భర్త మాట వినని భార్య ఉండటం సహజమైపోయింది.తండ్రి మాట వినని బిడ్డలు లేని కుటుంబం లేదనుకోవచ్చు.గురువు చెప్పే మాట వ్యతిరేకించడం విధ్యార్దుల నైతిక హక్కు అనుకుంటున్నారు. యజమాని మాట వినే పనివాడు ఉన్నాడు అని చెప్పడం సాహసం అనుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఇంతకాలం సాఫ్ట్ వేర్  వ్యవస్థలో నేను నిలదొక్కుకుని ఉండగలిగానంటే దానికి ఒక్కటే ఆయుధం. అదే ఎజైల్.. దానిలో చెప్పే విలువలు [...]
దీపావళి అనేది రాక్షస సంహారార్దం జరుపుకునే ఓ పండుగ.అలాంటి కారణాన్ని అడ్డు పెట్టుకుని, చైనా వస్తువులు ఎన్ని భారత దేశంలో అడుగుపెడుతున్నాయో తలచుకుంటే, భారతదేశ ప్రజలు చైనా ఆర్దిక వ్యవస్థకు ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్దం కావటం లేదు. ఫెస్టివల్ ఆఫర్సు ద్వారా కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా దాదాపు లక్షకోట్లు వారికి చేరుతున్నాయి అంటే అది [...]
ఈ పోస్టు చాలా మంది ఆడవాళ్లకు నచ్చక పోవచ్చు. ఎందుకంటే, ఇది మా జీవితం, మా ఇష్టం, నువ్వెవ్వడివి నన్ను’ఇలా ఉండాలి..’ అని శాసించడానికి అనేది వారి యొక్క భావన.అలాంటి భావన ఉన్నవారు, ఈ పోస్టుని ఇక్కడితో చదవడం ఆపేసి, మీకు ఇష్టమైన మఱో పని చేసుకోండి. భారతీయ సాంప్రదాయానికి పట్టుకొమ్మలాంటిది రామాయణం. రామాయణాన్ని విష వృక్షంగా అభివర్ణించినది ఓ ఆడది. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. ఆ విషయం [...]
జీవితం ... ఈ క్రింద ఉన్న వీడియో ఒక ప్రింటర్ వారి వ్యాపారాత్మక ప్రకటన. కాకపోతే, ఇందులో ఉన్న కధనం బాగుంది.చివ్వరలో ఇచ్చిన వాక్యాన్ని కొంచం మార్చితే చాలా నచ్చింది.to live side by side with someone, is a life worth livingఈ చిన్న మాటలో ఎంత అర్దం దాగిఉందో కదా అనిపించింది .. భారతీయ సాంప్రదాయంలో విడాకులు అనే ప్రశక్తే లేదు .. ఆ విషయాన్ని ఎందుకు గమనించరో భారతీయులు. పాశ్చాచ్య దేశాలను చూచి వారి ఆత్మగౌరవాన్ని [...]
Emma Watson's "HeforShe" Speech as UN Women Goodwill Ambassador from UN Women ఎమ్మా వాట్సన్ .. ఈ అమ్మాయి మాట్లాడిన విషయాలు చాలా సూటిగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే, ఎప్పుడు.. నేను కాకపోతే ఎవ్వరు .. అంటూ నిగ్గదీసిన తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను.చాలా కాలం తరువాత వ్రాస్తున్నందున, ఇక్కడితో ఆపేస్తాను.------------------------------------------- వినదగు నెవ్వరు జెప్పినన్ వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసినమనుజుడే పో [...]
వివిధ దేశాలలో ఉండే తెలుగు వారికి, ఓ విన్నపం.నాకు తెలిసిన ఓ స్నేహితురాలు, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఆ డిగ్రీకి అనుసంధానంగా, ఓ సర్వే చేయవలసి ఉన్నది. కావున, మీకు వీలైతే ఓ ఐదు నిమిషాల సమయం కేటాయించి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయ మనవి.నా స్నేహితురాలి పేరు శూసన్, Susan. ఆ అమ్మాయికి మీరు సహాయం చేయ్యాలంటే, https://umsbe.eu.qualtrics.com/SE/?SID=SV_5w4mKRsT4zgYG1f (లేదా) http://j.mp/1mEvCIP గమనించ గలరు. ఆ అమ్మాయి మాటలలో [...]
భారతీయ సంస్కృతిలో రెండు అంతకన్నా ఎక్కువనదుల సంగమమాన్ని ప్రయాగ అంటారు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మొన్నామధ్య నాన్నగారి అస్తికలు ప్రయాగలో, అలహాబాద్ లోని ప్రయాగలో నిమజ్జనం చెయ్యడానికి వెళ్లి వచ్చిన తరువాతనే ఈ విషయం అర్దం అయ్యింది.   పేరు ఏ ఏ నదుల సంగమము ప్రయాగ రాజ్ గంగ యమున సరస్వతి సంగమము దేవ ప్రయాగ అలకనంద భాగీరధి సంగమము రుద్ర [...]
ఈ నెలలో నాన్నగారి మొబైల్ నుంచి ఒక్క కాల్ కూడా లేదు. పోనీ నేను చేద్దాం అనుకుంటే, అన్నయ్య ఆన్సర్ చేస్తున్నాడు. లేరు అన్న విషయం ఎంత నిజమైనా, తెలియకుండా ఏదో ఒక సమయంలో నాన్నగారి తో మాట్లాడాలన్న ఆలోచన వస్తునే ఉంది.             భావాలు ఎన్ని ఉన్నా, ఎమీ వ్రాయలేకపోతున్న నా చాతకాని తనానికి సిగ్గుపడుతున్నా.
గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.   ఉపోద్ఘాతం: ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు. ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు. ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ [...]
  నాకు వివాహం అయ్యి ఆరు సంవత్సరాలైనా ఇంతవరకూ పిల్లలు లేరు, అది ఇక్కడ అప్రస్తుతం. కానీ ప్రస్తుతమైనదేమిటంటే, పిల్లల గురించి. ఇలా ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, పైన చిత్రంలో ఉంచిన విఘ్నేశ్వర స్వామిని నా చేత్తో చేసుకున్న ప్రతిమ. ఈ ప్రతిమను చేసిటప్పుడు నేను ఎంత శ్రమ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. చక్కగా ఓ ముద్రించిన మట్టి మూర్తిని కూడా తెచ్చుకున్నాను, అయినా ఇలా [...]
ప్రస్తుతం వ్రాస్తున్న భావనలు మూడో సారి అమెరికాని విజిట్ చేసిన తరువాత వ్రాస్తున్నవి. మొదటి సారిగా 2008లో అమెరికాని చూడటమైనది. మఱో రెండేళ్ల తరువాత 2010లో, మఱో రెండేళ్ల తరువాత ఇప్పుడు. ఈ నాలుగేళ్లలో అమెరికా ఏమీ మారలేదు. మొదటి సారి విచ్చేసినప్పుడు ఉన్న పరిస్తితులు, అప్పటి మనుష్యుల ప్రవర్తనలు, ఆ అలవాట్లు, నేను గమనించాను అని అనుకున్నవి అన్నీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఏ మాత్రం [...]
ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం [...]
హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!! మొదటి కధ: ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి [...]
ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు [...]
ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది. కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. [...]
ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే [...]
స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను. జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే [...]
డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా [...]
వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై [...]
చదరంగం ఆట అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. చాలా రోజులుగా నేను ఈ ఆటని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆడుతునే ఉన్నాను. అంతా కాకపోయినా కొంతలో కొంత ఘటికుడనే అని చెప్పుకోవాలి. కానీ నాలోని ఓ బలహీనత నన్ను ఈ ఆట యందు ఎదగకుండా ఉంచుతున్నదని నాకు కొంతకాలం వరకూ తెలియదు. కానీ తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఆలశ్యంగా నైనా అసలు విషయం తెలిసినందులకు కొంతలో కొంత మెఱుగైనా, [...]
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం! ★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★ హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు. ఇది తెలుగు బాట లంకెలో  ఉన్న సమాచారం. కానీ దీనికి ఓ చక్కటి పుట వ్రాద్దాం అని ఆలోచిస్తూన్నంతలో నామాల మురళీధర్ గారు ఓ చక్కని లేఖవ్రాసారు. దానిని యధాతధంగా ఇస్తేనే నా [...]
వెళ్ళిన వెంటనే లగేజి సత్రంలో ఉంచి, కాల కృత్యాలు తీర్చుకుని ప్రక్కనే ఉన్న గోదావరిని చూచి వచ్చిన తరువాత ఆలశ్యం అవుతోందని, తొందరలో అయ్యవారి దర్శనార్దం వెళ్ళాము. తీరా దేవాలయం దగ్గరకి వెళితే, అయ్యవారు కొండెక్కి కూర్చున్నారు. ఆ మాత్రం కష్టపడక పోతే అయ్యవారి దర్శనం కలగదులే అని అనుకుని, మెల్లగా ఒక్కోఅడుగు ముందుకు వేసుకుంటూ కనబడుతున్న మెట్లెక్కడం మొదలు పెట్టాను. భక్తులలో [...]
ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు. యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ [...]
మా అమ్మ షుగర్ వ్యాధితో చాలా కాలంగా బాద పడుతూ దానికి సంబందించిన మందులను వేళ తప్పకుండా వేసుకుంటూ అలా వేసుకోవడానికి అలవాటైపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎండాకాలంలో చక్కగా మామిడి పళ్ళు తినాల్సి వస్తే, చక్కగా ఓ రొండు షుగర్ టాబ్లెట్లు వేసుకుని తృప్తిగా మామిడి పళ్ళు లాగించేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే, మా అమ్మ పరిస్థితి చాలా బాలెన్సుడ్ గా సాగుతోందనే [...]
అమ్మఒడి ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు