ్మని బాల్యం  ఊహించగలమా ...  చిట్టిపొట్టి పిచుక మట్టికలవబోతుందంటే తట్టుకోగలమా ...  మనకు మచ్చికయిన పిచ్చుక మచ్చుకుకూడా కనబడదంట  బంగారు పిచ్చుక  పిట్ట కధలకే పరిమితమంట   అంతరించబోతుందట అందాల [...]
ఆమాతృమూర్తికి  ఏం తెలుసు ... తను తరిమేయబడ్డానని, కన్నకడుపుకేం తెలుసు కన్నబిడ్డలు  కటిక పాషాణాలని, కలనయినా అనుకొందా ... జన్మనిచ్చుటలో  మరు జన్మమెత్తిన అమ్మనే  అంగడికీడుస్తారని , నడిరాతిరి  నడివీధి కుప్పతొట్టికి తనను కానుకిస్తారని, అరక్షణములో వస్తానని ఆరుబయటే వదిలేసి వెనుదిరిగి చూడకున్నా,.. నీరెండిన కళ్ళతో నిరీక్షిస్తూనే ఉంది,  ఆ అమ్మను చూస్తే  అమ్మతనమే [...]
 ఊది ఊది ఊపిరి ఆగిపోయే వరకు ,పీల్చేసై ,  టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చేసై . జల్సా చెయ్ , .  హద్దులు మరచి,విందులో, కనువిందుగా ,...  మందుతో బహు పసందుగా ...  వెలిగించు రింగురింగులుగా..... పొగ గుప్పించు ఎలాగూ... రేపటి నీ బ్రతుకు ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువే .. మసి పట్టిన ఊపిరితిత్తులెలాగూ నీ ఊపిరితీసి నిను మట్టి కలుపుతాయి.  నీ ఆయువు ఆవిరయినా ...  నిండు బ్రతుకు నీవల్లే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు