అంటే మరేమో అప్పట్లోనే మనకున్న బద్దకంతో "ఆ తొందరేముంది మెల్లగా పుడదాంలే, ఐనా ఇక్కడే హాయిగా ఉందమ్మా" అని డ్యూ డేట్ దాటినా కూడా ఎంచక్కా వెచ్చగా అమ్మ బొజ్జలో బజ్జునుంటే ఓ పదిరోజులు ఓపికగా ఎదురు చూసిన మా డాక్టరాంటీ "ఇక నే కలుగజేస్కోకపోతే కుదరదమ్మా" అనేసి నన్ను భూమ్మీదకి తెచ్చేశారని ఇదివరకే చెప్పాను కదా. నా ఆ బద్దకానికి మూల్యంగా నేను రంగు తగ్గిపోవడంతో సహా మరికొన్ని [...]
ఎక్కడనుండో వలస వచ్చిన ఒక అనామకుడిగా మొదలుపెట్టి చిన్న సైజు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు వరద(అరవింద్ స్వామి) తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకి దళపతిలా పనిచేస్తుంటాడు. రెండవ వాడు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్ లో తన దందాని నిర్వహిస్తుంటాడు. మూడవ వాడు రుద్ర(శింబు) సెర్బియా లో అక్రమ [...]
మన దేశంలో తప్పు చేయని వాళ్ళు ఉండవచ్చేమో కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించని వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఉండరనే చెప్పవచ్చు. ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఏ ఒక్కరికీ రోడ్ మీద ఒక్క క్షణం ఎదురు చూసే ఓపిక సహనం అస్సలు ఉండవనే విషయం రోడ్లపై ప్రయాణించే ప్రతిసారి మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి ఒక సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తూ దానిని [...]
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదివినా అడపా దడపా పేరు వినడమే తప్ప ఎప్పుడూ చూసిన దాఖలేల్లేవు ఈ కంచరపాలెం ని కానీ ఇపుడు దర్శకుడు వెంకటేష్ మహా పుణ్యమా అని అక్కడ అణువణువు పరిచయమున్నట్లే అనిపిస్తుంది. సాధారణంగా సినిమాలో చూసిన మనుషుల్నీ, లొకేషన్స్ ని బయట చూస్తే నేనంతగా పోల్చుకోలేను. అదేంటో తాజ్ మహల్ తో సహా ఏదైనా స్వయంగా కళ్ళతో చూసినపుడు ఒక [...]
అమ్మ అంటే లాలనకూ నాన్నంటే క్రమశిక్షణకూ మారుపేరని లోకరీతి కానీ మా ఇంట్లో మాత్రం నాన్నారు మమ్మల్ని సాధారణంగా ఏమీ అనేవారు కాదు అమ్మ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవారు. అదికూడా కోప్పడకుండానే ఓపికగా నెమ్మదిగా తియ్యగా చెప్తూనే మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుండేది. ఒకోసారి అబ్బా ఏంటో అమ్మ ఇన్ని రూల్స్ పెడుతుంది అసలు చెప్పకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోతే బావుండు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు