జైశ్రీరామ్.జైశ్రీమన్నారాయణా!సోదరీ సోదరులకు నమస్సులు.ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవము. ఈ సందర్భముగా మహిళా లోకానికినా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకొంటున్నాను.మహిళాలోకమె మూలమై వెలుగునీ మాన్యప్రపంచంబు. సన్మహిళల్ జీవన మార్గదర్శకులు. ప్రేమన్ బంచి పోషింత్రు. నిస్పృహ పోకార్పుచు నిండు జీవనమిడే సౌమ్యాత్ములీ కాంతలే.మహనీయుండగు బ్రహ్మ వారికిడు సన్ మాంగళ్య [...]
జైశ్రీరామ్.77) తల్లి చేతి ముద్ద పిల్లలకనురాగ  -  బంధమరయఁ జేయు, బ్రతుకఁ జేయు.     తల్లి ప్రేమ కొలుపు మల్లెల మనసును.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి చేతితో పెట్టే భోజనము పిల్లలకు ప్రేమ బంధమును తెలియఁ జేయును. బ్రతుకునట్లు చేయును. తల్లి ప్రేమ మాలో మల్లెల వంటి మనసును కలుగఁ జేయును. జైహింద్.
జైశ్రీరామ్.76) ఎవరి శక్తి నెన్న నెవరికి సాధ్యము?  -  బాలలందు శక్తి ప్రబలకున్నె?     శోధనమున భావి మేధావులము మేము  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఎవరి యొక్క అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యముల నెవరు గుర్తించఁ గలరు? బాలలలో కూడా శక్తి ప్రబలి ఉండునని తెలుసుకొన వలెను. భావి కాలమున పరిశోధనలను చేయు మేధావులము మేమే కదా!జైహింద్..
 జైశ్రీరామ్.75) మమ్ము త్రోసిపుచ్చి మా మాట వినరేల?  -  మాకు విలువ లేదొ? మనసు లేదొ?     మమ్ము కూడ మీరు సమ్మతిఁ గనుఁడయ్య?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్మల్ని లక్ష్య పెట్టకుండా మా మాటలను గ్రహింపరేమి? మాకు మీ మధ్య విలువ లేదా? మమ్మల్ని కూడా మీరు సమ్మతితో చూడండి.జైహింద్.
  జైశ్రీరామ్.74) పిన్నలమగు మేము పెద్దవారిని పోలి   -  చూడఁ గలము. చూచి చెప్పఁ గలము.    చూచి చెప్పనిండు తోచిన భావన.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలమైన మేము కూడా పెద్దవారిలాగే వినకలము, దానికి స్పందించి మా అభిప్రాయము కూడా చెప్పఁగలము. మమ్మల్ని కూడా ఏమి జరుగుచున్నదో చూడనివ్వండి, చూచి చెప్పనివ్వండి.జైహింద్.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు