కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
ఏదో వ్రాయాలని ఉంది.. ఇంతకాలం గెలిచానో తెలియదు ఓడానో కూడా నాకు తెలియదు.. గెలిచాను అనుకొని ఓడిపోతూ వచ్చానా !! ఓడిపోతూ గెలిచానా !! కాలం మాత్రం గడిచిపోయింది.. ఎన్నో భావాలు [...]
నిన్న యాదృశ్చికంగా ఏదో సినిమా టైటిల్ నా చెవిన పడింది. సీతా రాముల కళ్యాణం, లంకలో .. అన్న పట్టాన పెట్టాను ఈ పుటకి శీర్షిక. ఓ సంవత్సరం క్రిందట ఇలాంటిదానిని భవదీయుఁడు అనే బ్లాగులో పెట్టినట్లు గుర్తు. అప్పుడేమో మహిళలు అంతా కలసి, మహిళా బ్లాగర్ల సమావేశం అని పేరు పెడితే, ఈ సారి ఆ సమావేశాన్ని ప్లస్సర్ల సమావేసంగా పేరు మార్చారు. రాజకీయ నాయకులకి అలాగే మహిళలకు పేర్లతో పనేంమిటి? ఆ!!! [...]
ముందు ఈ లంకె చూడండి .. ఐదు భాగాలుగా విడగొట్టి చిత్రంలాగా ఉంచితే.. ఇంతౌతుంది------------------------------------------- వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
ఇవ్వాళ ఉదయం ఇంట్లో టిఫిన్ ఆలశ్యం అయ్యేటప్పటికి, బయటికి వెళ్ళి తిందాం అని బయలుదేరాను. ప్రస్తుతం నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను కదా, అదో పెద్ద చెత్త కుండి అని ఆలశ్యంగా తెలిసింది. ఉదయం వేళల్లో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళితే ఓ చోట చాలా మందు గుమ్మి కూడి ఉన్నారు. ఏంటిదిరా, అనుకుంటూ కొంచం నిశితంగా పరిశీలిస్తే అప్పుడు అర్దం అయ్యింది అక్కడ గుమ్మి కూడి ఉన్న [...]
నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని [...]
ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది. ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ [...]
eతెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తున్న పుస్తక ప్రదర్శన యందలి స్టాల్ యొక్క మూడొవ రోజు విశేషాలు వ్రాద్దామని రెండు రోజులనుంచి అనుకుంటున్నా, కుదరటం లేక ఇవ్వాళ ఎలాగైనా వ్రాసి ముగిద్దామని కూర్చున్నాను. వీలైన వివరంగా వ్రాస్తాను. మూడోరోజు ప్రధమంగా నేను వెళ్ళటం జరిగింది. మూడోరోజు శనివారం అయినందున ఉదయం పదకొండు గంటలకే తెరుస్తారని చాలా [...]
26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి. సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన [...]
నా జీవితంలో మొదటి సారిగా నేను చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న కొన్ని పనులలో ఇది ఒకటి. గృహ ప్రవేశ ఆహ్వాన పత్రం. నా పెళ్ళికి కూడా ఆహ్వాన పత్రాలు ముద్రించినా, దానియందు నా ప్రవేశం చాలా తక్కువ. ఎందుకంటే, అక్కడ పెద్దవాళ్ళ ప్రమేయమే ఎక్కువ. ఇదిగో ఇప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఓ చిన్న అపార్ట్ మెంట్ కొనుక్కునాను. ఆ ఇంటి లోనికి గృహ ప్రవేశం చేసే ప్రక్రియలో మున్ముందుగా ఆహ్వాన [...]
స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు. ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి, బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం చేయించుకుంటున్న [...]
ఈ మధ్య కొన్ని వ్యక్తి పరమైన అలాగే వ్యాపర పరమైన ఘటనలు నలుగురిలో ఉంచి నన్ను అమర్యాద చేసి నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని ప్రయత్నం జరిగింది. ఆ పంచాయితీకి నేను దూరంగా ఉన్నందు వల్ల పంచాయితీ పెట్టిన పెద్దల ఇగో దెబ్బతింది. వారి అహం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఎంతటి నీచానికి పాల్పడుతున్నారంటే, తలచుకోవడానికే అసహ్యం వేస్తోంది. అలాంటిది వ్రాయడాని అక్షరాలు రావటం [...]
నేను తెలుగులో బ్లాగింగి మొదలు పెట్టిన తరువాత ఈ నాటికి ఓ ముఖ్య ఘట్టాన్ని దాటానని నాకు ఈ అవలోకనం తెలియజేసింది. అంతే కాకుండా నాకు లేని ఏదో భాధ్యతిని గుర్తు చేసినట్లు ఉంది. వాటి గురించి వ్రాసుకునే ముందు ఓ అవలోకనం. నేను ప్రప్రధమంగా తెలుగులో వ్రాసుకోవడం మొదలు పెట్టింది “ఉబుసు పోక” అనే బ్లాగుతో. దానికి అనుసంధానంగా “భవదీయుడు” అనే మఱో బ్లాగు. ఆ నాటి వరకూ నాకు ఆంగ్లంలో [...]
నిన్నగాక మొన్న ఏదో చిత్రం జరుగుతోంది కదా అంటూ ఓ పుట వ్రాసుకుంటే, ఇంతలో ఆ కధలోని నాయకుడు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ధైర్యంగా ఈయన ఎవ్వరి మాట వినడు, వీడు సీతయకి తాతయ్య అని నేను చెప్పుకుంటుంటే, మధ్యలో ఈ పితలాటకం ఏంటంట? దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీనిపై సిబిఐ ఇంక్వైరీ వెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అలాగే కర్ణాటక రాష్ట్రాన్ని [...]
ప్రస్తుత రాజకీయాలను ప్రతిపాదికగా తీసుకుని ఓ స్నేహితురాలు నాకు ఈ క్రిందటి వాక్యాన్ని హాస్యాస్పదంగా చెప్పారు. అది చదివిన తరువాత నాకు అనిపించిన భావనే ఈ పుట శీర్షిక. ఇచ్చిన వాక్యంలో మన దేశ ప్రధాని మన్ మోహన్ గారు, కర్ణాటక ముఖ్య మంత్రి అయిన యెడ్యీరప్పగారు, మాయావతి వంటి వారికి తోడుగా కోట్ల రూపాయల కుంభకోణంలో జైల్ పాలైన కల్మాడీ కూడా చేరితే ఈ వాక్యానికి పూర్ణత్వం [...]
ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదు. ఎందుకని అంటే, ఏవేవో కారణాలు కనబడుతున్నాయి. కానీ ఈ విషయం వ్రాయడానికి ఎందుకో వెనకాడకుండా అనుకున్నదే తడవుగా వ్రాసేస్తున్నాను. దాని కారణం సంగీతం. నా పెళ్ళికి ముందు నేను నా భార్యని అడిగిన మొట్ట మొదటి పని ఏమిటో తెలిస్తే మీరు నవ్వు కుంటారు. అప్పట్లో నేను బెంగళూర్ నగరంలో పని చేసే వాడిని. సెలవలకి విజయవాడ వస్తున్నానని అందునా నాకు విజయవాడలో చాలా [...]
ఈ మధ్య అనుకోకుండా ఓ చెత్త ప్రకటన చూచిన తరువాత అనుకోకుండా ఈ ప్రకటన నా కంట పడింది. చెడ్డదానిని చెత్తగా ఉంది అని చెప్పినప్పుడు బాగున్నదానిని బాగుంది అని చెప్పడానికి నేనెందుకు వెనకాడాలని ఆలోచించిన తరువాత ఇదిగో మఱో ప్రకటన గురించి నా అభిప్రాయం. ఈ ప్రకటనలో చక్కగా ఇద్దరు పిల్లలనే వాడుకోవడంలో అశ్లీలానికి చోటు లేకుండా పోయింది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ ప్రకటన వెనకాల [...]
అంకెల గురించి తెలియని వారు ఉండరు. తొమ్మిది తరువాత వచ్చే సంఖ్యని పది అని ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. కాకపోతే, ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ తరువాత వచ్చే సంఖ్య గురించే.. 11 మఱియు 12 వదిలేసి తరువాత వచ్చే అంకెలను తలచుకుంటే, అవి చక్కగా పది + మూడు = పదమూడు పది + నాలుగు = పద్నాలుగు వగైరా వగరా అంటూ సాగి పోకుండా సదరు పదుల వరస అంతా చెత్త చెత్తగా పొంతన లేకుండా సాగుతుంది. అదే ఇరవైల వరసలో [...]
అప్పుడెప్పుడో వెంకటేష్ గారి సినిమాలో హీరోయిన్ చేసింది అని విన్నాను ఇదిగో ఇవ్వాళ్ళ అనుభవిస్తున్నాను. పైన శీర్షికకి ఇక్కడ వ్రాసిన మొదటి వాక్యానికి పొంతన లేదనుకుంటున్నారా? పైన చిత్రంలో కనబడుతున్నవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం? చదివే వారికి ఓ క్లూ కూడా ఇచ్చేసాను. వెంకటేష్ చేసిన సినిమాలలో స్నేహం అనే ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమాలోని హీరోయిన్ చద్దన్నం పారేయ్యకుండా [...]
సినిమాని సినిమాగా చూడాలి అన్న విషయాన్ని ఓ సినిమా అభిమాని నాతో అన్నారు. అలాంటి స్టేట్‍మెంట్ ఈ సినిమా విషయంలో బాగా సూట్ అవుతుంది. సినిమా పరంగా చూస్తే, చాలా విలువలున్న సినిమా. కాకపోతే సామాన్య ప్రేక్షకుడికి కావలసినవి సినిమా విలువలు కాదు, వ్యాపారపరంగా ఉండాల్సిన సినిమా మషాలాలు ఇందులో కనబడలేదు. కాకపోతే తీసిన దర్శకుడికి తీయించిన ప్రొడ్యూసర్లకు ఓ మంచి విజ్యువల్ ట్రీట్ [...]
ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, నేను సినిమాలు అంత తొందరగా చూడను అలాగే చూడాలని అనుకోను. ఒకవేళ అనుకున్నానా, అంతే, కొంప కొలాస్ సినిమా డింకీ డిలాస్. అలాంటి కోవకే చెందుతుందీ సినిమా కూడా. అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా నేను చూడాలి అని అనుకోలేదు. ఇంతకు ముందు ఇచ్చిన బిల్డప్ అంతా తూచ్, ఉత్తిత్తినే. ఈ సినిమా హీరో గారిపై నాకు పెద్ద సదాభిప్రాయం లేదు. [...]
ఈ చిత్రానికి రివ్యూ వ్రాసేటప్పుడు శీర్షిక ఏమని పెడదాం అని ఎంతో ఆలోచించిన తరువాత, నిజ్జంగా ఇది ఓ విలక్షణ చిత్రం అనిపించింది. అందుకనే ఇలా మొదలైంది. లెక్కలు పెట్టడం కూడా ఓ లక్షణమే కదా. ఈ సినిమా మొత్తం బ్లాక్ జాక్ అనే ఓ పేకాట చుట్టూ తిరుగుతుంది. కధా పరంగా ఇందులో పెద్ద విషయం ఏమీ లేక పోయినా, చిత్రించిన విధానం బాగుంది. ఇందులో హింస అనే పదానికి అవసరానికి మించి వాడలేనందున నాకు [...]
మొన్నామధ్య విడుదలైన “బద్రీనాద్” పాటల విడుదల కార్యక్రమాన్ని నిన్న చూసాను. అందులో జనాలంతా అర్జున్ని అలాగే వివివిని ఎత్తేస్తుంటే, చాలా చికాకేసింది. అంతే కాకుండా, అంగ్లంలోని ఓ పాత సామెత గుర్తుకు వచ్చింది. అదేనండి నాకు దురద వచ్చినప్పుడు నా వీపు నువ్వు గోకు నీవీపు నేను గోకుతాను అంటూ సాగుతుందే, అదే సామెత. అక్కడ కనబడ్డ ప్రతీ వ్యక్తీ ఈ సినిమా బాగుండటమే కాకుండా, తెగ [...]
ఇవ్వాళ Z సినిమా వారి ఛానెల్లో అష్టాచమ్మా సినిమా వస్తుంటే, అప్పుడెప్పుడో ఈ సినిమా బాగుంది అన్న మాటపై ఈ సినిమాని చూడటానికి సిద్దమైయ్యాను. ఇంతకు ముందు ఇలాగే ఓ సారి మంగతాయారు అనే సీరియల్ మధ్యలో వచ్చే ప్రకటనల గురించి వ్రాసుకున్నాను. ఇప్పుడు సినిమా మధ్యలో వచ్చే ప్రకటనల గురించి. ఇక సినిమా బ్రేకుల మధ్య వచ్చే ప్రకటనలగురించి వ్రాసే ముందుగా ఓ పచ్చి నిజం. ప్రకటనలు దాదాపు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు