నీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రవాహంలా, ఆగక. నువ్వేనా ఇంతగా మాట్లాడుతున్నది.. అనుమానంగా నీ వైపు తిరిగి చూసాను.. ప్రక్కన ఉన్నది నువ్వే మరి.. మాటలూ నీవే, కానీ నీ పెదవులు కదలవేం ? నీ గొంతు అలసిపోదేం ?  బహుశా మాట్లాడుతున్నది నువ్వు కాదు.. నీ మౌనం. విన్నది నేనేనా, లేక నాలో ఉన్న నువ్వా ? ఏమో. మనం వేరు కాకపోతే ఎంత బావుణ్ణు. జ్ఞాపకంలా. 
కవిత్వమంటే ఏమిటో ఇంకా తెలీని రోజులనుంచి, నన్ను ఎంతో ప్రభావితం చేసిన కవి సినారె. కాస్తో కూస్తో రాయడం మొదలుపెట్టాక మెల్లమెల్లగా ఆయన విశ్వరూపాన్ని వీక్షించగలిగాను. కొందరి కవిత్వం ఉత్తేజపరుస్తుంది, మరికొందరిది లాలిస్తుంది, ఇంకొందరిది ఆలోచింపచేస్తుంది.. ఇలా ఎన్నో.. నాకు అర్థం అయినంతవరకూ సినారే విశిష్టత ఏంటంటే ఏ కోవలోకి ఆయన్ని నెట్టలేం. ఆయన కవిత్వం ఒక జీవితం. అందులో [...]
అర్థం కాని మాటలు ఎందుకు నాచే కన్నీళ్ళు పెట్టిస్తాయి. అక్కరే లేని అనుభవాలు ఎందుకు జ్ఞాపకాలై వెంటాడుతాయి.. ఏ దూరం తగ్గించని దారులు.. ఏ గమ్యం చేర్చని దూరాలు.. ఎందుకు నేను ఇంకా ఇంకిపోతున్నా.. నాలోకే.. లేని నా లోకే.. గట్టు ఆవలి సంగతులు ఎందుకు నన్ను పలకరించవు ? నేను లేని కలల్లాగ.. నేను చెప్పని గతం లాగ.. నిన్ను నన్నూ.. అందరినీ.. అంతాన్నీ.. ఇముడ్చుకున్న శూన్యం ఎక్కడ ? నేను లోని నే [...]
(శ్రీ శ్రీ "ఐ" చదివిన ఆవేశంలో..) ఐ గుండె వెలుతుర్లో జ్ఞాపకాలు పోగేస్తూ.. వంతెన లేని తీరాలను ఊహల్లో దాటేస్తూ. ఇంతటి అంతటి విశ్వంలో ఓ అణువునై.. పరమాణువునై.. ఆ నాలోనే ఓ విశ్వాన్ని మోస్తూ. ఐ. నిన్నతో ఆగక.. నేటితో అలవక.. రేపుని తెలీని క్షణాలతో నిర్మిస్తూ.. నిరీక్షిస్తూ. ఐ.
నువ్వు రాసిన కవితనవుతా నీ కన్నీటిలో చినుకునవుతా గెలిపించే గాయన్నై. జ్ఞాపకం లో నువ్వు ని. రేపు లో నీ నీడని. నీ పుట్టుకలో నీ కారణాన్ని నీ చావులో నీ గమ్యాన్ని నువ్వే నేను చెప్పడానికి అర్థమే లేని మాటలా. నీ నేను. నేను. 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు