పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా [...]
డెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు.ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ కథలు మేము చదివేశాం, చాలా బాగా ఉంటాయి శీను" అన్నారు అక్కయ్యలు. మొన్న [...]
స్థలం: రియల్ డి కార్తే, మెక్సికో దేశం (సముద్ర మట్టానికి ఇంచుమించు 8000 అడుగుల ఎత్తులో)సమయం: వాచ్ తీసుకువెళ్ళలేదు, ఫోనులో చార్జు లేదు!సందర్భం: కొండ ప్రాంతంలో ఆగిపోయిన బైకు, ఎలా తీసుకురావాలో అలోచించకుండా మిగతావారితో కలిసి తందనాలు ఆడేవేళ... మెక్సికోలోకి వచ్చీరాగానే కొన్ని ఫోటోలతో ఫరూక్ చేసిన వీడియోని whatsapp లో చూసి హరి చరణ్ గారు ఫోన్ చేసి " Rj, నువ్వు డాలస్ తిరిగి వచ్చాక విజయ్ [...]
గత సంవత్సరం ఫేస్ బుక్కులో ఒక ప్రకటన చూసాను. ఒకానొక కాలంలో తెలుగునేల మీద ఒక వెలుగు వెలిగిన నాటకరంగాన్ని డాలస్ తీసుకువచ్చే ప్రయత్నం చేపట్టామని అందులో నటించడానికి నటులు కావాలని సరసిజ - The Stage వారు ప్రకటించారు. "నేను ఉత్సాహంగా ఉన్నానండీ" అని నా వివరాలు తెలిపాను.పంపిన వెంటనే రాజేశ్వరి ఉదయగిరి గారు ఫోన్ చేసారు. నాతో కాసేపు మాట్లాడి, నాటకం వివరాలు త్వరలో [...]
జనవరి 11వ తేది అంటే నాకు ఒక చేదు జ్ఞాపకం. నిండుగా ఉన్న పెళ్ళి పుస్తకంలో ఇంకా పేజీలు ఉన్నా మోడయిన రోజు. పూర్ణ చంద్రుడిని రాహుకేతువులు గుటకాయస్వాహా చేసిన రోజు. అపుడెపుడో చిన్నపుడు చదివిన మేర్లపాక మురళిగారి నవలలో లాగా "మచ్చల పాము అమాయకమైన లేత కప్పని ఆకలితో చప్పరించినలాంటి రోజు"! కాలకేయులు చూడ ముచ్చటగా ఉన్న మాహిష్మతి సామ్రాజ్యంపై దండెత్తినలాంటి రోజు. మళ్ళీ ఆ చేదు నిజం [...]
గత సంవత్సరం కాలేజీ రీయూనియన్ అపుడు మాకోసం రాసుకున్న జ్ఞాపకాలు. ఇపుడు మీకోసం కూడా...సెప్టెంబరులో ఒక రోజు. అతడు సినిమా మాటీవీలో మొదలయ్యి అరగంట అయింది.వచ్చే నెల అక్టోబరు 15 వారాంతంలో మాతోపాటూ నేదురుమల్లి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న స్నేహితులందరూ స్మోకీ పర్వతాలలో కలుద్దామని చాలా రోజుల నుండి అనుకుంటూ వచ్చాము. ఈ వారంలో ఆ ప్రయాణానికి ముందస్తుగా డాలాస్ నుండి బయలుదేరే [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం, ఐదవ భాగంమీరు చదవకపోతే ఇక్కడ 1, 2, 3 , 4, 5, 6, 7 మొదలుపెట్టచ్చు.ఏడవ రోజు, శుక్రవారం జూలై 3, టుకుంకారిమా ప్రయాణంలో మొదటి రోజు లాగే ఈరోజు కూడా మాకు అయిదు వందల మైళ్ళ ప్రయాణం ఉంది. ఉదయాన్నే నిదానంగా నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసుకుని హోటలు వాడి అల్పాహారం తిన్నాము. వినయ్ వాళ్ళు ఉదయాన్నే లేచి [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం, ఐదవ భాగంమీరు చదవకపోతే ఇక్కడ 1, 2, 3 , 4, 5, 6 మొదలుపెట్టచ్చు.ఆరవ రోజు, గురువారం జూలై 2, ఆరేఇది కొలరాడోలో మాకు చివరి రోజు. ఈరోజు కూడా నిన్న వెళ్ళిన మిలియన్ డాలర్ హైవేలోనే వెళ్ళాలి. కేకే కుటుంబముతో కొంచెం లేటుగా వస్తానన్నాడు. నా స్లీపింగ్ బాగ్ కేకే ట్రక్కులో పెట్టేసి ఆ నలుగురితో నేను కలిసి [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం, ఐదవ భాగంమీరు చదవకపోతే ఇక్కడ 1, 2, 3 , 4, 5 మొదలుపెట్టచ్చు.ఐదవ రోజు, బుధవారం జూలై 1, ఆరేమా ప్రయాణంలో ఇదే కీలకమైన రోజు, ఎందుకంటే మిలియన్ డాలర్ హైవే చాలా ప్రముఖమైనది. చాలా మంది బైకర్లకి అక్కడ బండి నడపాలని ఎంతో కోరిక ఉంటుంది. ఆ ప్రయాణం వారి జీవితంలో ఒక మరచిపోలేని రోజుగా గుర్తు ఉంచుకుంటారు. [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగంమీరు చదవకపోతే ఇక్కడ 1, 2, 3 , 4 మొదలుపెట్టచ్చు. నాల్గవ రోజు, మంగళవారం జూన్ 30, గన్నిసెన్ఉదయాన్నే నిద్ర లేచి కాంప్ గ్రౌండులో ఫోటోలు తీసుకున్నాము. స్నానాలు పూర్తి చేసి కాబిన్లు ఖాళీ చేసి సామాను బైకుల మీద సర్దడం జరిగిపోయాయి. మా ఈ ప్రయాణంలో బస చాలా వరకు KOA (Kampgrounds of America) లోనే చేసాము. అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం మీరు చదవకపోతే ఇక్కడ 1, 2, 3  మొదలుపెట్టచ్చుమూడవ రోజు, సోమవారం జూన్ 29, అలమోసా టెంటులో ఎంత లేటుగా పడుకుంటే ఉదయం ఆరు లోపల మెలకువ వచ్చేస్తుంది. ముందుగా లేచిన నేను, కేకే ఊరులోకి వెళ్ళి కాఫీ, టిఫిన్ తెద్దామని బయలుదేరాము. మెక్ డొనాల్డ్స్ లో అందరికీ సరిపడే కాఫీ, టిఫిన్ పాక్ చేసి తీసుకువచ్చాము. ఈలోపలే అందరూ తయారయ్యి [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం మీరు చదవకపోతే 1, 2  మొదలుపెట్టచ్చు. రెండవ రోజు, ఆదివారం జూన్ 28, క్లేటన్ మొదటి రోజు బాగా ఎక్కువ దూరం రావడం, టెక్సాస్ ఎండలకి బాగా అలిసిపోయి ఉండడం వలన రాత్రి బాగా పడుకున్నాము. క్లేటన్ చిన్న ఊరు అయినా కాంప్ గ్రౌండులో చాలామందే ఉన్నారు. మేము నిన్న లోపలకి వచ్చేటపుడు కొంతమంది బైకర్లు కూడా ఉండడం గమనించాము. అందులో ఒక బైకు కావాసాకి [...]
కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం మీరు చదవకపోతే ఇక్కడ మొదలుపెట్టచ్చు.మొదటి రోజు, శనివారం జూన్ 27, డాలస్ఉదయం నాలుగుకి నిద్ర లేచి ఒక అరగంటలో తయారయ్యాను. నిన్న రాత్రే సామానంతా బైకుపై కట్టేసాను కాబట్టి ఇక ఇంటి నుండి బయట పడడమే తరువాయి. ఇంటి ఓనరుకి కొన్ని రోజుల ముందు చెప్పి ఉంచా, ఇంకొక వారం వరకు ఇంట్లో ఉండనని. ఈమధ్య డాలసులో బాగా దొంగతనాలు అవుతున్నాయి, అవి కూడా భారతీయుల [...]
ముగ్గురు జంటలు, ఇద్దరు ఒంటరి పక్షులు మరి ఇద్దరు చిన్నారులు కలిసి మోటర్ సైకిల్ పై ఈ వేసవిలో చేసిన 2200 మైళ్ళ కొలరాడో యాత్ర విశేషాలు మనం ఇక్కడ చూద్దాము.2013లో యమహా మోటార్ సైకిల్ కొన్నపుడు డాలసులో ఒక మోటార్ సైకిల్ గ్రూప్ ఉండడం గమనించాను. డెట్రాయిట్ లో ఆఫీసులోని స్నేహితులతో వెళ్ళడమే కానీ మనకంటూ ఒక గ్రూప్ ఉండేది కాదు. నెలలో రెండు, మూడు వారాలు డాలసు చుట్టుపక్కల విహారానికి [...]
అవి నాష్ విల్ లో ఒక సంవత్సరం అరణ్యవాసం ముగించుకుని మళ్ళీ డెట్రాయిట్ చేరుకున్న రోజులు. ఒక సంవత్సరం డెట్రాయిట్ కి దూరంగా ఉండడం ఒక రకంగా మంచిదే అయింది. రెండవసారి తిరిగి వచ్చినపుడు చాలావరకు ఆశాజనకంగానే జరిగిందని చెప్పచ్చు. పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయని ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకోమని ప్రోత్సహించడం జరిగింది. నాకూ ఒక తోడు అవసరమనిపించి నాకు సరిపడే జోడిని [...]
ఈవారం మొదట్లో ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు శ్రీ. వీ.ఎన్.ఆదిత్యగారిని కలవడం జరిగింది.నా గురించి చెపుతూ "నేను కూడా రాస్తూ ఉంటానండీ. కాలాస్త్రి బ్లాగులో ఒకప్పుడు సినిమాలు గురించి రాసేవాడిని" అని చెప్పాను."ఇపుడెందుకు మానేసారు" అని ప్రశ్నించారు."ప్రతి సినిమాని తిడుతూ రాసేవాడిని. బాగోదేమో" అన్నాను."పరవాలేదు, తిట్టండి" అన్నారు.నాకూ కొత్త ఉత్సాహం వచ్చింది.మా ఆవిడ కూడా [...]
నాకు చిన్నప్పటి ఆదివారం సాయంత్రం అంటే బాగా దిగులు ఉండేది. ఆ దిగులు ఇస్కూలు, కాలేజీ దాటి ఆఫీసులో చాకిరి చేసే వయసు వరకు వెంటాడేది. ఆదివారం సూర్యుడు మామయ్య అస్తమించగానే ఇంట్లో "రేపు స్కూలు ఉంది కదా! ఇంక ఆటలు ఆపి రేపు స్కూలు హోంవర్క్ ఉంటే చేసుకో", "రేపు ఉదయాన్నే స్కూలుకి వెళ్ళాలి, తొందరగా పడుకో" లాంటి మాటలు తూటాల్లాగా నన్ను తాకి కలవరపెట్టేవి. చెడ్డీలు దాటి [...]
గడచిన ఆదివారం మా డాలసులోని 90వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో నేను అల్పజీవి పుస్తక పరిచయం చెయ్యడం జరిగింది. ఎలాగూ మాట్లాడేసాను, ఇక్కడ మన బ్లాగులో కాసేపు రాసుకుంటే నాకు కొంచెం ఊరట కలుగుతుంది. ఒకటిన్నర సంవత్సరం ముందు ఆస్టినులో మాకు సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. అపుడు హూస్టన్ నుండి ఒక సాహిత్య అభిమాని బుచ్చిబాబు గారు "చివరకు మిగిలేది" పరిచయం చేసారు. ఆ వక్తను [...]
వడ్ల గింజలు కథని ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి గారు రచించారు. ఈ కథ 1941 సంవత్సరం ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది. శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి కథలు రెండవ సంపుటంలో ఈ కథను మరి కొన్ని మంచి కథలతో పాటూ మళ్ళీ ప్రచురించారు. కథలో వెళ్ళే ముందు రచయిత గురించి తెలుసుకొందాం.రచయిత పరిచయంశ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఏప్రిల్ నాలుగవ తేది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం [...]
శివ సినిమా ఆంధ్రలో విడుదల అయి ఈ వారంతో పాతికేళ్ళయింది. ఈనాడులో వ్యాసం చూసాక ఆ సినిమాతో నా అనుభవాలు బ్లాగుదామని అనిపించింది.ఈ సినిమా విడుదల సమయానికి నేను నెల్లూరులో ఉన్న సర్వోదయా కాలేజీలో ఇంటరు చదువుతూ ఉన్నాను. దసరా సెలవలకేమో, తిరుపతి నుండి మా అన్న ఇంటికి వచ్చాడు. అన్నతో పాటూ పటాలం అందరం కలిసి సినిమాకి బయలుదేరాము. అది ఫాన్స్ షో, రాత్రి 12 కి రాఘవ సినీ కాంప్లెక్సులో [...]
సింధు పుట్టే సమయానికి నేను ఎం సెట్ లాంగ్ టెర్మ్ కోచింగ్ లో ఉన్నాను. నాతో పాటూ తిలక్, చంద్ర (పిన్నమ్మ పిల్లలు) కూడా చదువుకునేవాళ్ళు. మేము ముగ్గురం మూలాపేటలో మునెమ్మ అత్తమ్మ ఇంటికి పక్కన ఉన్న ఒక గుడిసెలో పడుకుని చదువుకునే వాళ్ళం. పడుకుని ఎందుకు అన్నానంటే, ఎక్కువగా ఇక్కడ నిద్రపోడానికే వెళ్ళేవాళ్ళం. ఆ ఇంటి నుండి మా ఇంటికి రావాలంటే ఒక సందులో పది ఇల్లులు దాటితే మా ఇల్లు. [...]
డా.రావూరి భరద్వాజ్ గారికి పాకుడురాళ్ళు నవల ద్వారా జ్ణానపీఠ్ అవార్డు లభించిన వార్త రాగానే, నేను అడగకుండానే మా రెండో అక్క విజయవాడలో ఆ పుస్తకం కొనేసి తానా సభలకు వస్తున్న మా బావతో పంపింది. సహజంగానే సినిమాలంటే అందరికీ మోజు,దానితో పాటూ అందాల తారల వ్యక్తిగత జీవితం మీద  రాసిన నవల అనగానే ఆసక్తి కలగడం కూడా సహజమే! ఇంకొక సంగతి ఏమిటంటే నవల అట్ట మీద రావూరి భరద్వాజ గారిని [...]
బ్లాగర్లకి, అలాగే తెలుగు వారందరికీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు! తానా ఏప్రిల్ మాస పత్రిక మీరు చూసారా? ఇందులో 48 వ పేజీలో నేను వ్రాసిన "అమెరికాలో సాహితీసంస్థల గురించి చదవండి. http://patrika.tana.org/april2014/index.html
ప్రతి సంవత్సరం భోగి పండగ వచ్చిందంటే నేను ముందు చేసే పని అపుడెపుడో (2010) లో నేను స్వయంగా కాలాస్త్రికి వెళ్ళి వేసుకున్న భోగి పండగ తాలూకూ ఫోటో వెతుక్కుని సంవత్సరం మార్చి మళ్ళీ ఈ కొత్త సంవత్సరానికి నా గోడ పైన వేసుకోవడం. దీనితో నా భోగి మంటలు చల్లారిపోతాయ్, తొక్కలోది ఇంతకంటే ఏం చేస్తాం. ప్రతి సంవత్సరం లాగే నా హితులూ, స్నేహితులూ ఈ ఫోటోకు లైకు కొడుతూ నన్ను తృప్తి పరుస్తారు. [...]
      ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 76 వ సదస్సు శనివారం, నవంబరు 23 వ తేది India Association of North Texasకార్యాలయములో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద గారి అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 76 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు