"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం  అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్."వీలయితే','నీ కిష్టమైతే ' లాంటి పదాలకు సంసారపు నిఘంటవులో బోల్డన్ని అర్ధాలు కదా?(ప్రస్తుతానికీ విషయం అప్రస్తుతం అనుకోండి)టెన్నిస్ కోర్టు పక్కనే ఓ రెండు నిమిషాల దూరంలో షాపు.ఒక్క పాల డబ్బానే కదా అని తోపుడుబండి లేదా కనీసం అక్కడుండే ప్లాస్టిక్ [...]
"ఏమైనా మాట్లాడొచ్చుగా?"ఈ పదేళ్ళలో లెక్కలేనన్ని సార్లు వినుంటానీ  మాట. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తరచుగా.  ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్న నెదుర్కొన్న ప్రతిసారీ కాకపోయినా కొన్ని కొన్ని సార్లు  ఈ అభియోగాన్ని తిప్పి కొట్టడానికి  చేసే ప్రయత్నంలో ఏదో మాట్లాడుతాను.ఆ మాటలు చాలా వరకు అప్పటి మా ఇద్దరి మనస్థితికీ , నేను (తెచ్చి పెట్టుకొని) మాట్లాడే మాటలకీ  పొంతన [...]
నా కథ కలల తీరం తానా 20 వ తానా సావనీరు లో వచ్చింది. రాయమని ప్రోత్సహించి, వోపికగా నా కథ కి సవరణలు, సూచనలూ అందించిన సంపాదకులు నారాయణ స్వామి గారికీ, ప్రచురించిన తానా కి ధన్యవాదాలు. http://patrika.tana.org/20th-conference-souvenir/#p=259
మొన్న ఆదివారం విజయవాడ రేడియో లో బాలల కార్యక్రమం లో చదివిన కథ. వెనకాల అడవి ఎఫెక్టు వచ్చే సౌడ్స్ కూడా కలిపారుట. :) కలల ప్రపంచం "మాతికా మాతికా.... రా మనం అజ్జున్ వాళ్ళింటికి వెళదాం" పరిగెట్టుకుంటూ వచ్చి అక్క చెయ్య పట్టుకుని లాగడం మొదలెట్టాడు మూడేళ్ళ మయూఖ్. "నా పేరు మౌక్తిక రా బాబూ... అయినా నన్ను అక్కా అని పిలవాలని చెప్పానా" విసుక్కుంది ఏడేళ్ళ మౌక్తిక. "అబ్బా [...]
ఈ నెల కౌముది లో నా పదవ తరగతి జ్ఞాపకాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ ప్రభగారికీ, రాయమని ప్రోత్సహించిన మధుర కీ ధన్యవాదాలు. http://www.koumudi.net/Monthly/2015/february/feb_2015_tenthclass.pdf
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు