అమ్మాయిలకున్న బలం - బలహీనత - రెండూ వారి అందం... అందంగా కనబడడం కోసం ఏమైనా చేయడానికి, ఏదైనా పూసుకోవడానికి, ఎంతైనా ఖర్చుపెట్టడానికి వారు సిద్ధం అయిపోతూ ఉంటారు. ఇదిగో... సరిగ్గా ఇదే బలహీనతని సొమ్ము చేసుకోవడానికి వీధి చివర ఉండే బ్యూటీ పార్లర్‌ నుండి బహుళజాతి కంపెనీలు వరకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. రకరకాలుగా ప్రలోభ పెట్టి, తెల్లగా లేకపోతే అదేదో పెద్ద నేరం అయినట్టు, [...]
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. సిగ్గు లేని రాజకీయాలు దేవాలయంలో కూడా తిష్టవేసుకుని కూర్చున్నాయి. శ్రీవారి ఆలయం గురించి, ఆచారం గురించి, ఆభరణాల గురించి సాక్షాత్తు శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితుల వారే పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. [...]
    సమకాలీన సినిమాల్లో చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు రావడం కొంచెం అరుదుగానే జరుగుతోంది. వచ్చిన కొన్ని సినిమాలు కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కమర్షియల్‌ హంగుల్ని అద్దుకున్నవి అయి ఉంటున్నాయి. కాని, చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం తక్కువ కాకుండా, అత్యున్నత భారతీయ విలువల్ని, భారతీయులు నమ్ముకున్న ధర్మంపై నిర్మించబడ్డ శిఖర [...]
    ప్రేమ ఒక మధురమైన, అనిర్వచనీయమైన అనుభూతి. అది హృదయాంతరాళలో నుండి రావాలి. అంతేగాని నేటి సినిమాల్లో చూపించినట్లు ఒక అమ్మాయి భౌతిక రూపం చూసీ చూడగానే చిత్త కార్తె కుక్కల్లాగా వెంటబడి, వాళ్ళని తరిమి, హింసించి, తికమక పెట్టి, ఏదో రకంగా ప్రేమించాను అని వాళ్ళచేతనే చెప్పించుకునే పైశాచిక హీరోలు చేసే పిచ్చి చేష్టలు కాదు. డబ్బు కక్కుర్తి కోసం కొంత మంది సినిమాలు [...]
    భారతదేశానికి 'ఆగష్టు'లో స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇండియా అనే పేరు వచ్చిందనే తప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున సాగుతోంది. నిజానికి స్వాతంత్య్రానికి, ఇండియా పేరుకి ఏ సంబంధం లేదు.    ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో అత్యున్నత నాగరికత వెలసింది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, కళలు, భాష, సాహిత్యం వంటి అనేక రంగాలలో ఉజ్జ్వలమైన [...]
    భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పాకిస్థాన్‌ చెర నుండి విడిపింపబడి, తిరిగి భారతదేశానికి వచ్చిన ఉజ్మా అహ్మద్‌ అనే మహిళ అభిప్రాయపడ్డారు. ఒక పాకిస్థాన్‌ జాతీయుడితో బలవంతంగా వివాహ బంధంలో చిక్కుకుని అక్కడకు వెళ్ళిన ఉజ్మా అక్కడి పరిస్థితులలో ఇమడలేకపోయారు. ఆ దేశాన్ని ఒక 'మృత్యు బావి' గా అభివర్ణించారు. భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను సమర్థించే వారంతా ఈ [...]
    ప్రభుత్వం నుండి అప్పనంగా అన్నీ వచ్చేయాలనుకునే వారు స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన సందేశాన్ని చూసి తలదించుకోవాల్సిందే. దేశ ప్రజలందరికీ బ్రతకడానికి అవసరమైన కనీస మొత్తాన్ని ఉచితంగా ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తెచ్చింది. ప్రపంచంలోనే ఇది మొదటిసారట. కాని, అనూహ్యంగా, తమకు అటువంటి ఉచితాలు ఏవీ వద్దంటూ స్విస్‌ ప్రజలు తమ నిరాకరణను ఓటింగ్‌ [...]
    హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా వాస్తవిక ఆలోచనల మీద ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో విడుదలయిన 'ఎక్సోడస్‌' బైబిల్‌లోని నిర్గమ కాండను బేస్‌ చేసుకుని తీసిన సినిమా. అయినప్పటికీ ఎక్కడా మహిమలు, మహత్యాల జోలికి పోకుండా ఉన్నదున్నట్టుగా తీసారు. ఎక్స్‌మెన్‌ అపోకలిప్స్‌ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇంతకు ముందు ఈ సిరీస్‌లోని సినిమాల్లో లాగానే జన్యుపరంగా [...]
సామాజిక మాధ్యమాలలో అకౌంట్‌ కలిగి ఉండడం ఇపుడు ఒక అవసరంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌లలో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. ఎక్కడో దూరాన ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ కలిసి తమ ఆలోచనలు పంచుకోవడానికి, బాంధవ్యాన్ని నిలుపుకోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే, కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు [...]
        మాంసాహారం మీద దేశంలో చాలా పెద్ద దుమారం రేగుతోంది. మాంసం తినడాన్ని ఒక పెద్ద ఘన కార్యంగా, ఒక మత కార్యక్రమంగా కొందరు హడావుడి చేస్తుంటే, శాకాహారమే గొప్పదని, మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు మాంసానికి అలవాటు పడ్డారని చరిత్ర చెబుతోంది. కాని ప్రకృతి పరంగా చూస్తే, మానవుడు శుద్ద శాకాహారి. మానవులు హోమో [...]
    కార్పొరేట్‌ కాలేజీల ధన దాహానికి, తల్లిదండ్రుల మూర్ఖత్వానికి పరాకాష్టగా, సజీవ ఉదాహరణగా నిలుస్తూ, మరో రెండు జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. చెట్టు పేరు చెప్పుకుని, కాయలు అమ్ముకునే రెండు విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఊడల్లా పాతుకుపోయి, ఇప్పుడు విషనాగుల్లా విద్యార్దుల్ని కాటువేస్తున్నాయి. మొత్తం జరిగిన విషయమంతా రాజకీయ రంగు పులుముకుని, [...]
    తన మతం మాత్రమే గొప్పది, తను చెప్పిందే అందరూ ఒప్పుకోవాలని భావించే ఒక వ్యక్తి విగ్రహారాధనను ఒక భయంకరమైన పాపంగాను, విగ్రహారాధన చేయడం ఎంతో ఘోరమైన నేరంగాను ప్రచారం చేస్తున్నారు. భగవద్గీతలో విగ్రహారాధన గురించి ఉందా అని సవాల్‌ చేస్తున్నారు. అలా సవాల్‌ చేసిన వ్యక్తి ఇంటిపేరును బట్టి ఒకప్పుడు ఆయన కూడా హిందువు అనే విషయం అర్థం అవుతుంది. ఆయన మాత్రమే కాదు, ఇప్పుడు మన [...]
     ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం ఇపుడు ప్రజలందరి ఆశల్నీ అడియాశలు చేసింది. భారతదేశానికి ఒక కొత్త దిశా నిర్దేశం చేస్తారనుకుంటే, ఇది కూడా 'ఆ తానులో ముక్కే' అని ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరూపించింది. 'సీసా కొత్తది అయినప్పటికీ నీరు మాత్రం పాతదే' అనే సామెతను అనుసరించి, అవే ఆధార్‌ కార్డులు, అవే గ్యాస్‌ సబ్సిడీ కష్టాలు, అవే [...]
    ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ గోల ఎక్కువై పోయింది. ఒకడేమో మిమ్మల్ని 'పీకే'స్తారంటూ, బట్టలిప్పుకుని నుంచుంటే, మరొకాయనేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మతం వాళ్ళే. అందుచేత అందరూ మా మతంలోకి రండి అంటూ స్టేట్‌మెంట్లు. మరొకాయన అబ్బే అందరికన్నా మా మతమే గొప్ప అంటూ బ్లాగులో వాగుడు. మధ్యలో మరో మతం వాళ్ళు దూరి, మా దేవుడే నిజమైన దేవుడంటూ వాదనలు... ఇవన్నీ చదవలేక, వినలేక, [...]
    సోవియట్‌ పుస్తకాలతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ వాటి విలువ ఏమిటో బాగా తెలుసు. అందులోను అత్యంత అరుదైన పుస్తకాలను మరలా చదువుతున్నపుడు కలిగే అనుభూతి అపురూపంగా ఉంటుంది. అలాంటి అనుభవమే నాకు కూడా కలిగింది. నాకు సోవియట్‌ పుస్తకాల పట్ల అనురాగం కలిగేలా చేసింది నిస్సందేహంగా మా నాన్న గారే. ఆయన లైబ్రరీలో ఎన్నో సోవియట్‌ పుస్తకాలు ఉండేవి. వాటిలో కొన్ని నాకు ఊహ తెలిసి, [...]
        సోవియట్‌ పుస్తకాల గురించి గుర్తు చేసుకోవడమంటే బాల్యాన్ని తట్టిలేపడమే. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, అన్నింటినీ మించి, ఎంతో విజ్ఞానం - వినోదం - ఆహ్లాదం. ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు గాని, పాత తరంలో పుస్తకాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా రష్యా సాహిత్యంతో సాన్నిహిత్యం ఉండే తీరుతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రచ్చన్న యుద్దం మొదలైంది. [...]
    అవును... ఇది నిజమే... భారత్‌ నిజంగానే గెలిచింది. ఇప్పటి వరకు పరాయి సంకర జాతి పాలనలో మగ్గిన భారత్‌ తన ప్రాభవాన్ని పునరుద్దరించుకోవడానికి, పునరుత్తేజితమవడానికి సమాయత్తమయింది. అది ఈ ఎన్నికల్లో నిరూపితమైంది. దాదాపు 500 సంవత్సరాల పాటు పరాయి పాలనలో నానా అగచాట్లు పడి, 67 సం||ల క్రితం స్వతంత్ర దేశంగా అవతరించినప్పటికి, తెచ్చిపెట్టుకున్న బానిసత్వంతో భౌతికంగా, మానసికంగా [...]
    మొన్న తెలంగాణాలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. వారిని ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ, చివరికి తెలంగాణాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయని, వాటిపై 'మేడిన్‌ తెలంగాణా' అని ఉంటే చాలు వాటిని జనం కొనేస్తారని, ఆ [...]
    'టైటానిక్‌' సినిమా దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన 'అవతార్‌' సినిమా 2009 లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు సినిమాలకు కూడా ఇంగ్లీష్‌ పేర్లు పెడుతుండగా ఒక హాలీవుడ్‌ చిత్రానికి భారతీయ భాషలో అందునా సంస్క ృత నామం 'అవతార్‌'ని పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు ఒక పత్రికకు [...]
         సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు మారని అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. జీవనం సజావుగా సాగడానికి, జీవన పరంపర ఎడతెగకుండా నడవడానికి కారణం ప్రేమ. ఏ దేశ చరిత్ర చూసినా, ఏ భాషలో కావ్యం పరిశీలించినా ప్రేమ లేకపోతే అది సంపూర్ణం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ వల్లనే ప్రపంచ చరిత్రలు తారుమారయ్యాయి. మొదటి ప్రపంచ యుద్దం మొదలవడానికి ఆస్ట్రియా రాజు ప్రేమ వృత్తాంతమే [...]
ఎప్పుడో బ్రిటిష్‌ వారి హయాంలో ఏర్పరిచిన కాలం చెల్లిన పన్నుల విధానాన్నే అవలంభిస్తూ, అందిన కాడికి ప్రజల్ని దోచుకొనే విధానానికి స్వస్తి పలుకబోతున్నామంటూ, భాజపా అభ్యర్థి నరేంద్ర మోడి నుండి స్పష్టమైన సంకేతాలు రావడం దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది.ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వంటి ప్రత్యక్ష పన్నులు, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి ఎన్నో రకాల [...]
    రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక ప్రాంతం వారు తమకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే, మరో ప్రాంతం వారు అందరం కలిసి ఉందామని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రెండు జాతుల మధ్య, తెగల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు చెలరేగినపుడు ఆ రెండు జాతుల ప్రజలు పరస్పరం ఘర్షించుకుని, విడిపోవడం చూస్తూ ఉంటాం. అది యుద్దం ద్వారా [...]
ఇండోనేషియా ప్రభుత్వం అమెరికాతో తన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా ఇటీవల ఒక సరస్వతీ దేవి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించడానికి ఆ దేశానికి బహూకరించింది. ఇండొనేషియా జనాభాలో సుమారు 80 శాతం మంది ముస్లిములు. అయినప్పటికీ, ఆ దేశంలో శతాబ్దాల క్రితమే మరుగున పడిపోయిన ఆ దేశ సాంస్కృతిక వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు [...]
    నేటి సమాజం మొత్తం సినిమా ప్రభావానికి లోనయి ఉంది. ఏ టి.వి. ఛానల్‌ చూసినా సినిమా ఆధారిత కార్యక్రమాలు ఉంటున్నాయి. ఏ మాటలు మొదలు పెట్టినా అవి చివరికి సినిమావైపు మళ్ళుతున్నాయి. ఇక యువత అయితే సినిమాకి బాగా ఎక్కువగా ప్రభావితమవుతున్నది. సినిమాలో  కళాకారులు వేసే వేషభాషల్ని అనుకరించడం నాగరికతగా భావించడం, అదే చాలా గొప్పగా ఆలోచించడం మనం చూస్తూనే ఉన్నాము. మంచి చెడ్డలు [...]
    అసలే ఎన్ని పన్నులు వేసినా ప్రభుత్వం నడపడానికి డబ్బులు సరిపోవడం లేదు. ప్రజల్ని పిండి, పిండి, వారి రక్తం మొత్తం తోడేసినా, ప్రభుత్వానికి ఆర్థిక ఆకలి తీరడం లేదు. ఒకవైపు కిలో రూపాయికి బియ్యం ఇవ్వాలి. రేపు ఎన్నికలొస్తే అర్థరూపాయికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వెనుకబడిన వారికి ఎన్నో పథకాలు ప్రకటించాలి. ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచాలి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు