ఒకానొక శ్రావణ బహుళ అష్టమి నాడు మా జీవితం మొత్తం మారిపోయింది. అంతకు ముందు మేమెలా జీవించామోఏమేమి చేస్తూ ఉండేవాళ్ళమో మాకు ఇప్పుడు గుర్తయినా లేదు. అసలు అంతకు మునుపు మేము అదే వ్రేపల్లెలోప్రాణాలతో మసిలామన్న మాట కూడా మాకు నిజమనిపించదు.ఆ తర్వాతి విషయాలంటారా! అబ్బో వాటి గురించి అయితే ఎంతయినా చెప్పచ్చు. ఎంతయినా చెప్పవచ్చును అంటేనిజానికి చెప్పడానికి చాలా విషయాలేమీ లేవు. [...]
ధారా రామనాథశాస్త్రిగారి “కృష్ణ” నవల చదివాను. ఇది కూడా “మోహనవంశి” కలిగించినటువంటి బాధనే కలిగించింది. రచయిత ముందు మాటలో “పాత్రచిత్రణలో ఒక ప్రత్యేక దృక్పథం పాటించాను. అది స్వామి మొదలు సామాన్య పాత్ర వరకు వర్తిస్తుంది. భాషలో భావ ప్రతిబింబమైన ప్రసన్నతతో పాటు నుడికారంలోని ఒడుపునకు ప్రాధాన్యమిచ్చినాను. దానివల్ల పాత్రకీ పాఠకునికీ ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. [...]
(రెండవభాగం)ఒక్కొక్క అంశమూ తీసుకుని రచయిత్రి ఈ ఇద్దరు అమ్మాయిల వ్యక్తిత్వాలని ఎలా ప్రతిబింబించారో చూద్దాం1. జీవితధృక్పథం : ఇందిరవీ, కల్యాణివీ కూడా ఇంచుమిచుగా ఒకేరకమైన పరిస్థితులు. ఆనందరావులాంటి నాన్న వుండడంలోని సమస్యలనీ, ఏదో ఒక తోడంటూ వుండడంలోని అడ్వాంటేజినీ .. రెండిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెడితే, ఇద్దరివీ సమస్యామయ జీవితాలే. అయితే ఇందిర తన [...]
"అర్చన వచ్చేది రేపే!!" అనుకుంది భవాని వుద్వేగంతో.ఆ రోజు నిద్ర లేచాక ఆమె అలా అనుకోవడం అది అరవయ్యో సారి.రెండేళ్ళ తర్వాత ప్రాణ స్నేహితురాలిని చూస్తున్నానన్న నిజం ఆమెని స్థిమితంగా నిలవనివ్వడం లేదు.ప్రాణస్నేహం. అవును. తమ మధ్య వున్న స్నేహాన్ని వాళ్ళిద్దరూ అలాగే భావిస్తారు. తాము కాలేజ్ లో కలుసుకున్న మొదటి రోజు.. వాళ్ళిద్దరికీ యిప్పటికీ చాలా అపురూపమయిన రోజు.మూడేళ్ళ కాలేజ్ [...]
                                                                                             ‘సనాతన ధర్మ పరిరక్షణ’ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలలోని ప్రధాన వస్తువుగా ఎక్కువమంది భావిస్తూ ఉంటారు. జీవుని వేదనలు,  ఆధ్యాత్మిక విషయాలు వాటిలో అధికంగా [...]
తెలుగు పుస్తకాలు చదివే వాళ్ళలో తొంభై శాతం మంది మీనా నవల చదివి ఉంటారంటే అతిశయోక్తి కాదేమో! పన్నెండు పదమూడేళ్ళ వయసు పిల్లలు, సాహిత్యం గురించి పెద్దగా అవగాహన లేనివాళ్ళు కూడా హాయిగా చదువుకుని “అబ్బ, ఎంత బాగుంది!” అనగలిగేట్లుగా వుండే నవల యిది. ఈ మాట చెప్పుకోగానే అయితే ఇందులో పెద్దగా విశ్లేషించవలసినంత ప్రతిభ  ఏమీ లేదేమోననుకుంటే పొరపాటు పడ్డామన్నమాటే. పాఠకుల [...]
“మానవసంబంధాలు”  అనే అంశం ఎంత పాతదో అంత కొత్తది. ఎంత కొత్తదో అంత పాతది.  మనుషుల మధ్య అపార్థాల చుట్టూ అల్లబడే కథలు, ఒకరి యిష్టాయిష్టాలనీ  అవసరాలనీ  మరొకరు అర్థంచేసుకోకపోవడంలోని ఆవేదనని వ్యక్తం చేసే కథలు మనము చాలాకాలం నుండి చదువుతున్నాము. ఈనాడు  కూడా  ఎక్కువగానే గమనిస్తున్నాము. అయితే గతంలో ఈకథావస్తువు నిర్వహించబడిన విధానానికీ ప్రస్తుతం ఇది [...]
 పరీక్ష ఒక పల్లెటూరు. ఆ ఊరిలోని ఒక  పేదకుటుంబం. అందులో గోపాలం, సూర్యం అన్నదమ్ములు. ఊర్లో మిగిలిన గొప్పవాళ్ళ పిల్లలని చూసి వాళ్ళు కూడా చదువుకోవాలని ఆశ పడడం, అది తీరడం కోసం ఆ కుటుంబం పడే కష్టాలు   ఎదుర్కునే పరీక్షలు, చివరికి గోపాలం మరణంతో నవల విషాదాంతంగా ముగియడం. ఈ నేపథ్యంతో “పరీక్ష” గురించి కొన్ని  ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేస్తారు నవలలో. వాళ్ళ చిన్నప్పటి [...]
   అంతరాత్మ   ఇది విశ్వనాథ వారి మొదటి  నవల. రచనాకాలం 1921. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న పంతం  చుట్టూ చెప్పబడిన చిన్న నవల ఇది. సుగుణభూషణరావు, శ్యామల భార్యాభర్తలు. అతను సనాతనమైన సంప్రదాయాలపట్లా  ఆచారాలపట్లా  ఆసక్తి వున్నవాడు. ఆమె ఆకాలానికి కాస్త  ఆధునికమైన ఆలోచనలున్న కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. భార్యాభర్తల మధ్య ప్రేమకు లోటేమీ లేదు. ఒకసారి పుట్టింటికి [...]
పులుల సత్యాగ్రహంఇది వ్యంగ్య ధోరణిలో వ్రాసిన నవల. నిజానికి వ్యంగ్యరచనలు నన్ను పెద్దగా ఆకర్షించవు. ఈ నవల కూడా అంతగా ఆకర్షించిందని చెప్పలేను. ఒక గ్రామం,  దాని పొలిమేరలలో అడవి, ఆ ఆడవిలో పులులు, అవి  గ్రామస్తుల మీద దాడి చేయడం, వాటికి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు సత్యాగ్రహం చేయడం అనే కథ ఆధారంగా సత్యాగ్రహం గురించి వ్యంగ్యం.బాగున్నాయనిపించిన కొన్ని వాక్యాలు :నవల మొదటి [...]
పోలికలున్న కథలు                                                                                 - ధీర రెండు కథల మధ్య పోలికలు కనబడడం తప్పేమీ కాదు. నిజానికి ఒక కథని మరొక కథ అనుకరించడమూ గొప్ప నేరమేమీ కాదు. మన ప్రాచీనకావ్యాలలోనూ అటువంటివి వున్నాయి. ఒకే ఆలోచనని కాస్త మార్పుతో [...]
   నందిగ్రామరాజ్యం ఇది విశ్వనాథ వారి చివరి నవల అట. రచనాకాలం 1976.రావణసంహారం తర్వాత రాముడు భరతుడు వున్న చోటికి, తన పాదుకలు సింహాసనం పైన వుంచి తనపేరుతో రాజ్యం నడిపిస్తున్న నందిగ్రామానికి వచ్చాడు. ఆయనతోపాటూ సుగ్రీవాది వానరులూ, విభీషణాది  రాక్షసులూ వచ్చారు. అక్కడినుంచి రామపట్టాభిషేకం దాకా జరిగిన కథ ఇది. అంటే జరిగినట్లుగా విశ్వనాథ సత్యనారాయణగారు  చేసిన కల్పన. [...]
1.             దేవతల యుద్ధము ఇది ఒక చిన్న, డెబ్బై అయిదు పేజీల నవల. దీని గురించి విశ్వనాథ పావనిశాస్త్రి గారు వ్రాసిన ముందు మాటలో ఇలా చెప్పారు. “ఇది ఒక జమీందారీ రాజకుటుంబములో జరిగిన కథ. క్రొత్త దేవతలు, ప్రాత దేవతలు – మనుష్యుల విశ్వాసాల వలన పరిస్థితులు ఎట్లా మారి, సంఘంలో కొందరు బలి అవుతారో ఆ కథ.” సరే, కథ విషయానికి వస్తే పెద్దగా కథ ఏమీ లేదు. ఒక వూరు, ఆ వూరి [...]
శకుంతలా దుష్యంతుల కథని నేను చాలా చిన్నతనంలోనే విన్నాను. అయితే నేను మొదట విన్నది  మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ అనీ   మహాభారతంలోని దుష్యంతుని కథ అందుకు భిన్నంగా వుంటుందనీ ఆ తర్వాతికాలంలో తెలిసింది. ఆ పిమ్మట మహాభారతం చదవడమూ జరిగింది.   భారతం చదివాక నాకు దుష్యంతుని పాత్ర మీద గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆదిపర్వంలో క్లుప్తంగా చెప్పబడిన ఆ కథని [...]
ఈ వారం "వివిధ"లో ప్రచురించబడిన వ్యాసం అసలు రూపాన్ని యిస్తున్నాను. ప్రచురణలో కొన్ని కత్తెరలు వేయబడ్డాయి.‘ఆత్మ’ దృష్టికోణంకథని ఎవరి చేత చెప్పించాలి అన్న విషయాన్ని ప్రతి కథారచయితా చాలా ఆలోచించి ఎంచుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రయోగాలూ చేస్తాడు. అటువంటపుడు మామూలుగా అయితే మనతో మాట్లాడని వృక్షాలూ జంతువులూ వచ్చి మనకి కథలు చెప్పడం జరుగుతూ వుంటుంది. అందుకు ఒక ప్రయోజనమూ [...]
అతిశయం                                                     - టి.శ్రీవల్లీరాధిక ఆవిడ బాగా చదువుకుంది. రచయిత్రి. అంతకుమించి ఆవిడ గురించి పెద్దగా తిలియదు. మా ప్రక్క వీధిలోనే ఉంటారావిడ. ఆవిడ పిల్లలు కూడా నేను నేర్చుకునేచోటే సంగీతం నేర్చుకుంటారు. ఒకసారి వాళ్ళతో పాటు సంగీతం క్లాసుకి వచ్చిందావిడ. "అమ్మా, [...]
పల్లవి: నిజం చెప్పవేమయ్యా నిండుకుండ రామయ్యా            అవనిజపై నీప్రేమా అలా దాచుకోకయ్యా చరణం: కైకమ్మ మురిపెం తెలిపే కథ ఒకటీ చెప్తారు            బాలరామహృదయంలోకి ఎవరు తొంగి చూస్తారు!            చందమామ కోసం నువ్వూ మారామే చేశావా            చందురుడీ చెల్లెల్నీ ఒకసారీ తలచావా! చరణం: ధనుసెందుకు [...]
ఉత్తర భారతం లోని ఓ ప్రముఖ సాహితీ సంస్థ వారి సత్కారం అందుకోవడానికి బయల్దేరాను.  నేనే కాక... మరో యిరవై మంది భారతీయ భాషా రచయితలు అక్కడికి వస్తారు. నాతోపాటు పురస్కారాన్ని అందుకుంటారు.అందరి ఫొటోలు, సంక్షిప్త పరిచయాలతో కూడిన ఇన్విటేషన్ కార్డ్ అందగానే ఆ వివరాలన్నీ ఆసక్తిగా చదివాను.అక్కడికి వెళ్ళగానే, సంస్థ కార్యకర్త స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. గెస్ట్ హౌస్ కి [...]
జాగృతి వారపత్రిక సమీక్ష :  జ్ఞానపీఠ పురస్కారానికి అర్హత గల తెలుగు కధా సంపుటిని చూశారా?http://www.jagrititeluguweekly.in/sahityam/sameeksha/684
 విపులలో ప్రచురించబడిన నా అనువాద కథ
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు