గోధుమ/వరి లేని భోజనంఈ మధ్య గోధుమలు/వరి లేని భోజనం తింటం మొదలుపెట్టాను.అనగానేమి అని బుర్రగోక్కోటం వేస్టు.గోధుమ ఉత్పత్తులు, వరి ఉత్పత్తులు అనగా - బ్రెడ్డు రొట్టెలు గట్ర, బియ్యపన్నం గట్ర లేకుండ లాగించటం.ఎలాగెలాగా అనుకోవచ్చు తప్పు లేదు.మధ్యాహ్నం భోజనానికి క్విన్వా/మొలకెత్తిన సజ్జలు/జొన్నలు/రాగి/సామలు/కొర్రలురాత్రిపూట ఆకులు అలములు రాగిజావ లేక తోఫు.
మనసంతా చికాకుగా ఉందిదొడ్లోకి వెళ్ళానుసొరకాయ కనిపించింది తీగకికోసుకొచ్చానుజానెడు ముక్కకి తొక్కతీసితాలింపులో సొరకాయ ముక్కలేసి మూత పెట్టిఇంకో పొయ్యిమీద ఎసరుపోసి ఎసట్లో దోసెడు ఓట్లు పోసిస్నాన *పానాదులు* కానిచ్చిసొరకాయ ఇగురులో చిటికెడు ఉప్పేసిఉడికిన ఓట్లను ఆపేసిసొరకాయ కూరని కట్టేసిగీతాంజలి సినిమాని పెట్టుకుని చూస్తూ
అలా దొడ్లోకి వెళ్ళిదాసపాదు లోంచి మంచి దోసకాయని కోసుకుని జేబులోవేసుకుని అటు పక్కనున్న మిరప మొక్కలదగ్గరకెళ్ళి ఓ రెండు మిరపకాయలు కోసుకుని భాండి పెట్టి, నూనెపోసి తిరగమాతపెట్టి, కొంచెం పసుపువేసి, మిరపకాయలు కోసేసి దాంట్లో వేసిఇందాక కోసుకొచ్చిన దోసకాయని ముక్కలుకోసేసి దాంట్లో వేసి కొంచెం ఉప్పు జల్లి మూతపెట్టి ముక్క మెత్తబడగానే దింపేసి కుమ్మటమే!
మా చిన్నప్పుడు ఎండ్లకాలంలో కూరగాయలు రావు కాబట్టి, వాట్ని ఎండబెట్టి దాచిపెట్టుకునేవారు. వాటిని వరుగులు అనేవారనుకుంటా. అమెరికా లాంటి దేశాల్లో ఫ్రోజన్ ఫుడ్ లభిస్తుందనుకోండి ఏ సీజనులోనైనా. ఓ రకంగా వరుగు అనే విధానం అంతరించినట్టేనేమో.కాస్తో కూస్తో కమర్షియల్ స్థాయిలోనైనా బతికున్నది వడియం.ఈరోజు మేము సగ్గుబియ్యపు వడియాలు పెట్టుకున్నాం.
అంటే ఏంటి అనడక్కుచద్దన్నం డేగిషా నిండా ఉంటే ఏంజెయ్యాల్నా అని అలోచిస్తాకూకోకుండగ తిరగమోత బెట్టిసన్నంగ మిరగాలు తరిగేసిఅందులో పసుపు కుమ్మిసన్నంగా నాజూక్కా తరిగిన ఉల్లిగడ్డ కుమ్మిబాగా ఏపించికొరివికారమో సింతకాయపచ్చడో గోంగూర పచ్చడో కావాల్సినం కుమ్మిఅన్నం పొడిపొడి కలిపికుమ్ముకోటమే
అనఘ తయ్యారు చేసిన మొట్టమొదటి వంటకంనాకు బాగా నచ్చిందోయ్!ఐసుక్యూబులు చేసే ట్రేలోఒక స్ట్రాబెర్రీ ముక్కఒక బ్లూ బెర్రీఒక బ్లాక్ బెర్రీ వేసికొబ్బరి నీళ్ళతో నింపిడీపు ఫ్రీజరులో పడేసి గడ్డకట్టినక మింగటమే
చెటాకు పాలకూరఆరు కేలు ఆకులుచెటాకు పార్సులీ ఆకులురెండు యాపిళ్ళుఒక ఖీరా దోస్కాయరెండు సెలరీ చెక్కలుపావలా కాసంత అల్లం
ఆరు స్విస్సు ఛార్డు ఆకులుగుప్పెడు ఆకుపచ్చ ద్రాక్షాఅర ఖీరా దోస్కాయ ఒక గ్రీను యాపిలుపావలా కాసంత అల్లం
నాలుగు కొత్తిమీరకాడలు రెండు ఖీరా దోస్కాయలురెండు గ్రీను యాపిళ్ళుమిక్సింగు వేసినాక ఒక నిమపాయ కుమ్ముడు
రెండు సెలరీ కాడలుఅర ఖీరా దోస్కాయమూడు స్విస్సు చార్డు ఆకులురెండు కేలు ఆకులురెండు యాపిలు కాయలు
రెందు చటాకులు పాలకూరనాలుగు కేలు కూరఒక గుప్పెడు అనాస ముక్కలురెండో మూడో పుదీనా ఆకులురెండు గ్రీన్ యాపిల్స్
బ్రస్సెల్ స్ప్రౌట్ చూట్టానికి చిన్న కోసుగడ్డలాగా ఉంటుంది. కోసుగడ్డ అంటే క్యాబేజి. ఇది కోసుగడ్డ కుటుంబానికి చెందిందే.వికీవిక్కేశ్వరరావు గారు ఇలా చెప్పుకొచ్చారు-The Brussels sprout is a member of the Gemmifera Group of cabbages (Brassica oleracea), grown for its edible buds.The leafy green vegetables are typically 2.5–4 cm (0.98–1.6 in) in diameter and look like miniature cabbages. The Brussels sprout has long been popular in Brussels, Belgium, and may have originated and gained its name there.[1]Nutrients, phytochemicals and research[edit]Raw Brussels sprouts contain excellent levels of vitamin C and vitamin K, with more moderate [...]
ఒక బత్తాయిఅర ఖీరా దోసకాయమూడు సెలరీ కాడలుఒక యాపిలుమిక్సీలో కుమ్మినిమ్మబద్ద పిండి కుమ్ముడు
ఒక ఖీరా దోసకాయయఒక గ్రీన్ యాపిలుసగం కప్పు అనాసనాలుగు కేల్ ఆకులుముడు స్విస్ ఛార్డ్ ఆకులుఒక మిక్సరుఒక గ్రైండరుఒక గ్లాసు
మూడోరోజుఅర తలకాయ రొమైన్ లెట్యూసు రెండు చెటాకులు పాలకూరరెండు కేల్ ఆకులుపది కొత్తిమీర కాడలురెండు గ్రీన్ యాపిళ్ళుమిక్సింగుచేసి ఒక నిమ్మ బద్ద పిండి కుమ్మింగ్స్ దీన్ని డిటాక్స్ గ్రీన్ జ్యూస్ అంటారటాఎందుకుటా? ఏమోటా! తెల్లవారుఝామున నాలుగప్పుడు ఆకలేసింది చూద్దాం ఎలా వెళ్తుందో ఈ ప్రయత్నం -- --Thanks and RegardsBhaskar Ramarajuhttp://www.linkedin.com/in/ramarajubhaskar
రెండోరోజుఅయిదు చెటాకులు పాలకూరమూడు కేల్ ఆకులుమూడు సెలరీ ముక్కలుఅర కీరా దోసకాయరెండు ఫుజీ ఆప్ పిళ్ అనగా యాపిలుమిక్సీ కుమ్ము నిమ్మబద్ద పిండుగబుక్కున మింగు 
రెండు కప్పులు అనాసఅయిదు కేల్ ఆకులు౧ కీరా దోసకాయఒక మిరపకాయమిక్సర్లో వేసి కుమ్ముడు 
ఇలా చేసి చూడండి1. ఒక అరడజను బ్రస్సెల్ స్ప్రౌట్స్ నిలువుగా కోసి2. ఒక నాలుగు మిర్చి ఒక్కోదాన్ని నిలువుగా చీరి, సగానికి అడ్డంగా కోసి3. నాలుగు గాజరగడ్డలను చూపుడు వేలు రెండో కణితి సైజంత తరిగి4. ఓ నాలుగు యాస్పరాగస్ నాలుగు ముక్కలుగా కోసి5. ఓ బెంగళూరు మిరయాని సన్నగా నిలువుగా కోసి6. ఓ నాలుగు బ్రొక్కోలి పువ్వులు తీస్కొని7. ఉల్లిగడ్డలో పావు వంతు తీస్కుని8. పావలా కాసంత అల్లం సన్నగా [...]
బ్రస్సెల్ స్ప్రౌట్ చూట్టానికి చిన్న కోసుగడ్డలాగా ఉంటుంది. కోసుగడ్డ అంటే క్యాబేజి. ఇది కోసుగడ్డ కుటుంబానికి చెందిందే.వికీవిక్కేశ్వరరావు గారు ఇలా చెప్పుకొచ్చారు-The Brussels sprout is a member of the Gemmifera Group of cabbages (Brassica oleracea), grown for its edible buds.The leafy green vegetables are typically 2.5–4 cm (0.98–1.6 in) in diameter and look like miniature cabbages. The Brussels sprout has long been popular in Brussels, Belgium, and may have originated and gained its name there.[1]Nutrients, phytochemicals and research[edit]Raw Brussels sprouts contain excellent levels of vitamin C and vitamin K, with more moderate [...]
అన్నం ఎలా వండాలి అనేదానిమీద కూడక టపా నూకుతారా అనుకోమాకా!కలికాలం. ఎవైనా నొక్కిజెప్పకపోతే ఎట్టాఫేసుబుక్కులో ఓ రచ్చబండకాడి సెర్చఏందయ్యా అంటేఅదే బియ్యంఅదే డేగిశాఅదే కొలతఎందుకు ఉడకలా అనిమంచి సెర్చేవారెమ్మటికి నులకమంచానికానుకుని సుట్టతాగుతా కూకున్ననేను ఈ సెర్చని ఓరగంట సూసిఎహె! లాబంలేదహేఓ టపా నూకాల్సిందేని ఇట్టా వచ్చినాఅన్నం రెండ్రకాలుగా [...]
చారుకాసే గిన్నెలోఓ సెంచా నెయ్యివేసి పోపుప్వెట్టాలంట అంటే?నెయ్యికాగంగనే జిలకర ఆవాలు కరివేపాకు వేసి చిటపటలాడంగనే ఇంగువ కుమ్మి, దాంట్లోనే ఓ రెండు పండుటమాటాలు పిసికేసి నీళ్ళు పోసి, రుచికి కావాల్సినంత సింతపండు నీళ్ళలో నానబెట్టి పిసికి రసం పోస్కోచ్చు లేక ఆపాట సింతపండు వేస్కోచ్చు, పసుపు వేసి, ఓ రెండు వెల్లుల్లి కుక్కి పొట్టుతీసి వేసి, ఓ ఐదురూపాయిబిళ్ళంత అల్లం [...]
రెండు డబ్బాల బియ్యం, ఒక డబ్బా మినపగుండ్లు, ఒక స్పూన్ మెంతులు, చెటాకు అటుకులు - నానపెట్టు.ఓ నాలుగోఐదోఆరో గంటాలు లేక నానినై అన్నాక *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును*.అలా వచ్చిన అట్టు పిండిని ఒవెన్లోనో బంధించు. ఫర్మెంట్ అవ్వాలి. పిండి పొంగుతుంది. అదన్నమాట. స్! ఓవర్నైట్ పిండి పులవనివ్వు.మర్రోజు పొద్దున్నేస్నానం గీనం చేయ్యంగనేపొయ్యికాడికిబోంగనేపిండి బయటకిలాగంగనేసిప్పగంటెతో [...]
రెండు డబ్బాల హోల్ పెసరపప్పుకి ఓ పిరికెడు బియ్యం పోసి ఓ ఆరు గంటలో ఎందిగంటలో నానబెట్టి నీళ్ళు ఒంపేసి వెట్ గ్రైండర్లో *ఇచ్చట రుబ్బింగ్ వేయబడును* చేసేప్పుడే ఓ పదో ఇరవైయ్యో పచ్చిమిర్చి వేసి రుచికి ఉప్పు కలిపి *పెసర అట్టుకి* క్కావాల్సిన పిండిని సిద్ధం చేస్కుని మరోవైపు ఓ ఉల్లిపాయని సన్నగా తరిగి, ఓ పావలా బిళ్ళంత అల్లం [పావలా బిళ్ళంత అల్లం కావాల్నంటే కార్ అమ్ముకోవాల్సిన్ [...]
రాత్రి వంట చేస్కుందాం, ఏవున్నాయో ఫ్రిజ్ లో అని చూస్తే పండిపోతున్న రామ్ములక్కాయలు కనిపించాయి. సరే అని రామ్ములక్కాయలు ఓ మూడు చేతిలోకి తీస్కుని, మిరగాయలు తిద్దాం అని కింద సొరుగు లాగితే మొన్న తెచ్చిన మొక్కజొన్న కంకులు కనపడ్డాయి. అంతే! మనలోని షెఫ్ మెల్కొన్నాడు.రామ్ములక్కాయ కూరలో మొక్కజొన్న వేసి వండినాను.బాగుంది!!
ఫ్రైడ్ రైస్ లాగా ఇది ఫ్రైడ్ బల్గర్ అన్నమాట.పచ్చపచ్చగా భలే ఉందా చూట్టానికీ? మరే! మనం చేస్తే అంతేగా మరి.ప్రొసీజర్ సో సింపులు.౧. ముందు సగం గుండిక్కి నీళ్ళు పోయిమీద పడేయ్.౨. నీళ్ళు మసలంగనే అందులో బల్గర్ పడేయ్.ఎన్ని నీళ్ళకి ఎంత బల్గర్ అనేగా నీ ప్రశ్న. ఒక కప్పు బల్గర్కి రెండు కప్పుల నీళ్ళు. ఇక కుమ్ముకోనీళ్ళలో బల్గర్ పడేశావా..ఇక ఉడకనీఇంతలో౩. రకరకాల బెంగుళూరు మిరపకాయలు అనగా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు