'Z 24 గంటలు' ఈ రోజు ఒక ప్రయోగం లాంటిది చేసింది. ఇది నాకైతే చెత్త పోలిక అనిపించింది. మీకు సృజనాత్మకత అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. మెజారిటీ మీద మెజారిటీ సాధిస్తూ మరొక సారి సిద్ధిపేట ఉప ఎన్నికలో జయకేతనం ఎగురవేసిన  హరీష్ రావు ను టెండూల్కర్ తో పోలుస్తూ 'హరీష్ టెండూల్కర్' అనే శీర్షికతో ఒక స్టోరీ ప్రసారం చేసింది ఆ ఛానల్ ఈ సాయంత్రం. రాజకీయ వార్తల మధ్య టెండూల్కర్ బొమ్మ [...]
Special Cover : THIRUMALA - PICTORIAL POSTMARK Date of Issue : 06-11-1976తిరుమల  శ్రీ వేంకటేశ్వరాలయం చరిత్ర లో మనకు వెంటనే స్పురించే వారిలో మొదటి వాడు అన్నమయ్య అయితే రెండోవవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.శ్రీ కృష్ణ దేవరారాలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల మాట ఎటు తెలకపోయిన వారి విగ్రహాలు మాత్రం గుడిలో బద్రంగా ఉన్నాయి. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా తెలుగు వారు వారిని ఒకసారి గుర్తుకు [...]
“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనం రాసిన ముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో.మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, [...]
బృ౦దావన౦లో ప్రసిద్ధి గా౦చిన దేవాలయాలలో " బా౦కే బిహారీ దేవాలయ౦" ఒకటి. భగవానుడు అక్కడ యుగళ విగ్రహ రూపాన ఆవిర్భవి౦చెను. ఆ రోజున బృ౦దావన౦ అ౦తా ఒక గొప్ప ప౦డుగ జరుపుకు౦టు౦ది. ఆ రోజు రానే వచ్చి౦ది. ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి దేశ విదేశాల ను౦డి కూడా లక్షల స౦ఖ్యలో భక్తులు విచ్చేసారు. యువకుడు కూడా తన బాబాయితో, తమ్మునితో కలసి ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి బయలుదేరాడు.
ఈ టపా రాయడానికి కారణం నిన్న మా డాక్టర్ చెప్పిన మాటలు. ఇవే మాటలు నేను ఎంతో మందికి ఎన్నో సార్లు చెప్పాను. విన్నాను కూడా.కాని ఎందుకో ఈసారి ఈ మాటలే నా మనసును కెలికి ఆలోచింప చేసాయి. ఏంటంటే.. జీవితం అన్నప్పుడు ప్రతీ ఒక్కరికి సంతోషం, బాధ , ఆవేదన, ఆవేశం ,ఆనందం అన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అనుభవం. ఒక్కో ఆలోచన. ఈ మనసు ఉందే. చాలా చిత్రమైంది. అది మనలను ఆడిస్తుందా? మనం దానిని [...]
పిల్లల ఆట లాగ ఖాళీ చేసిన స్థానాల్లొనే మళ్ళీ పోటీ చేసి, ప్రజల నెత్తిన కోట్ల రూపాయల ఖర్చుతొ వుప ఎన్నికలని రుద్ది,  గెలిచాం అనిపించుకున్న మాత్రాన తెలంగాణా రానే రాదు.  ప్రత్యేక రాష్ట్రం కావాలంటే దానికి అన్ని ప్రాంతాల వారి అంగీకారం, సహకారం తప్పని సరిగా వుండాలి.  సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి సైతం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించాక  [...]
కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో నేను చూసిన ట్వీట్. Ruthakers: My husband just became a fan of Glenn Beck on Facebook. I just become a fan of divorce, single Moms, and pole dancing to support my future. దీనికి మీరే వ్యాఖ్యాతలు.
ప్రజా తీర్పును గౌరవిస్తా అనే అర్హత ప్రస్తుత పాలకులకు ఉందా? ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడక దొడ్డి దారిన దొరికిన కుర్చీ మీద కూర్చొని ప్రత్యర్ధుల దారి మళ్ళించడం కోసం ఎగదోసిన వేర్పాటు వాదం వెర్రి తలలు వేసి ఉన్మాదంగా మారి ఉసురులు తీస్తుంటే చేత గాక చేష్టలుడిగి చూసి ప్రజా ధనాన్ని మరోసారి పరీక్షకు పెట్టి నిన్నటి వరకు ఒకటి వచ్చినా బోనస్ అని తెచ్చేదీ మేమే ఇచ్చేదీ మేమే [...]
ప్రజ్వలిల్లే కాంతులీనే సూర్యరశ్మి తాకగా.. పుడమి పైన జననమెత్తె జీవరాశి మెల్లగా.. నిరుడు చూస్తే నరుడు లేడు.. నేడు చూస్తే అంతయు... కరుణ లేదు.. కలుగ లేదు.. ఱేడులే జగమంతయు... తఱువు చెరువుల ధరిత్రిని....తరిగించు "వాడ" లెందుకు? మనువు మనసుల మనిషిని...కఠినయించు కాంక్షలెందుకు? ఇంటి కూడు చేదు చప్పన. . .సంత రుచికై నెపములెందుకు? సొంత దుద్దు చెమట కంపురా...పరుగు పొరుగు  [...]
మాకు తెలుసు మావాళ్ళే చేతగాని వాళ్ళని పనికొచ్చే పని ఒకటీ చెయ్యలేదని మాది అని నసపెడితే భరించలేక నీ చావు నువ్వు చావు అని ఓ రోజు మొహాన కొడతారనే ఆశ ఆశతో పాటు ఇంటిలో ఒకటే నస నువ్వే నాకు ఊకొడక పొతే ఎదుటివాడు ఎలా ఒప్పుకొంటాడు అని వాడి ముందు గౌరవానికైనా సరే అనమని సతాయిస్తుంటే మరో సారి సరే అంటున్నా ఏ మూలో ఓ ఆశ భరించలేక నీ చావు నువ్వు చావు [...]
ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తెలంగాణా వాదానికి స్పష్టంగా పట్టం కట్టాయని తెలుస్తోంది. అయితే దీంట్లో మనం గమనించ వలసిన మరో కోణం ఉంది. అది ప్రజల్లో వచ్చిన స్పష్టమైన మార్పు. ప్రజలు డబ్బు, ఇతర ప్రలోభాలను పూర్తిగా తిరస్కరించడం చాలా శుభ పరిణామం.ఎన్టీ రామారావు కాలం వరకూ ప్రజలు దాదాపు నిస్వార్థంగానే వోటు వేసే వారు. కాక పోతే తమ వోటు విలువ తమకే తెలిసేది కాదు. అమాయకత్వంతో తమ మీద [...]
విశ్వ కథా వేదిక "విపుల" ఆగస్ట్ సంచికలో నా "చినుకులా రాలి" కథ వచ్చింది.అది రొమాంటిక్ కథల సంకలనం.కేవలం ఎస్.ఎం.ఎస్. లతో రాసిన కథ "చినుకులా రాలి".ఇది ఒక కొత్త తరహా కథ.(అని నేను తెగ ఫీల్ అయిపోతున్నాను)చినుకుల కాలంలో చినుకుల కథ... చదవమని కోరుతూ..చదువుతారని ఆశిస్తూ..- గోపరాజు రాధాకృష్ణ  
హాస్టల్ కి వచ్చానే కానీ మనసంతా ఏదో దిగులు.మరునాడు నా పుట్టినరోజు.రాత్రి 12 గంటలకి హీరో నుండి ఫోను.సేం రియాక్షన్ నా నుండి తన గొంతు వినగానే.వల వలా ఏడ్చేసా.ఎందుకో తెలీదు.ఏదో దిగులు.మొదటి సారి పుట్టినరోజు నాడు ఏడ్చాను నేను.మరునాడు కాలేజీ కి వెళ్ళాకా కాస్త కుదుట పడ్డాను.ఇక అటూ ఇటూ ఉత్తరాల ఊసులు ప్రవాహం మొదలు.పాపం హీరో ఫోను చెయ్యాలి అంటే వాళ్ళ హాస్టల్ నుండి ఒక 4-5 కిలోమీటర్లు [...]
అమెరికా అనుభవాలు- 16 నిద్రపోని నగరం అద్భుతమయిన నగరాలు చాలా వుంటాయి, కానీ లాస్ వెగాస్ మాత్రం అద్భుతాల నగరం.ఒక అద్భుతాన్ని చూసి ఔరా అని ముక్కున వేలేసుకునే లోపునే మరో అద్భుతం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా జూదాలు ఆడేవారికీ, ఆనందమె జీవిత మకరందం అనీ, సుఖపడితే తప్పులేదురా అనీ పాటలు పాడుకుంటూ జీవితాన్ని హాయిగా గడపాలనే వారికీ - ఈ నగరం వారి కలల రాజధాని. [...]
ఒక ప్రమాదం వలన కోమాలోకి వెళ్లిపోయిన 6 సంవత్సారల రాధిక అనే పాప కోమాలో నుండి బయటకు వస్తుందని కేరళా రాష్ట్రంలోని ఆలపుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు కలలో కూడా అనుకోలేదట. కానీ ఈ చిన్నారి 2 నెలలలోనే కోమాలోనుండి బయటపడటం అక్కడి డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, మందులతో ఎటువంటి కదలికలూ లేని ఆ చిన్నారి సంగీత వైద్యంతో పుర్తిగా కోమాలోనుండి [...]
రాచకొండ విశ్వనాధ శాస్త్రి రావి శాస్త్రి గా పేరొందిన తెలుగు పాఠకుల అభిమాన రచయిత ఎన్నో కధలు, నవలలు, నాటికలు వ్రాసారు. శ్రీ శాస్త్రి గారు 1922, జూలై 30 వ తేదీన శీకాకుళం లో జన్మించారు. ఆయన రచనలన్నీ ఒకే చోట ఏర్చి కూర్చి రాచకొండ విశ్వనాధ శాస్త్రి రచనా సాగరం పేరిట మనసు ఫౌండేషన్ వారు శ్రి బాపు ముఖచిత్రంతో 1373 పేజీలతో పుస్తకాన్ని ప్రచురించారు. శ్రీ రావి [...]
ఈ రోజు నా నోటికి తాళం Filed under: విచిత్ర చిత్రాలు
ఈ రోజు మా సాయి (మా అబ్బాయి )తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకుని"పదో సంవత్సర ము "లోకి అడుగుపెడుతున్నాడు .పిల్లలు ఎంత తొందరగా ఎదిగి పోతారో .అప్పుడే వాడికి పదేళ్లు వచ్చేసాయా అన్పిస్తుంది. వాడి అల్లరి చేష్టలు,చిలిపి పనులు ,చిన్నప్పటి సంఘటనలు ముద్దు ముద్దు కబుర్లు ,అక్క తో వాడి పోట్లాటలు చాలా గుర్తున్నాయి కానీ ,ఇంకా చాలా తీపి జ్ఞాపకాలను కాలగమనం లో మర్చిపోయి ఉంటాను . [...]
" మాధవి కి ఏదో ఎఫైర్ వుందట.” అనగానే" కథ కి మంచి బిగినింగ్ఇది . కథ, నవల ఇలాంటి వాటితో మొదలైతే పాఠకులు ఆ సస్పెన్స్ కి చివర దాకా చదువుతారని ఇక్కడ వర్క్ షాప్స్ లో చెప్తారు" అన్నాడు కౌశిక్ ఏ మాత్రం సీరియస్ నెస్ లేకుండా." నీకు పుస్తకాలు చదవటం ఎక్కువై, లైఫ్ కూడా కథ గానో, నవల గానో చూస్తావా?” అంది నెమ్మదిగా వీపు మీద ఒక చిన్న దెబ్బ వేస్తూ.." కథల్లో జీవితం వుండాలని చూస్తాము. మరి జీవితం [...]
అమెరికా అనుభవాలు - 15కారులో షికారుకెళ్ళే ........మా అమెరికా యాత్రలో మరో అత్యద్భుత ఘట్టం నవంబర్లో మొదలయింది.ఒక వీక్ ఎండ్ కు అటూఇటూ సెలవులు జోడించి లాల్ – గ్రాండ్ కేనియన్, లాస్ వెగాస్ - ట్రిప్ కు ప్లాన్ చేసాడు. నిజానికి మేము సియాటిల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి నెల రోజుల ముందుగానే- హోటల్ గదులు, మేము చూడబోయే ప్రదేశాలలో ఎంట్రీ టికెట్లు ఇంటర్నెట్ లో బుక్ చేసాడు. నేనూ, మా [...]
నాటక లేదా సినీ కళాకారులను చూస్తూ వింటూ వినోదాన్ని పొందుతాము. సినీ కళాకారులైతే వారి నటనకు సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో అనేక తళుకు బెళుకులను జోడించి మరింత ఆకర్షణీయంగా చేయగలరు. రేడియో కళాకారులు, పూర్తి శబ్దం మీద మాత్రమె ఆధారపడుతూ అద్భుతమైన కార్యక్రమాలను తయారు చేసి (మనకు ఈ టి వి పూనకాలు రాకముందు) ఎంతో ఆరోగ్యకరమైన వినోదాన్ని దశాబ్దాల పాటు అందచేసారు. ఒకరు కాదు ఇద్దరు [...]
పేజీ :    తరువాత >  

Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు