మేఘ కాదన్నాక కూడా కిరణ్ ఎదురుపడ్డాడంటే ఇప్పుడేం జరుగుతుందో చూడాలన్న ఉత్సుకత కలిగింది రజనికి. సరిగ్గా అదే కారణంగా ఆందోళన మొదలైంది నీలూకి. మేఘ మనసులో భావాలని ఇదీ అని చెప్పడం కష్టం. కానీ ముగ్గురూ తమ ఉద్దేశ్యాలేవీ ముఖాల్లో కనపడనీయకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూలై సంచికలో... ​
2013 జనవరి నుంచి డిసెంబరు దాకా ఏడాది పాటు కౌముది సాహిత్య పత్రికలో 'జర్మనీయం' శీర్షికన వచ్చిన నేను రాసిన వ్యాసాలు అన్నీ కలిపి 'e- పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.  కౌముదికి ధన్యవాదాలు.
పరీక్ష రాయడానికి వెళ్ళిన రజని ప్రేమలేఖ తీసుకొచ్చాననడం, నీలూ రజని మీద కోపంగా ​అరవడం చూసిన రేవతి ఇద్దరినీ శాంతింపచేసి “మీరిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. అలా పక్కకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం పదండి”అంటూ పక్కనే ఖాళీగా ఉన్న క్లాసురూంలోకి తీసుకెళ్ళింది.​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూన్ సంచికలో... 
​వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..
నడిరాత్రి నిద్రలో మెలకువొచ్చేసరికి ఇంటి పైకప్పుకి ఏటవాలుగా ఉన్న కిటికీ అద్దాల మీద దడ దడమని దురుసుగా దూకుతున్న వాన చినుకుల చప్పుడు. ​ఊరంతా నిద్రలో మునిగి తన ఉనికిని ఎవరూ పట్టించుకోకపోయినా నాకు ఇవ్వడమే తప్ప ఎదురు ఆశించడం తెలీదన్నట్టు నిర్విరామంగా చీకట్లో కురుస్తూనే ఉంది వాన. నిద్ర పూర్తిగా విదిలించుకుని పారిపోయాక కళ్ళు తెరిచి కిటికీ మీద కురుస్తున్న వానధారల [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు