మా రమేష్ గాడి నోట్లో రహస్యం ఎంతోసేపు దాగదు. రెట్టించి అడిగితే వెంటనే కక్కేస్తాడు. చాలా సార్లు అలా అడగాల్సిన అవసరం కూడా ఉండదు.పది నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయి వస్తా అని బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకున్నాడు.ల్యాప్ టాప్ తెర మీద ఒక్కొక్కటిగా అలుముకుంటున్న పాప్ అప్ విండో లను భయ భయంగా చూస్తూ , ఇండియా కాల్ చేసి నాన్నతో ఓ పది నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసా. ఈలోపు రమేష్ రెడీ [...]
శనివారం తెల్లవారుజాము తొమ్మిదింటికి రమేష్ గాడి దగ్గిర్నుంచి ఫోన్."ఏంట్రా""రేయ్ నేను రమేష్ ని. ఆ ఏంలేదు చిన్న హెల్ప్ కావాలి"రమేష్ గాడి సంగతి నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి ,విషయం పూర్తిగా చెప్పకుండా "ఆ ఏంలేదు" తో మొదలెట్టాడంటే ఏదో దాస్తున్నట్టే లెక్క."ఏమిటి?""ఆ ఏంలేదు .నా కారు సర్వీసింగ్ కివ్వాలి"నాలో అనుమానం బలపడింది. మళ్ళీ "ఏంలేదు" అన్నాడంటే డెఫినెట్ గా ఏదో [...]
తను నావైపు చూసి సన్నగా నవ్వింది.నాలో క్షణకాలపు తడబాటు.నన్నేనా లేక నా పక్కనున్న తన పరిచయస్తులెవరినైనా ఉద్దేశించి నవ్విందా?సమాధానంగా నేను తిరిగి నవ్వితే,ఒకవేళ ఆ నవ్వు నున్నుద్దేశించింది కాకపొతే ?సమాధానంగా నేను నవ్వీ నవ్వనట్టు నవ్వినా, నా తడబాటు కలిగించిన ఆ క్షణకాలపు ఆలస్యం నా సమాధానాన్ని తనవరకూ చేరనిచ్చినట్టు లేదు. ఆసరికే తను తలకిందికి దించుకొని కుడి చేతి [...]
కొన్ని ఉదయాలు మొదలవడమే ఎంతో ఉత్తేజపూరితంగా మొదలవుతాయి. మిగతా రోజులు నీరసంగానూ, నిస్తేజంగానూ.ఎందుకలాగ అని కొన్ని సార్లు అనిపిస్తుంది. క్రితం రోజు ఏమేమి పనులు చేసానా, ఈ ఉల్లాసానికీ, ఉత్సాహానికి కారణమేమిటా? అని ఆలోచిస్తే , ఆ క్రితం రోజు మిగతా రోజుల్లాగే సర్వ సాధారణంగా గడిచి ఉంటుంది.పేద్ద చెప్పుకోదగ్గవేమీ ఉండవు.నీరసంగా మొదలైన రోజుల్లో మాత్రం ఉదయాన్నే లేవగానే , కాఫీ [...]
చరిత్రంటే నాకిష్టం.చరిత్రకి సంబంధించి ఏమైనా చదివినా, టీవీలో ఏదైనా ప్రొగ్రాము చూసినా వెంటనే దానిలో లీనమైపోతాను. కవితా సౌరభాలు వెల్లి విరిసిన రాయల వారి కాలం గురించి చదివినా, రాజ్య కాంక్షతో జీవితాంతం యుద్దాలతో గడిపేసిన అలెక్జాండరు జ్ఞప్తికి వచ్చినా, ఉన్మాదంతో ప్రపంచాన్ని అగ్నిగుండంగా మార్చేసిన హిట్లర్ మీద ఏదైనా ప్రోగ్రాము చూసినా ఏదో అవ్యక్తానుభూతి. అది దుఃఖమూ [...]
వారం క్రితం "హమ్మయ్య , సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక రాయడం మొదలెట్టొచ్చు" అనుకున్నా. వారం గడిచినా అక్షరం ముక్క కూడా రాయలేదు. కొత్త ఊరు.కొత్త ఆఫీసు. పని ఎక్కువ.కానీ ఇవన్నీ కారణాలు కావు. అసలు తప్పంతా రోజుకి మూడు గంటల పైనే తినేస్తున్న ఆఫీసు ప్రయాణానిదే. ఒక నాలుగు మైళ్ళ కారు ప్రయాణం, అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు నిమిషాల బస్సు ప్రయాణం. అక్కడినుంచి మళ్ళా ఇంకొక ఇరవై నిమిషాల రైలు [...]
"ఏమిటి, వెళ్ళక తప్పదా?""నీ ఇష్టం"మూడక్షరాల సమాధానమైనా , ముప్పై మూడు విరుపులు వినపడ్డాయి నాకు.అలవాటు ప్రకారం టీవీ కింద డీవీఆర్ కి ఉన్న ఎలక్ట్రానిక్ క్లాక్ వైపు దృష్టి సారించాను. సమయం సాయంత్రం ఏడు గంటలు.కిటికీ వైపు తల తిప్పాను. నవంబరు నెల. అప్రయత్నంగా పొద్దున్న చూసిన వెదర్ రిపోర్ట్ గుర్తుకొచ్చింది. సన్ సెట్ ఎట్ 4:30. నాలుగున్నరకే సూర్యాస్తమయం. ఏడింటికే దట్టమైన చీకట్లు. [...]
కొన్నెందుకో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్ళయినా మసకబారవు.కారణం తెలీదు.ఎర్లీ ఎనభైల్లో మాట అన్నమాట. నేనప్పుడు ఆరోతరగతి. మా తెలుగు మాష్టారింటికి ట్యూషను కెళ్ళేవాడిని . ఆయన పేరుకు తెలుగు మాష్టారయినా ఒక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పేవారు. అదే ట్యూషనుకి లెక్కలు చెప్పడానికి సత్తార్ అనే మాష్టారింకోకాయన వచ్చేవారు. వారి గురించి ఇంకెప్పుడైనా.పొద్దున్నే ఆరింటికి ట్యూషను. ఐదు [...]
ఈరోజు కాస్త తీరిక దొరికి మొత్తానికి నా కొత్త బ్లాగు పని కొంత పూర్తి చేశాను. పన్లో పనిగా రెండు టపాలు కూడా రాసేసా. ప్రస్తుతమున్న ఈ బ్లాగు ఫార్మాట్ ని కొద్దిరోజుల్లో మారుస్తాను.బ్లాగు పేరు నీలి మేఘాలలో . త్వరలోనే దీన్ని కూడా కూడలి, జల్లెడలలో చేరుస్తాను.
ఇక నేడో రేపో Its nice working with you all అనే ఈ-మెయిలు పంపాలి అందరికీ. అసలు ఈ ప్రాజెక్టుకి రావడమే ఒక వింత. మొదట్లో వద్దనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పనిచేసి వదిలేసిన పురాతన సాఫ్ట్వేర్ వర్షను మీద పని. ముందుకొచ్చాక మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే కష్టమే . ఈ సాఫ్ట్వేర్ ఫీల్డులొ అది మరీనూ. అయితే కొన్ని వృత్తిపరమైన మొహమాటాలూ, ఎలాగు ఆర్నెల్ల ప్రాజెక్టు కదా , కన్నుమూసి తెరిచేలోగా ఆర్నెల్లు [...]
ఇంకా పేరు నిర్ణయించుకోలేదుగాని , "అనంతం" కి అనుబంధంగా మరొక బ్లాగు మొదలెడదామని అనుకుంటున్నాను. "అనంతం" లానే ఇందులో కూడా సుత్తే ఉంటుంది ,అయితే కాస్త సూటిగా ఉంటుంది. చేట భారతాలు కాకుండా , కట్టె, కొట్టె, తెచ్చె రీతిలో రాయాలని ప్లాను. Casual blogging అన్నమాట. ఒక్కొక్క పోస్టు క్లుప్తంగా ఒక పది పదిహేను వాక్యాల్లో, నేను చదివిన పుస్తకం గురించో , చూసిన సినిమా గురించో, నిద్రపట్టక పక్క మీద [...]
అవి నేను హైదరాబాదులో ఒక బహుళ జాతి సంస్థ లో పనిచేసే రోజులు.నేను పనిచేసే ప్రాజెక్టు చాలా పెద్దది. దాంట్లొ దాదాపు 70 మంది పనిచేస్తూ ఉండేవారు . అన్ని రకాల భాషలూ వినపడేవి . వాటిల్లో తమిళందే పైచేయి. వాళ్ళది చాలా పెద్ద గ్రూపు. ఇచ్చుకున్నా, పుచ్చుకున్నా వాళ్ళలో వాళ్ళే.వాళ్ల ఐకమత్యం చూసి బాగా ముచ్చటేసేది. అయితే వాళ్ళలో తప్పుపుట్టాడొకడు. పేరు పరమ్ గురు. తనకి తెలుగు [...]
ముచ్చటగా మూడు విషయాలు.మొదటిది..ఒక రెండు వారాల క్రితం...బోస్టన్లో ఉండే స్నేహితున్ని కలుద్దామని కారెక్కా. హైవే ఎక్కిన పదినిముషాలకే చిన్నపాటి చిరుజల్లు మొదలయింది. బయటికి వెళ్ళే పని ఉన్నా లేకున్నాప్రతిరోజూ వాతావరణం ఎలా ఉంటుందో అని నెట్లో కుతూహలంగా చూసే నేను ఈరోజు బయటికి వెళ్ళే పని పెట్టుకొనికూడా దాన్ని పట్టించుకోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కాసేపలా అద్దం మీద [...]
వెకిలితనానికీ, అవకాశవాదానికీ తావివ్వని అమాయకత్వం మూర్తీభవించిన వయసది. ఆ భావనల పరంగా అ ఆ లు దిద్దుకుంటున్న అందమైన వయసది..********************************************************************మొదట్లో అస్సలు అర్ధమయ్యేది కాదు.వారంలో కనీసం ఒక్కసారైనా అమ్మకానీ నాన్నకానీ ఆ మాట అంటూనే ఉండేవారు. అప్పుడప్పుడు కోపం వచ్చేది కూడా. ఏమీ అనలేని అశక్తతతో కోపంగా విసవిసా మేడమీదకి వెళ్ళి, ఎత్తైన ఆ పిట్టగోడ మీద తలవాల్చి ఆ [...]
కొన్ని కొన్ని సార్లు మనం కలలో కూడా ఊహించని సంఘటనలు ఇలలో ఎదురై మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. వీటిల్లో కొన్ని అప్పటికి సీరియస్ యవ్వారాలే. కానీ కాలం గడిచేకొద్దీ అవి కామెడీగా మారి తలచుకున్నకొద్దీ మాంఛి కిక్ ఇస్తుంటాయి. అలాంటివి కొన్ని....*************************************************************************************** చానాళ్ళ..కాదు కాదు చానా ఏళ్ళ కిందట సంగతి. నేను అప్పుడప్పుడే ఒక సాఫ్టువేర్ ఇంజనీరుగా [...]
పోలికలు తేకూడదు అని ఎంత అనుకున్నా కొన్ని విషయాల్లో నిభాయించుకోలేను. అలాంటివార్తొకటి ఈరోజు చదివాను. ఆ వార్త ఇదిగోండి . అమెరికాలో గత తొంభయ్యారేళ్ళలో పార్టీ ఫిరాయించిన వారు 13 మంది.సొంత పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా చట్టసభల్లో ఓటేయడం వేరేవిషయం. దాన్ని వదిలేస్తే, రిపబ్లికన్ నుంచి డెమొక్రటిక్ పార్టీకి లేదా ఇటు నుంచి అటుకి మారినవారు మొత్తం 13 మంది.దాదాపు వందేళ్ళలో....13 [...]
ఈయన అప్పుడెప్పుడో "అసలు రాముడున్నాడా?" అనీ , "రాముడు తాగుబోతు" అనీ, అనేసి కొట్టుకుచావండ్రా అని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బాధపడ్డ హృదయాలకు ఇప్పుడిదిగో సమాధానం. ప్రభాకరన్ ఉగ్రవాది కాడు. ఇన్నాల్టికి ఆయన మనః స్థితి మీద ఒక అంచనా లాంటిది దొరికినట్టయి మనసు ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడీయన రాముణ్ణెన్నన్నా నాకేమాత్రం బాధ లేదు. నిజానికి ఎప్పుడంటాడా అని [...]
ఏమిటో! ఈ మధ్య బూట్లు విసరడం ఎక్కువైంది.కొన్ని నెలల క్రితం అమ్రీకా అధ్యక్షుడు భూషయ్య మీద, తరువాత చిదంబరం మీద, రీసెంటు గా నవీన్ జిందాల్ మీద.అయితే సదరు వ్యక్తి తాగి ఉన్నాడనీ, అందుకే క్షమించేసాననీ జిందాల్ వారు సెలవిచ్చారు.చదువుతూ ఓహో! అని తలూపుతుండగా ఠక్కున వచ్చిందొక ఆలోచన..తాగితే విచక్షణా జ్ఞానం పోవాలి కదా మరి ఇదేమిటి? ఈయనలో మేల్కొన్నట్టుందే!ఏంటో?ఇంత చిన్న విషయమే [...]
(గతటపా తరువాయి )కారన్నాక ఆగదా? అన్నట్టు చూస్తున్నాడు యాదయ్య నావైపు.వింతగా, జాలిగా, కోపంగా పళ్ళు పటపట లాడిస్తూ,ఇలా ప్రపంచంలో ఉన్న అన్నిరకాల భావాల్నీ మొహంలో ప్రతిఫలిస్తూ నా కారు రెండువైపుల నుంచీ వాహనాల్ని దూకిస్తున్నారు నగరవాసులు.టీ తాగటం వరకూ శాంతంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు కొద్దిగా కోపాన్ని పులుముకొని నా కారు దగ్గరికొచ్చి కార్లో ఉన్న నన్నూ, యాదయ్యనీ మార్చి మార్చి [...]
నాకొక స్నేహితుడున్నాడు. వాడూ నేనూ ఏడవతరగతి వరకూ కలిసే చదువుకున్నాం. ఆ తరువాత వాడికి చదువు అబ్బదు అని అనుకున్నాడోఏమో, వాళ్ళ నాన్న తనని ఒక "మేస్త్రీ" దగ్గర టైలరింగు పనిలో కుదిర్చాడు. ఇంటర్ తరువాత ఎంసెట్ రాసి అందరం చెల్లాచెదురైన తరువాత మా వూళ్ళో ఉన్న నా ఏకైక స్నేహితునిగా మా స్నేహం ఇంకా బాగా కుదురుకొంది. ఇంజనీరింగు చదివేటప్పుడు హైదరాబాదు నుంచిఎప్పుడొచ్చినా, ఆ [...]
ఈ రోజేమీ బాలేదు నాకు.పొద్దున్నే ఎందుకో బాగా ముందే మెలకువొచ్చింది. ఐదున్నరకి లేచా. ఆఫీసు పనేదో గుర్తొస్తే కాసేపు అది చూసుకున్నా. సడన్ గా రాత్రి ఏ మూడుగంటలప్పుడో, నాలుగ్గంటలప్పుడో, నా ఆఫీసు బ్లాక్ బెర్రీ "కుయ్ కుయ్" మన్నప్పుడు లేచి చూసుకున్న జీమెయిలు మెసేజీలు గుర్తొచ్చాయ్. జీ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే నేను కొత్తగా రాసిన టపా కి కొన్ని కమెంట్లున్నాయి.అందరికీ [...]
ప్రతిఒక్కరికీ జీవితంలో ప్రతి దశలోనూ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. కొత్తగా వచ్చిన భార్య కావచ్చు.ఇప్పుడే ఈలోకం లోకొచ్చిన మీ బుజ్జి పాపో, బాబో కావచ్చు. ఇవేమీ కాకపోతే ఆఫీసులో మన బాసు కావచ్చు.లేదా ఇంకెవరైనా కావచ్చు. వీరిలో కొంతమందితో రోజూ మాట్లాడక పోయినా,వారితో వ్యవహరించేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి [...]
కొన్ని నెలల క్రితం నేనొకసారి టెన్నిస్ ఆడడానికి మా ఇంటి దగ్గర్లో, ఒక పార్క్ లోనున్న టెన్నిస్ కోర్టుకెళ్ళాను. ఉన్నవే రెండు కోర్టులు. ఒకదాంట్లో తెల్లవాళ్ళు గ్రూపొకటి , దాదాపు ఐదారుగురు, వంతులవారీ గా ఆడుకుంటున్నారు. రెండవదాంట్లో మన భారతీయ మిత్రులు ఇద్దరు ఆడుతున్నారు. నేను, నాతోపాటు వచ్చిన నా స్నేహితుడు దాదాపు నలభై నిముషాలు వేచిఉన్నాం. మన భారతీయ మిత్రులు అరివీర భయంకరం [...]
కొన్నేళ్ళ క్రితం, తామరతంపరగా వచ్చిన ఈ టెలివిజన్ ఛానళ్ళూ, లైవ్ కవరేజిలూ, సెల్ ఫోన్లూ, ఇంటెర్నెట్టూ, ఇవన్నీ చూసి నోరెళ్ళబెట్టినా, "కొన్ని విషయాలకు మాత్రం ప్రత్యమ్నాయం ఉండదు ఉండబోదు.చాలా మంది కొన్నిటిని అలా సహజంగా చూడటానికే ఇష్టపడతారు.టెక్నాలజీ వీటినేం చేయలేదు" అని అనుకునేవాడిని. అలా నేను అనుకున్నవాటిలో మొట్టమొదటిది పొద్దున్నే చదివే న్యూస్ పేపరు. కుర్చీ కిటికీ [...]
అదేమిటో, ఎన్నడూ లేని విధంగా, గత పది పదిహేను రోజుల్లో తెలుగు, ఇంగ్లీషు కలిపి దాదాపు 10 సినిమాలు చూశాను. అన్నీ కాకున్నా నాకు బాగా నచ్చిన మూడు ఇంగ్లీషు సినిమాల గురించి ఇక్కడ.మొదటిది క్లింట్ ఈస్టువుడ్ నటించి దర్శకత్వం వహించిన "గ్రాన్ టోరినో". నాకు బాగా నచ్చిన సినిమా. వాల్ట్ (క్లింట్ ఈస్ట్ వుడ్) మాజీ వియత్నాం యుద్ద సైనికుడు.అంతకుముందు ఫోర్డ్ కంపనీ లో పనిచేసి ఉంటాడు. [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు