"సాగరసంగమమే ఒక యోగం.. క్షార జలధులే క్షీరములాయే.. ఆ మధనం ఒక అమృత గీతం.. జీవితమే చిరనర్తనమాయే..." సంగీతం సామవేదం నుంచి పుడితే, నాట్యం మాత్రం నాల్గు వేదాల నుంచీ ఉద్భవించింది. నాట్యమే జీవితంగా, జీవితమే నాట్యంగా గడిపిన ఓ కళాకారుడు, కళను తప్ప కాసుల్ని, కీర్తిని పోగుచేసుకోలేని వాడు, జీవిత చరమాంకంలో తన విద్య మొత్తాన్ని ఒక ప్రియమైన విద్యార్థినికి ధారబోసి, ఆమె నాట్యంలో తనని [...]
"ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి.. జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే..." కర్మ సిద్ధాంతాన్ని రంగరించి సాంత్వన వచనాలు చెప్పడం సులువే. కానీ, అవే మాటల్ని తిరిగి మనకి ప్రియమైన వాళ్ళు, వాళ్ళని గురించి చెబుతుంటే వినడం మాత్రం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు ఓ మేస్టారూ, ఆయన భార్యా. ఆ కష్టం వచ్చింది ఎవరి వల్లనో కాదు, కూతురిలా చూసుకున్న [...]
"నాకులేదు మమకారం ..మనసు మీద అధికారం .. ఆశలు మాసిన వేసవిలో ..." మమకారాన్ని చంపుకోవడం, మనసు మీద అధికారాన్ని వదులుకోవడం అంటే విరాగిగా మారిపోవడమే. జీవితంలో చూడాల్సినవన్నీ చూసేసి, వానప్రస్థాన్ని చేరుకున్న చాలామందిలో ఈ వైరాగ్యం సహజంగానే కలుగుతుంది. అంతే కాదు, తక్కువ జీవితంలోనే ఎక్కువ అనుభవాల్ని - అందునా చేదు అనుభవాల్ని - చూసిన వాళ్ళూ ఈ దశకి త్వరగానే చేరుకుంటారు. అలా [...]
"కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో..కానీ ఆ కడలి కలిసేది ఎందులో..." అన్నీ సవ్యంగా ఉన్నన్నాళ్లూ బంధాలు, బంధుత్వాలూ బహు గొప్పగా ఉంటాయి. ఏదన్నా తేడా జరిగినప్పుడే, మనవాళ్ళు ఎవరు, కానివాళ్ళు ఎవరన్న ప్రశ్నా, ఆ వెంటే జవాబూ వస్తాయి. 'సిరిసిరిమువ్వ' (1976)  సినిమాలో కథానాయికకి ఇలాంటి  పరిస్థితే వచ్చింది. సవతితల్లి  పెంపకంలో పెరిగిన ఆమెకి తన తండ్రి జీవించి ఉన్నంతకాలమూ కూడూ, [...]
"చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగా.. కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ..."నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అవును, 'నవ్వినా కన్నీళ్లే' నవల ఆధారంగా తీసిన 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా ఎప్పుడు చూసినా ఏదో ఒక సన్నివేశంలో కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఒకవేళ చాలా సన్నివేశాలకి మినహాయింపు ఇచ్చుకున్నా, "సమయానికి తగుపాట పాడెనే.." పాటని సినిమాలో భాగంగా చూస్తున్నప్పుడు మాత్రం మనకి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు