ఎక్కడనుండో వలస వచ్చిన ఒక అనామకుడిగా మొదలుపెట్టి చిన్న సైజు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు వరద(అరవింద్ స్వామి) తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకి దళపతిలా పనిచేస్తుంటాడు. రెండవ వాడు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్ లో తన దందాని నిర్వహిస్తుంటాడు. మూడవ వాడు రుద్ర(శింబు) సెర్బియా లో అక్రమ [...]
మన దేశంలో తప్పు చేయని వాళ్ళు ఉండవచ్చేమో కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించని వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఉండరనే చెప్పవచ్చు. ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఏ ఒక్కరికీ రోడ్ మీద ఒక్క క్షణం ఎదురు చూసే ఓపిక సహనం అస్సలు ఉండవనే విషయం రోడ్లపై ప్రయాణించే ప్రతిసారి మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి ఒక సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తూ దానిని [...]
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదివినా అడపా దడపా పేరు వినడమే తప్ప ఎప్పుడూ చూసిన దాఖలేల్లేవు ఈ కంచరపాలెం ని కానీ ఇపుడు దర్శకుడు వెంకటేష్ మహా పుణ్యమా అని అక్కడ అణువణువు పరిచయమున్నట్లే అనిపిస్తుంది. సాధారణంగా సినిమాలో చూసిన మనుషుల్నీ, లొకేషన్స్ ని బయట చూస్తే నేనంతగా పోల్చుకోలేను. అదేంటో తాజ్ మహల్ తో సహా ఏదైనా స్వయంగా కళ్ళతో చూసినపుడు ఒక [...]
అమ్మ అంటే లాలనకూ నాన్నంటే క్రమశిక్షణకూ మారుపేరని లోకరీతి కానీ మా ఇంట్లో మాత్రం నాన్నారు మమ్మల్ని సాధారణంగా ఏమీ అనేవారు కాదు అమ్మ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవారు. అదికూడా కోప్పడకుండానే ఓపికగా నెమ్మదిగా తియ్యగా చెప్తూనే మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుండేది. ఒకోసారి అబ్బా ఏంటో అమ్మ ఇన్ని రూల్స్ పెడుతుంది అసలు చెప్పకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోతే బావుండు [...]
నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్ అండ్ ఆకాంక్ష జంటగా నటించిన కొత్త సినిమా మళ్ళీ రావా. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి, పాటలు ఇక్కడ వినండి. ఇవి చూశాక సినిమా గురించి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చి ఉంటే కనుక ఈ రివ్యూతో సహా మరే రివ్యూలు చదవకుండా సినిమా చూడండి. ఓ చక్కని ప్రేమకథని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో మనసుకు హత్తుకునేలా చెప్పాడు గౌతమ్. శ్రవణ్ భరద్వాజ్ [...]
సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తే మనందరం ఏది ఎన్నుకోవాలా అని అంతో ఇంతో కన్ఫూజ్ అవడం సహజం, మన అభిరుచి, అనుభవం, అవసరం ఇత్యాదులని బేరీజు వేసుకుని ఆలోచించి సరైన ఆప్షన్ ఎన్నుకుని ముందుకు సాగుతాం. ఐతే ఈ కన్ఫూజన్ మితిమీరిన మోతాదులో ఉన్న వ్యక్తే అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు). చిన్నతనం నుండీ కూడా ఆ రోజు ఏ డ్రస్ వేస్కోవాలో తల్లి డిసైడ్ చేసి ఇస్తే తప్ప రోజు మొదలవని [...]
హైదరాబాద్ నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరు జగన్నాథ్(సుమన్). అతని కొడుకు మంచి మనసున్న కృష్ణ(సుధీర్ బాబు) తన పుట్టినరోజు పార్టీలో మిత్రులకి పరిచయం చేయడానికి తన తండ్రికి ఇష్టమైన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ "శమంతకమణి" ని అతనికి తెలియకుండా తీస్కెళతాడు. పార్టీ ముగిసే సరికి ఆ కార్ దొంగతనానికి గురవుతుంది. చిన్నపుడు తన తల్లి కొనిస్తానని మాటిచ్చిన ఆ కార్ ఇంటికి వచ్చిన దగ్గర [...]
డాక్టర్ రాజశేఖర్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళవుతుందో అని లెక్కలేసుకుంటే అప్పుడెప్పుడో చూసిన అల్లరి ప్రియుడు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంక ఇంతవరకూ నేను థియేటర్లో చూసిన సినిమాలేవీ గుర్తు రావడమే లేదు. అలాంటిది ఇన్నాళ్ళకు ఒక పవర్ ఫుల్ ట్రయలర్ ప్లస్ ప్రవీణ్ సత్తారు మీద ఉన్న నమ్మకం నన్ను థియేటర్ వైపు నడిపించింది. థియేటర్లో ఉన్న ఇతరులు కూడా "రాజశేఖర్ సినిమా మొదటి [...]
బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులోనా.. అసలా షో ఫార్మాట్ చుట్టూ ఉండే కాంట్రవర్సీలు, ఆ కంటెంట్ మన తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తాయి... అసలదే కంటెంట్ ని యాజ్ టీజ్ గా తెలుగులో చూపించగలరా.. తారక్ ఏమాత్రం హోస్ట్ చేయగలరో.. సెలెబ్స్ ఎవరు వస్తారో ఇలా పలు అనుమానాల మధ్య షో స్టార్ట్ అయింది.. నిజం చెప్పాలంటే సెలెబ్రిటీస్ లిస్ట్ చూశాక వీళ్ళని ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడమేంటి [...]
సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే సక్సెస్ ఫార్ములా వెనక పరుగెట్టడమనే జాడ్యానికి దూరంగా ఉండే అతి కొద్దిమంది దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ వేటికవే వేరు వేరు జెనర్స్ లో ఉంటాయి. సినిమాని ఎలా సక్సెస్ చేయాలా అనే ఆలోచనతో కాక ఒక మంచి కథను ఎలా చెప్పాలా అని ఆలోచించే వ్యక్తి తను. తెలుగు సాహిత్యం తన వారసత్వం దానికి తోడు [...]
ఇంటికి పెద్ద నాన్నే అయినా అమ్మ ప్రేమ ముందు మాత్రం ఆయనతో సహా అందరం చిన్నవాళ్ళమైపోతాము కదా. ఎపుడైనా ఏ చిన్న అనారోగ్యం కానీ అసౌకర్యం కానీ కలిగితే అమ్మ తీసుకునే అన్ని జాగ్రత్తలు ఇంకెవరూ తీస్కోలేరు. అసలు అమ్మ అవగానే అమ్మాయిలకు ఆటోమాటిక్ గా ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానం అలవాటైపోతుందేమో.మిగిలిన వాళ్ళందరూ తీస్కునే జాగ్రత్తలు ఒక ఎత్తైతే మన అమ్మ చేసే పనులు మాత్రం [...]
ఈ సినిమా జ్యో అచ్యుత్ ఆనంద్ అనే ముగ్గురి మధ్య కథ... ఆగండాగండి ముగ్గురు అనగానే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అయిపోకండి.. అంటే ఈ సినిమాలో ప్రేమ లేదా అని పెదవి విరిచేస్తున్నారా.. భలే వారండీ బాబు ఈ సినిమాలో ప్రేమ కూడా ఉందండీ అంటే అది పెళ్ళికి దారితీసే ప్రేమ కాదండీ... అంటే అది కూడా ఉందనుకోండి కాకపోతే అది ఉండీ లేనట్లుంటుందండీ.. ఒక అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం [...]
చంద్రశేఖర్ ఏలేటి -- తెలుగు సినిమాకి దొరికిన మేలి ముత్యం. తను దర్శకత్వం వహించినది కొన్ని సినిమాలకే అయినా వైవిధ్యమైన సినిమాలకి పెట్టింది పేరు, అలాంటి దర్శకుడు మోహన్ లాల్ లాంటి నటుడిని ఒప్పించాడంటే ఎలాంటి కథ చెప్పి ఉంటాడా అని సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుండీ ఆసక్తి రేకెత్తించారు. "మనమంత" ఒక చక్కని హ్యూమన్ ఎమోషన్స్ కి సంబంధించిన కథ. సాయిరాం (మోహన్ లాల్) ఒక సూపర్ [...]
టైమ్ ట్రావెల్... మహా మహా మేధావులు సైతం ఎక్కడో ఓ చోట తడబడి అర్ధం కాక తికమక పడే సబ్జెక్ట్.. "అలాంటి సబ్జెక్ట్ తో సూర్య కొత్త సినిమా అదీ మూడు కారెక్టర్స్ తనే చేస్తున్నాడట. ఇక ఐనట్లేలే" అని తేలికగా నిట్టూర్చేశాను మొదట్లో ఈ సినిమా గురించి విన్నపుడు, కానీ దర్శకుడు విక్రమ్ కుమార్ అనేసరికి కాస్త ఆసక్తి కలిగింది. "మనం" లాంటి ఒక కాంప్లెక్స్ ఐడియాని సింపుల్ గా నెరేట్ చేసిన అతని [...]
అపుడు నాకు తొమ్మిదేళ్ళుంటాయేమో.. ఓ మండు వేసవి మిట్ట మద్యాహ్నం.. గుంటూరు నగరం, అరండల్ పేటలో నడిరోడ్డు.. సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.. నేను మాత్రం.. "పో.. పోవోయ్ చుప్పనాతి సూరీడా నీ ఎండ నన్నేం చేయలేదు నా దగ్గర మా అమ్మ చీర చెంగుంది.." అని సూరీడ్ని సవాలు చేస్తూ అమ్మ చీర కొంగులో తల దాచేసుకుని.. అమ్మ చేతిని గాట్టిగా పట్టుకుని వడి వడిగా నడుస్తూ ఉన్నాను.. చుట్టూ ఏవో రంగు రంగుల [...]
నేటినుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా... 2016కు మనసారా స్వాగతం పలుకుతూ "నిన్నకీ నేటికీ ఏం మారిందనీ గోడమీద కాలెండరు తప్ప" అంటూ నిరుత్సాహపరిచే ఆలోచనలకు తావివ్వకుండా.. నిన్నటికన్నా రేపు మెరుగ్గా ఉంటుందనే నమ్మకమే నేటికి ఇంధనం కనుక ఆశావహ దృక్పధంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ బ్లాగ్ మిత్రులు అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాదిలో మీ [...]
Sand sculptor Sudarshan Patnaik pays tribute to the People's President through this unique sand artమరణం అనివార్యమని తెలిసినా ఆత్మీయులనో ఆత్మ బంధువులనో కోల్పోయినపుడు మనసు బాధపడక మానదు. అదీ కలాం గారి లాంటి మహోన్నతమైన మనిషి దూరమైతే మిన్ను విరిగి మీద పడినంతగా చలించి పోవడం సహజమే. కానీ ఈ సమయంలో ఆయన మరణాన్ని చూసి కన్నీరు కార్చవద్దు ఆయన మహోన్నతమైన జీవితాన్ని చూసి గర్వపడదాం.. స్ఫూర్తి పొందుదాం.. దదాపు గత మూడు దశాబ్దాలుగా (బహుశా [...]
ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్స్ లో తక్కువ వచ్చిన రివ్యూ రేటింగ్స్ అండ్ వాటిలో రివ్యూవర్స్ కామెంట్స్ చూసి నిరుత్సాహ పడి సినిమా చూడడం మానేసిన వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ఈ సినిమా చూడకపోవడం వలన మీరో అద్భుతమైన అనుభవాన్ని మిస్ అవుతున్నారు. చిన్నతనంలో చందమామ లాంటి పుస్తకాలలో చదువుకున్న అందమైన కథలను కనుల ముందు సాక్షత్కరింప జేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. నేను [...]
సన్నాఫ్ సత్యమూర్తి - ’విలువలే ఆస్తి’ - ఆ టైటిల్ కీ ఈ ట్యాగ్ లైన్ కీ వందశాతం జస్టిఫికేషన్ ఇచ్చే సినిమా ఇది. ఒక సినిమాలో హీరోయిన్ తనపై అటాక్ చేసిన రౌడీలని చితకబాదిన హీరోతో “నాకు వాళ్ళకంటే నిన్ను చూస్తేనే ఎక్కువ భయమేస్తుంది” అని అంటుంది. అలా ఈ కాలం సినిమాల్లో హీరోలు విలన్ల కన్నా భయానకంగా తయారవుతున్నారు. విలువల సంగతి దేవుడెరుగు కనీసం సగటు మనిషిలా ప్రవర్తించకపోవడమే [...]
నువ్వెవరు? అనేది చాలా సింపుల్ గా కనిపించే అతి కష్టమైన ప్రశ్న. చాలామందికి అది సమాధానం లేని ప్రశ్న కూడా. ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనే ఆశ రిషి(విజయ్)ని హిమాలయాల్లోని దూద్ కాశి (ఆకాశ గంగ) ప్రయాణానికి పురిగొల్పుతుంది. ఆపేరు మొదటిసారిగా టెంత్ లో తన బెస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం(నాని) తో కలసి విన్నాడు కాబట్టి ఆ ప్రయాణం కూడా తనతోనే చేయాలని నిర్ణయించుకుంటాడు. "డబ్బుదేముంది [...]
కొన్నిసినిమాలు పెద్దగా హడావిడి లేకుండా నిశ్శబ్దంగా విడుదలవుతాయి కానీ ప్రేక్షకుల మనసులో అలజడులను రేపి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి అరుదైన సినిమానే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”. నిజానికి ఈపేరుతో సినిమా మొదలుపెడుతున్నారన్నపుడు అబ్బా మంచి పాటల్లో లైన్స్ ఇలా వాడి పిచ్చి సినిమాలు తీసి చెడగొడతారెందుకో అని అనుకున్నాను. కానీ సినిమా చూశాక ఆ పాట ఎంత [...]
మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని ప్రోత్సహించడం అటువంటి చిత్రాలని అభిమానించే వారు తప్పక చేయవలసిన పని. ఇంచుమించు రెండేళ్ళ క్రితం "క్రాంతిమాధవ్" దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని చిత్రం "ఓనమాలు". ఈ చిత్రానికి ఖదీర్ బాబు రాసిన పదునైన సంభాషణలు ఆకట్టుకుంటూనే ఆలోచింప చేస్తాయి. ఇంత చక్కని సినిమాను మాటీవీ వారు ఈ శనివారం ఫిబ్రవరి 7 న రాత్రి 8 గంటలకు మొదటిసారి ప్రసారం [...]
కాలం ఎంతటి బాధనైనా మరిపిస్తుందని అందరూ అంటూ ఉంటారు కానీ అది కొంతమేరకే నిజం. అంతకంతకూ పెరిగే మధ్యాహ్నపు నీడలా కాలం గడిచే కొద్దీ బాధ కూడా పెరుగుతుంది... అమ్మ మాకు దూరమై నేటికి ఆరేళ్ళు గడిచినా ఆ దిగులు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు సరికదా తను దూరమైనప్పటి కన్నా తను వదిలి వెళ్ళిన శూన్యం ప్రశ్నిస్తూ తను లేని లోటు అనుక్షణం గుర్తొస్తూ ఉండేకొద్దీ ఆ బాధ మరింత పెరుగుతూనే ఉంది [...]
నారా రోహిత్ నాకు నచ్చే నటులలో ఒకరు. తెలుగులో ఇతర కమర్షియల్ హీరోలకి భిన్నంగా తనకంటూ ఒక పంథా సృష్టించుకోవాలని తపనపడే ఇతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మొదటి చిత్రం 'బాణం' లోనే తన ప్లస్ పాయింట్స్ ని సరిగా క్యాచ్ చేసి వాటిని హైలైట్ చేసే కథతో వచ్చి మంచి మార్కులేయించుకున్నాడు. తరువాత ఒక లవ్ స్టోరీ (సోలో), ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా(ఒక్కడినే), ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్ [...]
జవాబులేని ప్రశ్నలు అంటూ ఉంటే అది ప్రయత్నలోపమే తప్ప తగినవిధంగా ప్రయత్నిస్తే సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదని నమ్మే క్యూరియస్ అండ్ డేరింగ్ మెడికో కార్తీక్. తను మెడికల్ కాంప్ లో భాగంగా సుబ్రహ్మణ్యపురం అనే చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఎంతో పురాతనమైన ఒక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంటుంది కానీ ఇటీవల మూసి వేయబడిన ఆ గుడి తలుపులు తెరవడానికి ఎవరు ప్రయత్నించినా అసలు ఆ గుడి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు