ఆంధ్రప్రదేష్ భాషా సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో కవితాగానం మరియు మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి గారిచే సన్మానం.ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ జి.వి. పూర్ణచంద్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.వసంతసేన ఏమంది?శీతవేళ సెలవు తీసుకొన్నాకవసంతసేన మల్లెలపల్లకిలో అరుదెంచిందికోయిలలు, మామిడిపూతలు, వేపచిగుర్లు, వెన్నెల [...]
శ్రీ దాట్ల దేవదానం రాజు గారి దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష ఆంధ్రప్రభ లో.   ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.  పూర్తిపాఠం ఇదిదోసిలినిండా కవిత్వంమట్టినీ ఆకాశాన్నీనదినీ పర్వతాన్నీకరుణనీ మానవతనీఒక సమూహం కోసంఏకాంతంగా ప్రేమించేవాడే కవి ...... అన్న వాక్యాలు దాట్ల దేవదానం రాజు ఇటీవల వెలువరించిన “దోసిలిలో నది” కవితాసంపుటి  లోనివి.  పై [...]
జీవం కోల్పోయిఎండిన కన్నీటి చారికలామిగిలిపోయిన నదియూనిట్లు యూనిట్లుగా తరలించబడుతోందిఎడారి నగరాల నిర్మాణం కొరకుమెలికలు తిరిగి, లుంగచుట్టుకొనితరుచ్ఛాయల్ని తలచుకొంటూబుల్ డోజర్ కింద ఆదీవాసీ చేసినఅరణ్యరోదనను గుర్తుచేసుకొంటూఅపుడెపుడో మేసిన వెన్నెల్నిచందమామ రజనుగా రోడ్డుపై కార్చుకొంటూక్షతగాత్ర నదిట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోందినగరం వైపుబొల్లోజు బాబా
ఆంధ్రభూమిలో నా "వెలుతురు తెర" పుస్తకంపై వచ్చిన సమీక్ష. మిత్రులు శ్రీ రవికాంత్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.వెలుతురుతెర పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.http://kinige.com/book/Veluturu+Tera
అవును నిజమేచీరకింద తలగడ ఏదో కుక్కుకొనినెలలునిండిన దానిలానటిస్తూ అడుక్కొంటోంది ఆమె.జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.. తప్పే!పాయింటుబ్లాంకులో నీ సంతకాలు పెట్టించుకొందా లేకఉపాధికల్పన పేరుతో నీ భూములు లాక్కొందా?నీలా జరుగుబాటు లేనివాళ్ళుచచ్చిపోవాలా ఏమిటీ?బొల్లోజు బాబా
ప్రతీదీ ఏదోఒకదానిలోకితెరుచుకొంటుంది.కిటికీ ప్రపంచంలోకి ప్రపంచం అసమానతల్లోకిఅసమానతలు రక్తంలోకిరక్తం తిరుగుబాటులోకితిరుగుబాటు భానోదయంలోకిభానోదయం కిటికిలోకిప్రతీదీ ఏదో ఒకదానిలోకితెరుచుకొంటూనే ఉందిఅనంతంగా....బొల్లోజు బాబా
ఖాళీ రేకుడబ్బాలో మట్టి నింపిగులాబి మొక్కను పెంచుతోంది మా అమ్మాయిస్కూలునుంచి వచ్చాకాదానికి నీళ్ళు పోస్తూ, ఆకుల్ని సుతారంగానిమురుతూ మురిసిపోతుంది.మొగ్గలేమైనా వచ్చాయా అని ప్రతిరోజూజాగ్రత్తగా పరిశీలిస్తుంది"ఏ రంగు గులాబీలను పూస్తుందిఇంకా ఎన్నాళ్ళు పడుతుంది" అంటూవాళ్లమ్మను ఆరాలు తీస్తుంటుంది .ఒక రోజుతనకు బిగుతైన గౌనుల్ని బ్యాగ్గులో పెట్టుకొనిస్కూలుకు [...]
మనం చాలా పేదవాళ్లం బిడ్డా చాలా పేదవాళ్ళంఎలుకలు కూడా మనపై జాలి పడేవి.ప్రతీ ఉదయం మీ నాన్న టౌనుకెళ్ళిఎవరైనా శక్తికలవారు పని ఇస్తారేమోనని చూసేవాడు- గుప్పెడు బియ్యం కొరకు పసులకొట్టం శుభ్రం చేసే పనైనా సరే.యాచనల్ని, మూలుగుల్ని వినకుండా, కనీసం ఆగకుండాశక్తివంతులు ముందుకు సాగిపోయేవారు.మురికిదుస్తులవెనుక బక్కచిక్కిన దేహంతోరాత్రెపుడో మీ నాన్న వచ్చేవారు వెలవెలబోతూనేను [...]
1.కాలంలా ఒకసారిమొఖం చూపించి పారిపోదు కాంతిఇక్కడిక్కడే తారాడుతుందిపువ్వుల్లోనో, నవ్వుల్లోనో2.అందమైన సీతాకోకలుగాల్లో తేలిగ్గా అలా ఎగిరే దృశ్యంహాయిగా అనిపించేదిఒకరోజురైల్వే ట్రాక్ పై చెత్త ఏరుకొంటున్నమురికిబట్టల సీతాకోకనుచూసే వరకూ.....3.పెద్ద చేప వలలో చిక్కిందిభారంగా ఒడ్డుకీడ్చుకొచ్చారు.అదృశ్య కన్నీళ్ళకుసంద్రం అనాదిగా ఉప్పుతేరుతూనే ఉంది.4.పూవులపై [...]
The little boyis shooting at every onewith his toy pistolpurchased at a local fair.Mom, Dad, Sis are acting dead a whileThe little boy is laughing aloudchasing them joyfully to fire atMankind is weaning on the thoughts likegun means amusementcruelty is pleasure.Bolloju Baba
ఒక మంచి కవితపోలికలు – విన్నకోట రవిశంకర్తన అనుభవాలను తన ఆలోచనలను వాటి ద్వారా తాను గుర్తించిన విశ్వసత్యాలను కవిత్వంలో ఆవిష్కరించాలనే తపనేకాని కవిత్వం ద్వారా ఏదో ఒక లాభం పొందుదామనే ఆశ ఇతనిలో కనిపించదు. అందుకే ఈ నాటి కవిలోకంలో రవిశంకర్ అరుదైన కవి -- చేరా *****పునరపి మరణం పునరపి జననం అనేది ఒక ఉదాత్తభావన. అలా అనుకోకపోతే గతించిపోయిన ప్రియమైన వారి వియోగాన్ని తట్టుకొని ఈ [...]
తీర్థంలో కొన్న బొమ్మతుపాకీతోఆ పిలగాడు ఒక్కొక్కరిపైకాల్పులు జరుపుతున్నాడు.అమ్మ, నాన్న, అక్కా కాసేపుచచ్చిపోయినట్లు నటిస్తున్నారు.పడీ పడీ నవ్వుతున్నాడా పిలగాడుఉత్సాహంగా తరుముతూ కాలుస్తున్నాడుతుపాకీ అంటే వినోదమనీహింసే సంతోషమనీమానవజాతి ఉగ్గుపాలతో నేర్చుకొంటోందిబొల్లోజు బాబా
1.This apartment's windowis an open woundThe world lures with itsheavy breasts andstout thighslike a belly dancer2.The unsold roseswilt and  dry offThe world is filled withcheap plastic flowersLife is Like That.....3.Therean enraged crowd is burningthe effigy of the king.The innumerable souls of thosekilled by thebloodthirsty state immemorialdie laughing at loudly4.Which is less heavier?The Dream that is relieved ofthe weight of this world!The Truth that gets rid ofits heart infested with fungusBolloju Baba
ఉగ్గుపాలతో పాటు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించిరక్తంలోకి ఇంకి పోతుంది మాతృభాషతరువాత ఎన్ని భాషలు నేర్చుకొన్నాఅన్నీ పై పై ఆభరణాలే తప్పరక్తనిష్ఠం కాలేవు ఎవరికైనా.మనకు ఈ దేహాన్ని ఇచ్చేది అమ్మయితేఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది మాతృభాషసృష్టి సౌందర్యాలు, జీవనోద్వేగాలు మొదటగామాతృభాషలోనే ఆవిష్కృతమౌతాయి.మనం ఎలా ఆలోచించాలోదేనిగురించి ఆలోచించాలో నేర్పుతుంది [...]
అమ్మతనాన్ని గుర్తించటం కొంచెం కష్టం కానీరోడ్డుపై అడుగడుగునా ఎదురయ్యేనాన్నతనాన్ని సులువుగానే పోల్చుకోవచ్చు.పార్కులో రెండుచేతుల్తో పీచుమిఠాయో పల్లీలపొట్లాలో తీసుకెల్తూ కనిపించవచ్చు. సినిమా హాలులో రెండో మూడో కూల్ డ్రింకులో ఐస్ క్రీములో మోసుకెల్తూ ఎదురవ్వొచ్చు.ఇంటికెళ్ళే వేళ స్వీట్ కొట్లోనో, ఫ్రూట్ షాపులోనోఏవో పొట్లాలు కట్టిస్తూ తారసిల్ల వచ్చు.ఏ పేవ్ [...]
పూడిక పెద్ద యంత్రం తొండంతో చెరువు పూడిక తీస్తోంది గతాన్ని పొరలు పొరలుగా తొలగించి పారేస్తోంది. రేపో మాపో చెరువులోకి కొత్తనీరు ఎక్కుతుంది నూత్న సృష్టి అనాది రాగాన్ని ఎత్తుకొంటుంది కొత్తచేపలు కిలకలు వేస్తాయి పాత దుంపలు కొత్త మోసులెత్తుతాయి కెరటాలు నురగలై తిరగబడతాయి గుండె నిండా అస్కలన వీర్యాలు, అవాంఛిత స్వప్నాలు చెరగని మరకలు, విరిగిన వాక్యాలు ఘనీభవించిన [...]
పాపాయిని ఎత్తుకొన్నానునేను నచ్చలేదేమోదూదిలాంటి మెత్తని చేతుల్తోనా మొఖాన్ని తోసేస్తుందిపలుచని గోళ్ళతో నా బుగ్గల్ని గిల్లుతోందికాళ్లతో తన్నుతోందివాళ్ళమ్మకు ఇచ్చేసానుతను ఎత్తుకొన్నాకసొట్టబుగ్గలతో బోసినోటితోనన్ను చూస్తూ నవ్వుతోంది పాపాయి.ఒక్కసారిగా అనిపించిందితిరస్కరించిన తరువాతద్వేషించక్కర లేదనిచక్కగా ప్రేమించుకోవచ్చనీ!బొల్లోజు బాబా
మా అక్కని ఒంటరిగా ఎప్పుడూబయటకు పంపేవాడు కాదు మా నాన్నఇప్పుడు నేనూ అంతేమా అమ్మాయి బయటకు వెళతానంటేతమ్ముణ్ణి తోడుగా తీసుకెళ్లమంటున్నాను.కరువు కాలంలో పావలా తగ్గుతుందనిమూడు కిలోమీటర్లు సైకిలు తొక్కుకొనిపెద్దమార్కెట్లో సంత చేసేవాడు మా నాన్నఇపుడు నేనూ అంతేఏడాదికోసారి ఉల్లిపాయల క్యూలోగంటలతరబడి నిలుచుంటున్నానుసమాజం పట్ల ఆవేశం కలిగినపుడుహిందూ పత్రికకు ఓ ఉత్తరం [...]
You saidI do not have consistencyIsnt it?See howthe sunlight coming throughthe window is broken into piecesas lattice.Who am I after all?Bolloju Baba
స్థిరత్వంలేదన్నావు కదూ!కిటికీలోంచి వచ్చినసూర్యకాంతేఊసలు ఊసలుగాముక్కలయిందిఇక నేనెంత?బొల్లోజు బాబా
అతనిరెండు రెక్కల్లో చేతులు ఉంచిటాయిలెట్ సీట్ నుంచి లేపిపళ్ళుతోమి స్నానం చేయించిఒళ్ళుతుడిచి బట్టలు తొడిగిజాగ్రత్తగా నడిపించిమంచంపై పడుకోబెట్టి“మీ అబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగావెళ్ళొచ్చు కదా?” అందామెమాత్రలు వెతుకుతోనీటిపొర నిండిన కళ్ళతోసీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతనుఫోన్ కూడా చేయటం మానుకొన్నబబ్లూ గాడిని గుర్తుచేసినందుకు.బొల్లోజు బాబా(ఈ కవిత సారంగ [...]
https://www.facebook.com/bolloju.baba/posts/10208211738635952?notif_t=like&notif_id=1484298031312716https://www.facebook.com/bolloju.baba/posts/10208211738635952?notif_t=like&notif_id=1484298031312716
ఒకరికళ్లలోకి మరొకరు  మరింత ఎక్కువసేపుచూసుకొంటూ ఉండటానికిఇంకా మూగవాళ్లను సంతృప్తి పరచటానికిప్రభుత్వం ప్రతి ఒక్కరికీ  రోజుకి  సరిగ్గానూట అరవై ఏడు పదాలను మాత్రమేకేటాయించాలని నిర్ణయం తీసుకొంది.ఫోన్ మ్రోగినప్పుడు ఎత్తి హలో చెప్పకుండాచెవిదగ్గరపెట్టుకొంటానురెస్టారెంటులో చికెన్ సూపు ను వేలుతో చూపిస్తాను.ఈ కొత్త విధానానికి కొద్దికొద్దిగా అలవాటు [...]
సాహిత్యపరంగా ఘనతవహించిన ఇంజరం, పిఠాపురం, రాజమండ్రి, కోనసీమ వంటి ప్రాంతాలనడుమ ఉన్న యానాం సహజంగానే ఆ వాసనలను పుణికిపుచ్చుకొంది. తెలుగు సాహిత్యానికి వన్నెతెచ్చిన సాహితీవేత్తలలో శ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి ప్రముఖమైనవారు. వీరు పదేండ్ల వయసులో విద్యాభ్యాసనిమిత్తమై ఫ్రెంచి యానాం వచ్చారు. 18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు యానాం వెంకటేశ్వర స్వామిపై వ్రాసిన శతకంలో వ్యాకరణ [...]
నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా?వేరే కులానికి చెందినప్పటికి కూడా ప్రేమిస్తున్నావా!కానీమన పెద్దలువారి శవాలను కూడా ఒకే చోటులోకాల్చరన్న విషయం నీకు తెలుసా!Translated into English by Nirupama Duttఅనువాదం: బొల్లోజు బాబా
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు