సికింద్రాబాదు రైల్వేస్టేషనులో ఎయిర్‍టెల్ వాళ్లు మరియు బ్యాంకు ఆఫ్ బరోడా వాళ్లు వృద్దులకు.. వికలాంగులకు ఉచిత వీల్‍చెయిరు సదుపాయం కల్పించారు.  ఇది మామూలు వీల్‍చెయిరు కాదు...బాటరీ ఆపరేటెడ్ ఆటో..చాలా సౌకర్యంగా ఉంది.  రైలు స్టేషను చేరుకునేముందే వీరికి ఫోను చేసి ఫలానా రైలు ఫలానా బోగీకి వస్తున్నాం  అని చెపితే వాళ్లు రైలు వచ్చే సమయానికి ఆ బోగీ దగ్గరకు వస్తారు.  [...]
పేదరికం వాళ్ల ఆశలమీద నీళ్లు చల్లుతున్నా వాళ్ల పట్టుదల..దీక్ష వాళ్లకి దారి చూపుతున్నాయి.  ఒక్కొక్కళ్లది ఒక్కో కథ..వ్యథ.  ఈ సారి EAMCET లో అతుత్తమ మార్కులు వచ్చిన వాళ్లలో ఎక్కువమంది నిరుపేద కుటుంబాలనుండి వచ్చినవాళ్లే.  తండ్రి దూరమయినా ఆయన మాటే వేదంగా మెకానిక్ మామయ్య అండతో పట్టుదలగా చదివి ఆకాశమే హద్దుగా 159 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచిన పల్లవి..పల్లవితో సమానంగా EAMCET [...]
మధ్యాహ్నం రెండిటప్పుడు మా తలుపు టకటకా మోగిందింటే అది సపోటాల లక్ష్మే అని అర్థం.  వచ్చిందంటే తీసుకునేదాకా ఊరుకోదు. ఒక్క సపోటాలే కాదు ఏ సీజనులో పళ్లు ఆ సీజన్లో తెస్తుంది..ఎక్కువగా మాత్రం సపోటాలే.  అవేమో మరీ గోళీకాయలలాగా ఉంటాయి..అందులో గడ్లు పోతే మనకు తినటానికి ఏమీ మిగలదు! వద్దు అంటే వినదు...ఒక డజనన్నా తీసుకోమ్మా అంటూ బ్రతిమాలుద్ది..నాకొద్దు..పిల్లలు [...]
కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండగానే అసలు దాంట్లో కథ ఏంటో మర్చిపోతాం (ఉదాహరణ రంగనాయకమ్మ గారి జానకి విముక్తి..రెండు మూడు భాగాలు).. కొన్ని చదివాక కొన్ని రోజులు గుర్తుంటాయి..ఆ కొన్ని రోజుల తరువాత గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తాయి...కొన్ని ఆ పుస్తకం మరలా తెరిచి చూస్తే కాని గుర్తుకు రావు.....మరి కొన్ని ఉంటాయి చదివాక ఎన్ని రోజులయినా అందులో పాత్రలు మనల్ని వెంటాడుతూనే [...]
 నా బ్లాగు ముఖం చూసి ఎన్ని రోజులయ్యిందో! ఈ మధ్య వ్యక్తిగత కారణాలవల్ల బ్లాగుల్లోకి రావటం లేదు, గత పదిరోజులుగా అడపాతడపా కొన్ని బ్లాగులు చూస్తున్నా నా బ్లాగుని మాత్రం పలకరించలేదు.  ఎప్పుడైనా నేను వ్రాయటం తక్కువే..ఇప్పుడు అది మరీ అరుదయిపోయింది. ఇంతకు ముందు వ్రాయటం తక్కువయినా అన్ని బ్లాగులు చదివేదాన్ని..ఇప్పుడు చదవటం కూడా అంత ఆసక్తిగా ఉండటం లేదు.  నా ఖాళీ సమయమంతా [...]
ఫిబ్రవరి 9 సాయంత్రం 4:30-5:00 గంటల మధ్య మా నాన్న గారు ఆకస్మికంగా విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర గుండెపోటుతో మరణించారు.  అసలు అది గుండెపోటో కాదో కూడా తెలియదు.  అమ్మ వాళ్లంతా గుడిలోకి వెళుతుంటే నేను లోపలకి రానులే అని బయటే కూర్చున్న ఆయన వాళ్లు ఓ 20 నిమిషాలల్లో దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి కూర్చున్న ఆయన కూర్చున్నట్టే పక్కకి ఒరిగిపోయి ఉన్నారు.  పక్కన ఉన్న వాళ్ల కథనం [...]
ఎందుకో ఈ మధ్య నా ముసాయిదా పత్రాలు తిరగేస్తుంటే ఎప్పుడో 2008 లో రాధిక గారి బ్లాగు గురించి నేను వ్రాసి పెట్టుకున్న ముసాయిదా కనపడింది.  ఇది అప్పుడే నా బ్లాగులో పెట్టవలసింది....కానీ అదే సమయంలో పొద్దులో తన కవితల గురించి మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు అని జాన్ హైడు గారి వ్యాసం వచ్చింది. ఇక అంతటి గొప్ప వ్యాసం వచ్చాక నా పరిచయం ఎందుకులే అని నేను ఇక దీన్ని బ్లాగులో పెట్టలేదు. [...]
 మిలే సుర్ మేరా తుమ్హారా ..........తలుచుకోగానే  గుండెలు ఉప్పొంగే గీతం! రెండు దశాబ్దాల క్రితం 1988 ఆగస్టు 15 న దూరదర్శన్‌లో  వచ్చిన మిలే సుర్ మేరా తుమ్హారా..ఈ గీతం వినని భారతీయుడు.......పరవశించని భారతీయుడు ఉండి ఉండడు.  దేశం మొత్తాన్ని ప్రాంతాలకతీతంగా ఓ ఊపు ఊపిన గీతం.  అప్పట్లో ఆ గీతం వచ్చిన 6 నిమిషాలు అలా కళ్ళప్పగించి చూసేదాన్ని.  భీంసేన్ జోషి స్వరంతో మొదలయ్యి..అలా అలా గాలిలో [...]
గత రెండునెలలుగా రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణాప్రాంతంలో జరుగుతున్న బందులపర్వం చూస్తూనే ఉన్నాం.  ఈ రెండునెలల్లో పట్టుమని పదిరోజులన్నా కాలేజిలు జరగలేదు.  విద్యాసంవత్సరం  ఆఖరులో ఈ బందుల వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపో్తున్నారో! ముఖ్యంగా ఇంటరు విద్యార్థులు..వాళ్లకి ఈ రెండు..మూడునెలల కాలం చాలా విలువయినది..తిరిగి రానిదీనూ...మరీ ముఖ్యంగా తెలంగాణా ప్రాంత విద్యార్థులే [...]
 పల్లెల్లో  సంక్రాంతి ఓ ప్రత్యేక పండగ. సామాన్యంగా ఈ పండగ సమయానికి  ప్రతి ఇల్లు ధాన్య రాసులతో కళకళలాడుతుంటుంది.. ముంగిట ముత్యాల రంగవల్లులు..గొబ్బెమ్మలు..భోగి మంటలు...అరిసెలు.....కొత్త బియ్యపు పొంగళ్ళు.....కొత్త అల్లుళ్లు.......వెరసి  బోలెడన్ని సరదాలు... ఇప్పటికే హరిదాసులు, బుడబుక్కల వాళ్లు కనుమరుగయ్యారు.....ఇక ముందు ముందు ముంగిట ముగ్గులు కూడా కనుమరుగవుతాయేమో....సరే నాకు [...]
డిసెంబరు 31, 2009.....11:59:01..మరో కొత్త సంవత్సరానికి కౌంటు డౌన్ మొదలవుతుంది.అప్పుడే మరో సంవత్సరం గతం అయిపోబోతుంది..మరో సంవత్సరం వర్తమానం కాబోతుంది.  కాలం ఎవరికోసం ఆగకుండా ఇలా పరుగులు పెడుతుంది. దానికి ఎవరితోనూ పనిలేదు..ఎవరికోసం ఎదురు చూడదు...ఒకటే పరుగు....పరుగు.... ఇలా సంవత్సరాలు గతించే కొద్దీ మనకూ వత్సరాలు నిండుకుంటున్నట్టేగా! మరి ఎందుకో ఇంతగా ఈ క్షణం కోసం ఎదురు [...]
"నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు" వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తన పని చేసుకొని వెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు..........అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ....ఎవరి అక్షరాలంటే వాళ్లకి ఇష్టమే.....కానీ మన అక్షరాలని ఇష్టపడే పాఠకులు ఎంతమంది ఉంటారు?నెమలీక అంటే [...]
 శనివారం (19/12/09) పుస్తక ప్రదర్శనలో ముఖ్యమయిన కార్యక్రమం వాక్ ఫర్ బుక్సు.  ఆ సందర్భంగా  చాలామంది ప్రముఖులని చూసే అవకాశం కలిగింది.చుక్కా రామయ్య గారు (ప్రముఖ విద్యావేత్త), పరుచూరి వెంకటేశ్వరరావు గారు (సినీ రచయిత), దేవానంద్ (ఐ.ఏ.ఎస్ ఆఫీసరు), జెన్నీ (సినీ నటులు, రచయిత), తెలకపల్లి రవి గారు (జర్నలిస్టు, టి.వి విశ్లేషకులు), రవిప్రకాష్ (టి.వి 9), చొక్కాపు వెంకటరమణ (మెజీషియను మరియు [...]
హైదరాబాదు అనగానే అందరికి గుర్తుకొచ్చేది..జనవరిలో జరిగే ఎగ్జిబిషను ..దాంతోపాటు గత నాలుగయిదు సంవత్సరాలుగా అంతే ప్రాచుర్యాన్ని పొందుతున్న మరో ప్రదర్శన హైదరాబాదు పుస్తక ప్రదర్శన.  మరి ఈ సారి పుస్తక ప్రదర్శనకి ఎంతమంది బ్లాగర్లు వస్తున్నారు?  అక్కడ e-తెలుగు స్టాలు కూడా ఏర్పాటు చేసారు.  ఆసక్తి... ఉత్సాహం ఉన్న బ్లాగర్లు, బ్లాగేతరులు e-తెలుగు స్టాలుకి వచ్చి అంతర్జాలంలో [...]
నువ్వూ నేనూ చివరిసారిగా కలిసింది ఎప్పుడు?......నా పెళ్లిలోనా?20 సంవత్సరాల సుదీర్ఘ కాలం.....ఏ సీమలో ఉన్నావో .....ఎలా ఉన్నావోకుశలమేనా......నీకు కుశలమేనాఅనుకుంటూ ఇన్నాళ్లూ అన్వేషణలుపిల్లలెంత మందో?ఎలా ఉంటారో?నీలాగా పాడతారా?నీ అంత సుకుమారంగానూ ఉంటారా?నీలాగా బద్దకం ఎక్కువా?జవాబు దొరకని ప్రశ్నలు.....మరుగునపడ్డ జ్ఞాపకాలుఎప్పటికయినా కలుస్తాం అన్న ఆశఇక ఎప్పటికీ కలవమేమో అన్న [...]
ఏంటో ఇన్నాళ్లు తెలంగాణా వచ్చేది కాదులే అని గుండెల మీద చెయ్యేసుకుని కూర్చున్నాం.  తెలంగాణా వచ్చేసినట్టే అని ఓ పక్క తెలంగాణా ప్రజలు ఉత్సవాలు చేసేసుకుంటున్నారు..ఇంకొక పక్కేమో కోస్తా, రాయలసీమ వాళ్లు సమైక్యాంధ్ర అంటూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికి తేలేనో ఈ విభజనలు....పునర్విభజనలు. అదేంటో నాకయితే ఈ విభజన గొడవలో ఎవరి వాదన విన్నా సమంజసంగానే అనిపిస్తుంది..ఇంతకీ నేనెటు [...]
నిన్ను ఇంట్లో నుండి సాగనంపేటప్పుడు అనుకోలేదునీ దూరం నన్నింతగా బాధిస్తుందనిఒకటా రెండా 18 సంవత్సరాలుమాతో కలిసి మెలిసి వున్నావుమాలో ఒకరివై పోయావు.నిన్నెంత ప్రాణంగా చూసుకున్నానుఅందుకేనేమో నాకు ఇంత బాధనేను తప్ప ఇంకెవరు నీ మీద చేయి వేయకూడదనుకునేదాన్నిఎవరైనా నీ మీద చేయి వేస్తేనా ప్రాణం పోయినట్లుండేదివాళ్ల చేతులు ఎలా ఉన్నాయోఅవి అంటుకుని నువ్వెక్కడ మాసిపోతావో అని [...]
ఏమి హాయిలే హలా!! అహ.....ఏమి హాయిలే హలా!!సెల్లు ఉంది ఎందుకు బ్యాగులో దాచుకోనా.....ఎత్తవే అన్న అదిలింపులు లేవు..గడప దాటటం భయం......ఎక్కడున్నావు......ఎంతసేపట్లో వస్తావు.......ఇంత లేటు అయ్యిందేం ...అన్న ప్రశ్నల జడివానలు లేవు..నెల రోజులనుండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో!అసలు విషయమేమిటంటే.....నా సెల్లుఫోనుకి చీడ (వైరస్సు) పట్టింది..దాంతో దాన్ని ఓ మూలకి విసిరేసాను..ఏంటో ఇన్నినాళ్లు నేను [...]
వెనక్కితగ్గినబాణమేదూసుకెళ్తుందివెనకడుగైనావిజయానికి తొలిఅడుగే ...... **********************************************************అంతులేనిఅనుభవాలుమరువలేనిఅనుభూతులుగుప్పెడంత గుండెకుబోలెడన్ని చప్పుళ్ళు.......********************************************************ఎటుచూసినాతేనెపూసినకత్తులేప్రశ్నించేవాడెప్పుడూపిచ్చోడే ! ..........*********************************************************కోట్లుకూడబెట్టికునుకులేనిబ్రతుకుబూడిదలోపన్నీరు ...........********************************************************వేలాదిసైన్యం ఓ [...]
"ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారుఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు"ఎంత గొప్ప అద్భుతమయిన భావన! కృష్ణశాస్త్రిగారికి తప్ప ఇలాంటి భావనలు ఎవరికీ రావేమో!!"ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం"..... అంటూ కృష్ణశాస్త్రి గారు ఓ అద్భుతమయిన పాటని మనకి వదిలిపెట్టి వెళ్ళారు.  నిన్న ఆయన పుట్టినరోజు....ఈ రోజు ఆయన పాటకి సార్థకత కలిగే కార్తీక పౌర్ణమి రోజు.మా ఇంట్లో పూజలు వ్రతాలు [...]
గత రెండురోజులుగా ప్రసారమాధ్యమాలలో మైదుకూరు స్కూలులో తెలుగు మాట్లాడినందుకు ఇద్దరు పిల్లలకు ఉపాధ్యాయులు వేసిన శిక్ష  ఓ పెద్ద చర్చాంశనీయమయింది.  మన టి.వి చానళ్లకి మరో పండగ.  ఈ రోజు ఉదయం నుండి ఏ చానలు తిప్పినా  దీనిమీదే చర్చ.  వీళ్లు ఇప్పుడే కళ్లు తెరిచారో లేక వేరే సంచలనాత్మక వార్తలు ఏమీ లేక దీనిమీద పడ్డారో అర్థం కావటం లేదు. అసలు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా ఇలా [...]
పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు,  రాముడు వనవాసం చేసినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో చెప్పటానికి మన దేశంలో బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి.  వాళ్లు నిజంగా అక్కడ తిరిగారో లేదో తెలియదు కాని ఆ ప్రదేశాలు చూసినప్పుడు మాత్రం ఒక రకమయిన ఉద్వేగానికి లోనవుతాం.  అనుకోకుండా అలాంటి ఓ కొండకి ఈ మధ్య వెళ్ళి వచ్చాం....అదే పాండవుల గుట్టలు (పాండవుల గుహలు, పాండవుల కొండలు....ఇలా రకరకాల [...]
ఈ  క్రింది  చిత్రాలు  ఏంటో  ఎక్కడివో  ఎవరయినా  గుర్తు పట్టగలరేమో  ప్రయత్నించండి.
మా మూడవ రామూ గురించి వ్రాసి కూడా బ్లాగులో పెట్టటానికి ఇదిగో అదిగో అనుకుంటూ బద్దకించాను. ఇంతలోనే దానికి బాగోలేదన్న వార్త,  ఆ పైన చనిపోయిందన్న వార్త!  అది చనిపోయే సమయానికి ఇంట్లో మా అమ్మ వాళ్లు కూడా లేరు.  అంతకు రెండు రోజుల ముందు నుండి దానికి కాస్త ఒంట్లో బాగుండటం లేదు, డాక్టరుకి చూపించి మందులు వాడారు, కాస్త తేరుకుందని బెంగుళూరు వెళ్ళారు....అంతలో ఈ వార్త!  వాళ్లు [...]
 సెప్టెంబరు 21,  ప్రపంచ అల్జీమర్స్ రోజు ముసలితనం కన్నా భయంకరమైన జబ్బు ఇంకొకటి  లేదట!ప్రపంచంలో ఏ జబ్బుకయినా మందులు ఉన్నాయి, ఉపశమనం ఉంది.....కాన్సరు, ఎయిడ్సు లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చు కానీ ఈ ముసలితనం అన్నది చికిత్స లేని జబ్బు అని  సెలవిచ్చాడు ఓ మహానుభావుడు.  మరి ఈ చికిత్స లేని జబ్బుకి తోడు ఇంకో [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు