జలయజ్ఞం ద్వారా హరితాంధ్రప్రదేశ్ గా అవతరించాల్సిన రాష్ట్రం బంగారు తెలంగాణా మరియు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా విడదీయబడింది. సదరు రాష్ట్రాల వద్దనున్న "బంగారానికి" కాపలాదారుగా మరొకరికి అవకాశం ఇవ్వడం ప్రియతమ ప్రధానికి నచ్చక ఆయనే స్వయం గా ఆ పనిలో క్షణం ఖాళి లేకుండా పని చేస్తున్నారు. ప్రజలందరి దగ్గర సంపద ఉంటే కాపలా కి కష్టం కాబట్టి , నోట్ల రద్దు ద్వారా  సదరు సొమ్ములు [...]
గౌరవనీయ  ముఖ్యమంత్రి గారు  ఈ రోజు సూర్యాపేట లో మాట్లాడుతూ చెప్పిన సూత్రం : ఎక్కడైతే ఎక్కువ మోటార్లు వాడుకలో ఉంటాయో అక్కడే విద్యుతుత్పత్తి కేంద్రం ఉండాలి . అక్కడ బొగ్గు , నీరు , రైలు మార్గం తదితర వనరులు ఉన్నా లేకపోయినా . 60 ఏళ్లుగా పాలించిన సన్నాసులకి ఆ తెలివి తేటలు లేక, ఉత్తర తెలంగాణా లో, గోదావరి లోయలో, ఎక్కడైతే బొగ్గు, నీరు పుష్కలం గా ఉందో , ఎక్కడ రైలు మార్గం సులభమో  - NTPC, KTPS, [...]
" ఈ పాలి నువ్వొచ్చే సరికి నేనుంటనో ఉండనో బిడ్డా - చాన సంబరం గుంది నిన్ను,నీ బిడ్డని చూశాలకి " - వెళ్లిన ప్రతిసారి మేము వినే మాటలు . ఆ మాటలు ఇక వినలేము అని అనుకొన్న ప్రతిసారి ఒకరకమైన బాధ. నానమ్మ పడినబాధలతో పోలిస్తే అదోకపెద్దబాధ కాదని సరిపెట్టుకోవాలి. నేను తనతో గడిపిన సమయం, తను బతికిన 100 సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. నాకున్న 38 సంవత్సరాలలో తనకి ఇది కావాలని ఎవరినీ [...]
దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ రాద్దామని ప్రయత్నం !
అయిదేళ్లకో కొత్త ఎపిసోడ్ తో నడిచే కామెడీ సీరియల్ ప్రస్తుత ఎపిసోడ్ చివరి అంకం లో ఉన్నట్టుంది . ఒక్క ఎర్ర చొక్కాలు తప్ప అందరూ ఎగబడి వరాలు ఇచ్చేస్తున్నారు . అవి నిజం గా వరాలా? శాపాలా? పేదవాడికి అన్నీ ఉచితం గా ఇస్తాం అంటున్నారు . ఎలా ఇస్తారు? మధ్యతరగతి వాడి దగ్గర లాక్కొని పేద వాడికి పంచా? తినడానికి కిలో 2 కి బియ్యం ఇచ్చి, ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి , కాళ్లు బార్లా [...]
ఒకాయన , పెజా ప్రతినిధే లెండి , దేవుడి మీద కేసు వేసాడు .. ప్రస్తుత చర్చ ఆ కేసు విచారణ కి ప్రతి వాది గా ఎవరు వస్తారు కోర్టుకి అని .. అది అమెరికా లో వేసాడు కాబట్టి అంత గందరగోళం .. వాళ్లకి ఒక్కడే దేవుడు ..అదే మనకైతే మన ముక్కోటి దేవుళ్లలో ఎవరు వచ్చేవారు కోర్టుకి ? సోనియా మేడం సెలవిస్తారేమో ఫలానా దేవుణ్ణి విచారించండి అని .. లేక అగ్ని ప్రమాదాలకి అగ్ని దేవుణ్ణి , వరదలకి వరుణ దేవుణ్ణి [...]
ప్రస్తుతం బాగా అమ్ముడయ్యే అవకాశం ఉన్న పుస్తకాలు ? 1) ఇందిరా సహస్ర నామావళి 2) రాజీవ సూక్తం
నిన్నటి జెమిని వార్తా విశేషాలు : 1) నిందితుని ఊహా చిత్రం విడుదల 2) నిమ్మకూరు లో రిసెప్షన్3) నాగార్జున పుట్టినరోజు వేడుకలు ఇంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ వార్తలేమీ లేవా?
జయ ప్రకాష్ నారాయణ( లోక్ సత్తా), శ్రీరాం ...వీరు స్పందించిన తీరు సమాజం లో మార్పు మీద నమ్మకం కలిగిస్తుంది ...
ఎప్పటి నుండో ఒక ఆలోచన .. పద్మ లో ఉన్న javascript ని blogger template లో వాడి , post body తెలుగు కి మార్పు సాధ్యమా? కాదా? నాకైతే సాధ్యమే అనిపిస్తుంది .. template customization చేసుకోడం అందరికి తెలిసిన విషయమే కదా ..మరో విషయం ..దీనికి పైన ప్రస్తావించిన దానికీ సంబంధం లేదు .. ఇంటర్వూలు చేసేప్పుడు ఒకోసారి నవ్వు, ఒకోసారి కోపం వస్తూ ఉంటాయి .. అయ్యలూ అమ్మలూ మీరు resume లో రాసిన దాని గురించి సరిగా
ప్రతీ వాడూ బషీర్ బాగ్ , నందిగ్రాం గురించి అడిగేవాడే .. అంతేతప్ప ప్రస్తుతం ప్రాణం పోయిన వారి గురించి ఆలోచించేదెవడు ? ఉద్యమం లో ప్రాణం ఎప్పుడూ పేద వాడిదే ఎందుకు పోతుంది? ముందుండి నడిపించేవాడు నాయకుడు అయి ఉంటే ముందు నాయకుడు కదా పోవాల్సింది ? మరో సారి ౠజువు చేసారు .. ఉద్యమం తప్ప లక్ష్యం ముఖ్యం కాదు అని .. ఇంతకీ సాధించింది ఏంటి? బషీర్ బాగ్ కాల్పులకి కరెంటు చార్జీలు తగ్గాయా? [...]
నిన్న రాయలనుకొన్న మిగతా భాగం ....2020 ఒకానొక రోజు ..ఏ రోజనేది అనవసరం ..పనేమీ లేక ఖాళీగా ఉన్న అ.అ.ఆ( అమెరికా అధ్యక్ష పీఠం మీదున్న ఆంధ్రుడు) భా.ప్ర.బి( భారత ప్రధాని బిల్) తో పిచ్చాపాటిగా వీడియో కాన్ఫరెన్సు లో ...అ.అ.ఆ : హలో బిల్ .. ఎలా ఉంది భారతం ?భా.ప్ర.బి : ఏదో ఉంది .. చేతులు కట్టి పడేసినట్టుంది .. చేయడానికి యుద్దాలే లేవు .. ఈ భారతీయులు ఇంత శాంతి కామకులేంటో .. అప్పట్లో ఇరాకు, ఇరాను ,క్యూబా
2020 .. అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు ..2007 తానా సభల్లో చెప్పుకొన్నట్టు ..ఆ తెలుగువాడు మరొవరో కాదు .. C.B నాయ్డు .. అవును రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే CBN .. vision 2020 కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసిన CBN ...చేయడానికి పనేమీ లేక చిరాగ్గా ఉంది ...కరెంటు కష్టాలు లేవు..పోనీ జన్మ భూమి లాంటి ప్రజాదరణ పొందే పధకం మొదలెడదామా అంటే చెరువుల్లో పూడికే లేదు ...నీళ్లు పుష్కలంగా
శ్రీమతి & శ్రీ దగ్గుపాటి రామారావు గారి కుటుంబమా? కాదా?తెరాస , కాంగ్రెస్సు రాసుకొంటే తెలంగాణా రాలిందా?కాంగ్రెస్సు , ఎర్రజండాలు రాసుకొంటే పోలవరం ఆగిందా?
మంత్రిపదవి ఎందుకు?ఇంట్లో పెళ్ళాం , పిల్లల మోజు తీర్చడానికి ..ఉప్పనూతల గారి ఉవాచ
పునరంకితం ఎవరు దేనికి అవుతున్నారో అర్ధం కాకుండా ఉంది ... రెండేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు సౄష్టిస్తామని అన్నారని గుర్తు ... రెండున్నర లక్షల ఉద్యోగాలేమో గాని రెండువందల యాభై వరకు పదవులు మాత్రం తయారు చేసి పంచి పెట్టారు ...మండలితో కలుపుకొని ... మరి ముఖ్యమంత్రి, కొందరు ప్రముఖులే పునరంకితం అయితే పెజా సేవ లో వెనకబడి పోతారు కదా .. పునరంకితం అయ్యే అవకాశం అందరికీ కల్పించడం [...]
భార్యా భర్తల మధ్య మాటలు లేనప్పుడు - ఇంట్లో గిన్నెలు , తపాలాలు మాట్లాడతాయి :)
ఏంటబ్బా ఇంకా మనవాళ్లు వెనకబడి ఉన్నారు అనుకొంటున్నా -- తెచ్చేసారు కొత్త చట్టం - పిల్లలని కొడితే జైలు --- భేష్ " అసలు సంస్కారం ఉండాలి .చదువుకొనే ఆసక్తి ఉండాలి .చదువుని ఎంజాయ్ చేయాలి .రాత , అట్టానే చదువు అట్టానే ఉండాలి .రాయడం ఒక అనుభవం , మనం ఏదైనా సరే మనుసుని వికసింపచేసేది , అసలు మనసుని ఆహ్లాద పెట్టేది ఏది చెప్పినా అది గొప్ప లిటరేచర్ అయిపోవాలి ఆ చదివేవాళ్లకి గూడా అబ్బా! ఈ [...]
దేవుని పరిపాలన అంటే ఏంటో అనుకొనేవాడిని - ఇప్పుడు కొంచెం అర్ధం అయింది - తప్పులు చేయనివ్వు - విచారణ కి ఆదేశించు - తప్పు ౠజువైతే క్షమాభిక్ష పెట్టు - ఈ లెక్కన ఎవడూ తప్పు చేయనట్టే కదా - తప్పులే జరగని లోకం దేవలోకమే(?) కదా - అదన్నమాట సంగతి .
ఇవాళ ఓ రెండు గంటలు కూచొని " పద్మ లేఖిని" ని తయారు చేసా... నాగార్జున వెన్న గారిని అడిగి ఎప్పుడో సంపాయించిన జావా స్క్రిప్టు ఉపయోగించా .... ఈ టూలుతో తెలుగులో రాసి బటను నొక్కి బ్లాగరులో పోస్టు చేయొచ్చు ... ఇంకా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది .. కాని సమయమే లేదు ... ఎవరికైనా ఓపిక ఉంటే సంప్రదించండి ... ఇదేమీ కష్టమయిన పని కూడా కాదు ...
నా చిన్నప్పుడు మా హిందీ మాస్టారు ఏదడిగినా ఒకటే సమాధానం చెప్తే ,జిందాతిలిస్మాత్ ప్రకటన చదివి నవ్వించేవారు ...ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ , భలేగా నవ్వొచ్చేది ఆయన హిందీలో ఆపకుండా ; "తలనొప్పి ,పంటినొప్పి, దవడనొప్పి , కంటినొప్పి, కడుపునొప్పి , నడుంనొప్పి, ఇంకా ఏ నొప్పికైనా, వాడండి - జిందా తిలిస్మాత్ " - అని అరిస్తే ... ఆ వెనువెంటనే పడే బెత్తం దెబ్బలకి ఏడుపు కూడా వచ్చేదనుకోండి [...]
తెల్లారుజామున యోగా ,ధ్యానం చేస్తే బెమ్మాండమయిన ఆలోచనలొస్తాయని ప్రియతమ ముఖ్యమంత్రి సెలవిచ్చారు . దానర్ధం మిగతా వారందర్నీ ఆ పని చేయమనేమో ..ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్టాంటి అమూల్యమయిన అభిప్రాయం వెలిబుచ్చారని గుర్తు ..ఆయనో అడుగు ముందుకేసి తమ్ముళ్లందరికి యోగా తరగతులు కూడా నిర్వహించిన గుర్తు ..ఏమో ఈ నాయకులు మాటలు చేతలు నిముషానికి ఒకటి ఉంటే ఎవడేమన్నాడో [...]
ఆ మధ్య దేశంలో కోట్లకి పడగలెత్తిన వారి జాబితా ఒకటి ప్రచురించారు ..గత పదేళ్లుగా ఆ జాబితాలో చేరేవారి సంఖ్య పెరుగుతూ వస్తుందని చదివి సంతోష పడ్డా .. వెనకబడ్డ దేశమో అని అరిగిపోయిన గ్రామఫోను ని పాడేసి కొత్త i-pod ( తెలుగు తర్జుమా చేయలేదు ఇంకా ఎవరూ) లో i-tune విన్నట్టనిపించిది ... కానీ ఇప్పుడనిపిస్తుంది ... త్యాగమూర్తుల జాబితా తయారు చేస్తే ఇంకా బావుండేదేమో అని ...మొదట మేడం సోనియా ..రెండు [...]
ఉచిత విద్యుత్తు మీద రాద్దంతం జల యగ్నం లో అవకతవకలుసీమ లో రాజకీయ హత్యలుహత్యకు పర్యవసానంగా ఉప ఎన్నికదేవుని మాణ్యాల ఆక్రమణలుమునిసిపాలిటీ ఎన్నికలువోక్సువ్యాగన్ భాగోతంనక్సలైట్లతో చర్చలుక్షమభిక్షల పై క్షమాపణలుఅవుటరు రింగురోడ్డు పై అరుపులుతెలంగాణా ఉప ఎన్నిక భూముల అప్పగింత ...పనికొచ్చె పని ఒక్కటన్నా ఉందా పై వాటిల్లో?
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు