"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం  అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్."వీలయితే','నీ కిష్టమైతే ' లాంటి పదాలకు సంసారపు నిఘంటవులో బోల్డన్ని అర్ధాలు కదా?(ప్రస్తుతానికీ విషయం అప్రస్తుతం అనుకోండి)టెన్నిస్ కోర్టు పక్కనే ఓ రెండు నిమిషాల దూరంలో షాపు.ఒక్క పాల డబ్బానే కదా అని తోపుడుబండి లేదా కనీసం అక్కడుండే ప్లాస్టిక్ [...]
"ఏమైనా మాట్లాడొచ్చుగా?"ఈ పదేళ్ళలో లెక్కలేనన్ని సార్లు వినుంటానీ  మాట. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తరచుగా.  ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్న నెదుర్కొన్న ప్రతిసారీ కాకపోయినా కొన్ని కొన్ని సార్లు  ఈ అభియోగాన్ని తిప్పి కొట్టడానికి  చేసే ప్రయత్నంలో ఏదో మాట్లాడుతాను.ఆ మాటలు చాలా వరకు అప్పటి మా ఇద్దరి మనస్థితికీ , నేను (తెచ్చి పెట్టుకొని) మాట్లాడే మాటలకీ  పొంతన [...]
మేమందరం తనని మూగమ్మ అని  పిలిచేవాళ్ళం.మా అమ్మమ్మ తరపు బంధువు.అమ్మమ్మ తరపు బంధువులంతా చాలా వరకు ఏదో కూలీ నాలీ చేసుకొనే వారే. అతి కొద్ది మందికి మాత్రం ఏదో ఎకరం అరెకరం పొలాలు అంతే. అయితే వాళ్ళు కూడా చాలావరకు వాటిని కౌలుకిచ్చి పొలం పనులకెళ్ళేవాళ్ళే .తన అసలు పేరు ఇప్పటికీ తెలీదు.మాటలు రావు  పైగా పుట్టెడు చెముడు కూడా.మొదటిసారి తనని [...]
కొన్ని కొన్ని సార్లు మనం కలలో కూడా ఊహించని సంఘటనలు ఇలలో ఎదురై మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. వీటిల్లో కొన్ని అప్పటికి సీరియస్ యవ్వారాలే. కానీ కాలం గడిచేకొద్దీ అవి కామెడీగా మారి తలచుకున్నకొద్దీ మాంఛి కిక్ ఇస్తుంటాయి. అలాంటివి కొన్ని....*************************************************************************************** చానాళ్ళ..కాదు కాదు చానా ఏళ్ళ కిందట సంగతి. నేను అప్పుడప్పుడే ఒక సాఫ్టువేర్ ఇంజనీరుగా [...]
(గతటపా తరువాయి )కారన్నాక ఆగదా? అన్నట్టు చూస్తున్నాడు యాదయ్య నావైపు.వింతగా, జాలిగా, కోపంగా పళ్ళు పటపట లాడిస్తూ,ఇలా ప్రపంచంలో ఉన్న అన్నిరకాల భావాల్నీ మొహంలో ప్రతిఫలిస్తూ నా కారు రెండువైపుల నుంచీ వాహనాల్ని దూకిస్తున్నారు నగరవాసులు.టీ తాగటం వరకూ శాంతంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు కొద్దిగా కోపాన్ని పులుముకొని నా కారు దగ్గరికొచ్చి కార్లో ఉన్న నన్నూ, యాదయ్యనీ మార్చి మార్చి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు