ఒక విజ్ఞప్తిపాఠకుల కోరికపై మేరీ టైలర్‌ రచించిన ''భారతదేశంలో  నా జైలు జీవితం'' అనే పుస్తకాన్ని పునర్ముద్రించాలనుకుంటున్నాం.మన దేశంలో 1970లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఆమె రాసిన ఈ పుస్తకం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పెంగ్విన్‌ వారు ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌'' అన్న పేరుతో ఇంగ్లీషులో వెలువరించగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ [...]
'' మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్‌ కథలో కొన్ని - ఇదిగో మీ కోసం....' - కామం పిడికొట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు, ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను [...]
Add captionచిన్న కొడుకు, ఇరవై యేళ్ళవాడు, అలా యెందుకు మారిపోయాడు? ఇంటి పట్టున ఉండడు, యెక్కడికి వెడుతున్నాడో స్నేహిం చేస్తున్నాడో తెలియదు. తల్లికి గాని తండ్రికి గాని తెలియదు. డబ్బుకి లోటులేదు. పుష్కలంగా ఉంది. కాలేజి చదువు పూర్తికాగానే అమెరికా పంపి పై చదువులు చదివించాలనుకున్నారు. కాని ఈ చిన్న కొడుకు అందిరికీ దూరమైపోయాడు. ఇంటిలో యెవరితోనూ మనసిచ్చి మాటాడడు. భోగభాగ్యాలంటే [...]
యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి [...]
యం.యస్‌. సుబ్బులక్ష్మి గురించి అధ్యయనం 2004వ సంవత్సరంలో ఒక ''వెలుపలి వ్యక్తి'' నుంచి, అదీ తన క్రైస్తవ తల్లిదండ్రులు పెట్టిన పేరుగల వ్యక్తి నుంచి రావటం, కర్ణాటక సంగీత సామ్రాజ్యపు కంచుకోటలో కలవరం రేపింది. నేను తమిళనాట పెరగలేదనే విషయం దానిని మరింత అనుమానాస్పదం చేసింది. ఐతే తొందరలోనే క్షమాభిక్ష వచ్చింది, కొంత మెచ్చుకోలు కూడా దొరికింది. ఐతే మొదట వచ్చిన అభ్యంతరాలు, ఇటీవలి [...]
కార్టూన్లలోమార్క్స్మార్క్సిజం సామాన్య ప్రజలకు అర్థం కాని బ్రహ్మపదార్థంగా పరిగణింపబడు తున్నది.ఇంతాచేస్తే ఇది సామాన్యుడి కోసమే ఏర్పడ్డ సిద్ధాంతం.మార్క్సిజం కొద్దిమంది పండితుల సొత్తుగానే చాలాకాలం నుండి ఉంటున్నది. మళ్ళీ ఈ పండితులలో ఏకాభిప్రాయంలేదు. వాళ్ళ వాళ్ళ వాద భేదాలను బట్టి రకరకాల భాష్యాలు, ఖండనమండనలూ కనిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్య మార్క్సిజం నిజంగానే [...]
బొజ్జా తారకం జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను"ఆవిష్కరణ సభ 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోబొజ్జా తారకం గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంస్మరణ సభ,  అయన జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను" ఆవిష్కరణ [...]
''నలుపు'' ప్రజా పక్ష పత్రికసిరిల్‌ రెడ్డి ప్రచురణ కర్తగా, బొజ్జా తారకం సంపాదకుడిగా, కె.బాలగోపాల్‌, డి. నరసింహారెడ్డి, కంచె ఐలయ్య, సజయ, పి.ఎల్‌. విశ్వేశ్వరరావు, ఆర్‌.అఖిలేశ్వరి ప్రభృతులు సంపాదక వర్గ సభ్యులుగా వెలువడిన ''నలుపు'' పత్రిక ఆనాడు కుల, వర్గ, అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం విదితమే.1989 ఏప్రిల్‌ లో ప్రారంభమై 1995 వరకు ఐదేళ్లపాటు నిరాటంకంగా నడచిన ఈ [...]
బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలుహైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1980లో ఆరంభమైంది. దళిత అంశాలపట్ల మేం ప్రత్యేక శ్రద్ధ కనపరచటమన్నది కూడా దాదాపుగా అదే సమయంలో మొదలైందని చెప్పొచ్చు. డా|| బి.విజయభారతి గారు రచించిన  బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర (1982) మేం ప్రచురించిన తొలి పుస్తకాల్లోనే ఉంది. ఆ తర్వాత 1984లో మరాఠీ దళిత కథా సంకలనాన్ని తెలుగులోకి తెచ్చాం. 'శూద్రులెవరు?' అన్న [...]
బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలుతెలుగు రాజకీయాలకు సంబంధించినంతవరకు 1989-1995 మధ్యకాలం - అంటే కారంచేడు మారణకాండ అనంతరం జన చైతన్యం ఉవ్వెత్తున ఎగసిపడిన కాలం.  సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నీ ఒక కుదుపునకు గురైన కాలం. అన్ని ముఖ్యమైన సమస్యలపై ఆ రోజుల్లో విస్తృతమైన చర్చలు జరిగేవి. అదే కాలంలో నలుపు పత్రికలో బొజ్జా తారకం ఎంతో సాహసోపేతంగా, లోతైన పరిశీలనతో, ప్రత్యక్ష [...]
కశ్మీర్ అనగానే  ఈ రోజు మతోన్మాదం , హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మీరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు . మా పాటికి మమ్మిల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్ధం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్ ప్రతీక అయిపోవడం వల్ల ఈ ప్రశ్న ఎవరికీ వినిపించదు. నెహ్రూ భ్రాండు లౌకికవాదులకు [...]
శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ  పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాలను గురించీ -ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్న అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది . హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైన ,మతమౌఢ్యపు దౌర్భల్యాలపైనా సమరం సాగించిన [...]
మానసిక వ్యాధులనేవి సర్వసాధారణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి . మానసిక జబ్బుల చికిత్స విషయంలో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు . మానసిక జబ్బులు కూడా శారీరక జబ్బుల్లాంటివే . వీటికీ చికిత్స వుంది. ఇవి కూడా పూర్తిగా నయమవుతాయి. మానసిక బాధపడే వ్యక్తులకు మంచి చికిస్తాను పొందే హక్కు వుంది.ఈ పుస్తకమే ఇప్పటికీ 15 భాషల్లోకి అనువాదమయినది . 
మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలామంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. ఇటువంటి వాతావరణంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడటానికి  రచయిత తన సమయాన్ని ఇందు కోసం వినియోగించాడని నా నమ్మకం. మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచన [...]
మానసిక వ్యాధులనేవి సర్వసాధారణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి . మానసిక జబ్బుల చికిత్స విషయంలో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు . మానసిక జబ్బులు కూడా శారీరక జబ్బుల్లాంటివే . వీటికీ చికిత్స వుంది. ఇవి కూడా పూర్తిగా నయమవుతాయి. మానసిక బాధపడే వ్యక్తులకు మంచి చికిస్తాను పొందే హక్కు వుంది.ఈ పుస్తకమే ఇప్పటికీ 15 భాషల్లోకి అనువాదమయినది [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు