అతడొక సైన్యం..ఎదను మండించిన ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..కుతకుతలాడే రుధిరపు ఆవేశాన్ని కరవాలంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..అతడొక సైన్యం..కారే కన్నీటి చుక్కలని తుపాకీ గుండ్లలా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..దూరే పిరికితనాన్ని నిర్జించి, ధైర్యాన్ని ధరించి, కదులుతున్నాడు కదనరంగానికి..అతడొక సైన్యం..కూలే బ్రతుకులు, కాలే కడుపులు, [...]
కంటున్నావా..???నావి కాని కలలు కంటున్న నా నయనాల మాటున ఆగిన స్వప్నాలని...వింటున్నావా..??నాది కాని మౌనాన్నిఆశ్రయిస్తున్న నా అధరాల చాటున దాగిన మౌనాన్ని.. కనిపిస్తున్నదా..??నాది కాని నివేదనను నివేదించలేక శిలై పోయిన నా ఎద తాలూకు మరణవేదన..వినిపిస్తున్నదా..??నావి కాని వేదనలను అందించలేక అలై పోయిన నా మది తాలూకు అరణ్యరోదన.. ఏదో తెలియని వేదన..మది తాలుకు జ్ఞాపకాలని పట్టి కుదుపుతూ [...]
అప్పుడే వర్షం కురవడం మొదలయింది. సన్నటి జల్లులు హాయిగా, ఆర్తిగా నను తడిమేస్తూ, తడిపేస్తూ ఉంటే ఇలా బైక్ నడపడం ఎంతో హాయిగా ఉంది. ఇంక నా వెనుక "తను" కూర్చొని ఉంటే ఈ రైడ్ ఇంకా ఎంత బావుండు అని ఒక్క క్షణం అనిపించింది. కానీ అది ఒక్క క్షణమే, సరేలే ఇంకో పది నిముషాల్లో ఎలాను ఇంటికి చేరిపోతాం కదా, వెంటనే తనని తీసుకోని అలా కార్లో, ఏకాంతంగా(?) ఉన్న రోడ్ల వెంబడి పరుగులు తీయించాలి [...]
ఊహల ప్రయాణం ఊపిరి వున్నంత వరకే..ఊసుల నిరీక్షణం ఊహలున్నంత వరకే.. ఎన్ని చూపులు??ఎన్ని మాటలు??కాలం కరిగిపోతుంది, స్వప్నం ఇక చాలు అని కంటిపాప చెబుతుందా?మది మీటుతున్న భావసరిగమల్ని ఆపమని ఎద చెబుతుందా? ఎన్ని కలలు??ఎన్ని అలలు??సరాగాల అంచులకు.. సుస్వరాల మాలికల్ని చేర్చకు అని రాగమాలిక చెబుతుందా??హారాల రాగ ప్రభంధాలకు.. మనోహరాల ఆల్లికలని పేర్చకు అని హాలిక చెబుతుందా?? ఎన్ని [...]
కల చెదిరినా కన్నీరు రాదేం??మిన్ను విరిగినా మది చెదరదేం??ఆశల సౌధం క్రుంగినా ఎద విరగదేం?? మదిలో బాధాసుడిగుండాల హోరు..ఊహల రెక్కలకు సంకెళ్ళు వేశారు..ఆశల హరివిల్లును కూల్చేసారు..భవిష్యత్తును కాలరాసారు..కలల మ్రొగ్గలను చిదిమేసారు.. మీకేం తెలుసు?? ప్రాతఃకాలపు హిమబిందువు లాంటి మా ఆశల వర్ణాలు..మీకేం తెలుసు??మనో ప్రాంగణాన మేము పెంచుకొన్న వూహల మ్రొక్కలు..మీకేం తెలుసు??కుల మతాతీతపు [...]
ప్రతి దృశ్యం లోనూ..అదృశ్యం గానూ..నయనానందకరంగా నీవు..ప్రతి శబ్దం వెనుకా..సదృశ్యం గానూ..తప్తశిలలా నేను...కంటికెరుపులా..వంటి మెరుపులా..కైపెక్కిన కన్నుల నిండుగా నీవు..తొలిసంజె ఎరుపులా..వెన్నెల మెరుపులా..మెరుపెక్కిన మిన్నుల నిండుగా నేను..పెదవి మధ్యన..మౌనం చాటున..సిగ్గు తెరల వెనుక నీవు..అల్లరి నవ్వుల మాటున..అవ్యక్తపు విరహం పైన..ఆలోచనల తీరాల ముందుర నేను..
(నేనీమధ్య రోడ్డు మీద వెళుతుంటే, అందరూ రోడ్డులో కొంత గ్యాప్ ఇచ్చి, కొంత పక్కగా వెళ్తున్నారు. ఏమయిందా అని చుస్తే, ఒక ముసలి ఆవిడ, పాపం రోడ్డు దాటలేక, నది రోడ్డు మీదే పాక్కుంటూ, రోడ్డు అవతలి వైపుకి వెళ్తూ ఉంది. అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆవిడ ఎంత అపాయంలో ఉందో పట్టించుకోవడంలేదు. నానాటికీ మనుష్యులలో మృగ్యం అయిపోతున్న మానవత్వానికి ఆనాటి సంఘటన [...]
నా కన్నుల మాటున దాగిన బాసలు.. నా పెదవుల చాటున చిక్కిన ఊసులు.. నా ఎద సడిలో ఇంకా పురివిప్పని ఊహలు.. నా అంతరంగమధనపు కన్నీటి కలలు.. నా మది నడిసంద్రపు జ్ఞాపకాల అలలు.. నా హృదయ అంతర్వాహినిని తాకే తప్త శిలలు.. నాలో మమేకమై, జీవితాంతం నిలిచే నీ జ్ఞాపకాలు.. నా మనోవ్యధను తీర్చే మలయమారుతపు వీచికలు.. నా గుండె గుప్పిట దాగిన విరహాగ్నిని దాచే కనీనికలు.. నా స్వాప్నికజగత్తులో నాతొ విహరించే నా [...]
వింటారా..??వినీలాకాశంలో తారకలు తలుక్కున అందిస్తున్న..మేఘలోకంలో మెరుపులు తటిల్లున నినదిస్తున్న..దగ్ధగీతం..వింటారా..??గడ్డిపూలపై నిలిచిన తుషారబిందువుల చారకలు చూపిస్తున్న..ధరిత్రీతలంపై మొలచిన గడ్డిపరకల మరకలు కురిపిస్తున్న..దగ్ధగీతం..వింటారా..??చీకటిలో వెలుగు పంచుతూ తను కరిగిపోయే కొవ్వొత్తి రాసే..రెక్కలొచ్చిన పక్షి గూడు వదిలితే కన్నతల్లి పడే తపన [...]
నేను ఈ మధ్య MelGibson దర్శకత్వం వహించిన Apocalypto సినిమాని చూడటం జరిగింది. దీన్ని చూసిన మొదలు బ్లాగ్ లోకంలోని మిత్రులందరికీ దీన్ని పరిచయం చెయ్యాలనిపించింది. సినిమా అద్యంతమూ చాలా ఆసక్తితో నడుస్తుంది. ఇలా సినిమాని అద్యంతమూ ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఇక సినిమా కథ, కథనాల విషయం దగ్గరికి వస్తే,సినిమా మొదలు కావడమే Will Durant యొక్క ఒక quote "A great civilization is not conquered from without until it has destroyed itself from [...]
నిశ్శబ్ధ నీరవ నిశీధిలో,చిరుదివ్వెపు వెలుగువై కనిపిస్తావని.. పున్నమి వెన్నెల తరంగాలలో,వెల్లువలా వెలువెత్తుతావని.. వసంత మలయమారుతంలో,మరుమల్లియలా మురిపిస్తావని.. చల్లని సంధ్యా సమయంలో,సంగీతంలా వినిపిస్తావని..అల్లన మెల్లన పిల్లగాలులలో,ఊహాల ఊయలవై ఊపేస్తావని.. పరిమళించు సుమ సుగంధాలలో,విరిసిన నీ ఊసులు పంపిస్తావని..ఇలా..నీకై వేయికన్నులతో వేచియున్నానని,నీ కెలా చెప్పను?? [...]
కలలు మానిన నా కళ్లు..నీపై ఆరాధనకు నకళ్ళు.. తలపుల తావిలో తడిచిన నా కళ్లు..నీపై సరాగాల తోలకరి జల్లు.. వుహాల పెన్నిధిలో వూయలూగిన నా కళ్లు..నీపై అనురాగపు పూజల్లు..కనీనికలో నీ చిత్తురువుని దాచిన నా కళ్లు..అనంతపు అందాల హరివిల్లు.. క్షణమైనా మూయని నా కళ్లు..నీపై నిలిచిన చూపులకు సంకెళ్ళు.. నిశ్శబ్దపు నీరాజనాల నా కళ్లు..నీపై ముసిరిన వలపులకు వాకిళ్ళు..Note: కలలో.. కన్నీటి అలలో.. బ్లాగులో కల [...]
ఆగని కాలం వెంబడి పరుగులు తీస్తూ.. ఎగిసే అలల పైబడి అందనంత ఎత్తుకు ఎగుస్తూ.. కరిగే కలల కోసం వెంబర్లాడుతూ.. నే తీసే పరుగులు నీకు గుర్తున్నవా?? ఊహా సౌధాల వెంబడి ఉరుకులు పెడుతూ.. గడచిన గతాల కోసం ఎదను త్రవ్వుతూ.. నీ సన్నిధిలో ఆగిన క్షణాలను అందుకొంటూ.. నే వేసే అడుగులు నీకు గుర్తున్నవా?? నీ నీడను అనుగమిస్తూ..నీ జాడను అనుసరిస్తూ..నీ శ్వాసను తీసుకుంటూ..నీ ధ్యాసను మోసుకుంటూ..నే రాల్చే [...]
ఆలోచనల అనంత సాగర గర్భాన నిలుచుంటావు..సులోచనల రెప్పల మాటున సిత్రమై దాగుండిపోతావు..అంతులేని ఊహల మేఘమాలికలలో పవళించిపోతావు..పొంతన లేని కలలా కడలి కెరటమై నను ముంచెత్తుతావు..సైతకసీమల్లో శిలలా నిలిచి నను మైమరచుతావు..ప్రతిరోజూ నిన్నటి కలలా మిగిలి నను ఏకాంతంలో నిలిపేస్తావు..నేడు రేపయ్యేలోగానే నను ఊహల్లో నిలిపి, నిన్నటి స్వప్నంలా మిగిలిపోతావు..మొన్నటి జ్ఞాపకంలా నను [...]
ప్రియమైన బ్లాగు మిత్రులందరికీ, నేను నా బ్లాగు రూపురేఖల్ని మార్చేసాను. చూసిన వారందరూ చాలా బావుంది అని అంటున్నారు. మీకు ఈ template నచ్చితే దాన్ని ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోండి. నా బ్లాగు రూపురేఖలు మార్చడంలో సహాయ పడ్డవారందరికి కృతజ్ఞతలు. మీకు మరిన్ని templates కావాలా? అయితే తెలుగు'వాడి'ని గారి బ్లాగుని ఒక సారి సందర్శించండి. నేను ఈ template ని అక్కడి నుంచి దిగుమతి చేసుకొని నాకు నచ్చిన [...]
మరచిపోయావా?నువ్వు నేను కలిసి పంచుకొన్న ఊహలు..మనస్సూ మనస్సూ కలిపి విరచించుకొన్న ఊసులు..వాడిపోయాయా?నాకై నువు రువ్విన ఓరచూపుల కంటికొనల ధృక్కులు..నాకై నువు రాల్చిన మంత్ర ముగ్ధపు మనోహర వాక్కులు..చెరిగిపోయాయా?నువ్వు నేను మెలిసి నడిచిన దారిలో విరిసిన పాదముద్రలు..నువ్వు నేను రాసి మది అంతరంగపు పుటల్లో దాచుకున్న కవితలు..కరిగిపోయాయా?నీకై నేను పంపిన వలపు మేఘసందేశాల [...]
పృథ్వీ గారు గీసిన ఒక అద్భుతమైన కళాఖండానికి నా స్పందన..కడవనెట్టుకొన్న రాయంచ చెరువుగట్టు మీద నడచుచుండ.. రెప్పదాటుకొన్న చూపు పడతి చనుకట్టు మీద పడుచుండ..పిక్కదాటుకొన్న అతివ చీరకట్టు మదిన మరీచికలు వీచుచుండ..మనస్సు దోచుకున్న మగువ కనికట్టు ఎద చప్పుడు దోచుచుండ..అలమెల్లన కదిలే రమణి కృష్ణవేణి జంటసర్పాలేమో అనిపించుచుండ..వాలుకళ్ళలో మెదిలే తొయ్యలి భావమోహనం రాగ వీచికలు [...]
నిరాశలో ఎన్ని వేడి నిట్టూర్పులు విడిచానో..నా ఈ గది నాలుగు గోడలకే తెలుసు..నీధ్యాసలో ఎన్ని రుధిరాశ్రువులు రాల్చానో..నా ఈ తలపులు పంచుకొనే తలగడకే తెలుసు..నీశ్వాసలో మునిగి ఎన్ని పరివేదనలు దాచుకున్నానో..నా ఈ స్మృతి యవనికలకే తెలుసు..నీఆశలో తేలి ఎన్ని విరహవేదనలు మిగుల్చుకున్నానో..నా ఈ గతి పవనికలకే తెలుసు..నీకోసం విరించినై ఎన్ని ప్రేమలేఖలు రాసానో..వలపులు నింపుకొనే నా [...]
వెళ్ళిపోతున్నావా నేస్తం చదివారా? దీన్ని చదివే ముందు దాన్ని చదువగలరని మనవి. నువు విహరించిన పూతోటలో..నువు పహరించిన దారిలో..నే ఏరుకున్న నీ నవ్వుల కుసుమాలన్నీనను ఓదారుస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??నువు మెరిసిన జ్ఞాపకాల విపణిలో..నువు కురిసిన కలల ధరణిపై..నే పేర్చుకొన్న నీ చూపుల సిత్రాలన్నీనను నడిపిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??నువు విరిసిన నా ఊహల [...]
ప్రియమైన నీకు, ఎలా వున్నావు నేస్తం అంటూ మరుపురాని నీ జ్ఞాపకాలు నను మైమరపిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే ఏమని సమాధానమివ్వను నేస్తం? కుశలమా నేస్తం అంటూ ఊహలపల్లకిలో ఊయలూపేసిన ఊసులు నను ఆరాటంగా స్పృశిస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే ఏమని చెప్పగలను నేస్తం? కనులు కనులు కలిసి చూపులతో జరిగిన రాయభారాలు, అన్నిటికీ మౌనమేల, మాట పెదవి దాటదేల, అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే దానికి మౌనమే సమాధానమైతే [...]
శిలలు ధార ప్రవృత్తికి కరిగినా..మరులు క్షార వృద్ధితికి క్షీణించినా..విరులు క్షామ తీవ్రతకి కృశించినా..నేను మాత్రం నీ వూహల వానలోనే తడుస్తూ వుంటా.. -Inspired By Anonymous poet.
నాలో నేను..నిత్యం భావ ఝరంపరిలో తడిసి ముద్దై పోతూఉంటాను..అనునిత్యం అనురాగ శరంపరిలో ఆలంబన పొందుతూఉంటాను..ఆద్యంతం సంఘర్షణ ఒడిలో స్వాలంబన పొందుతూఉంటాను..నాతో నేను..అంతం లేని ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతూ ఉంటాను..సొంతం కాని కలల ప్రాకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాను..పొంతన కుదరని వాస్తవాల కడలిని ఈదుతూ ఉంటాను..నాకై నేను..ఊహల పందిరి వేసే అనుభూతుల్ని నెమరు వేసుకొంటూ [...]
నువ్వు మిగిల్చిన ఏకాంతంలో, నీవు పేర్చిన జ్ఞాపకాల అరలని శోధిస్తున్నా.. అక్కడైనా నీ సన్నిధి దొరుకుతుందేమోనని..నువ్వు విదిల్చిన ఒంటరితనంలో, నీవు మరచిన ఊసులదొంతరలని చేధిస్తున్నా.. అక్కడైనా నీ ఊహల నిధి చేజిక్కుతుందేమోనని..నీవు మిగిల్చిన నిశ్శబ్ధపు నీరవంలో, నీవు విహరించిన కలల కైమోడ్పులైనచక్షువులని తెరవలేకున్నా.. ఎక్కడ నీ రూపం మాయమవుతుందేమోనని..నీవు విదిల్చిన అశ్రు [...]
అందమైన బాల్యం..అమ్మ ఒడిలో వికసించి..అనుభూతుల రెక్కలు తొడిగి..ఊహాలోకంలో విహరించాల్సిన అందమైన బాల్యం..పేదరికపు ఒడ్డున రెక్కలు తెగి..రేపటి ఆశలేని బ్రతుకు ముక్కలు అయి..రుధిర సంద్రంలో కష్టాల నావ నెక్కి..అలుపెరగని పోరాటం చేస్తోందీ అందమైన బాల్యం..అందమైన బాల్యం..అల్లరి చూపులతో ముద్దు తెప్పించాల్సిన..చిలిపి చేష్టలతో నవ్వుతెప్పించాల్సిన..ముద్దు మాటలతో మురిపించాల్సిన అందమైన [...]
మనస్సునంతా అలమెల్లనై కదిలించి..తనువునంతా తటిల్లతై కరిగించి..రూపంతా విద్యుల్లతై తాకి..చూపంతా శరాఘాతమై సోకి..లోకమంతా శూన్యమై వినిపించి..దిక్కులన్నీ ఏకమై కనిపించి..చుక్కలన్నీ నవ్వులై వికసించి..మరులన్నీ కురులై మరిపించి..ఊపిరులన్నీ విరులై మురిపించి..ధ్యాసలన్నీ నా శ్వాసలై ఉరిపించి..నన్నేడిపించుట న్యాయమా?
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు