ఈ మద్య డానియల్ సిల్వా క్రొత్త అమ్మాయి (The New Girl) చదివాను. డానియల్ సిల్వా నవలల్లో బెస్ట్ కాదు కానీ బాగానే ఉంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు రష్యా ఇతివృత్తం మీద ఆధారపడ్డ కథ. ఎప్పటిలాగానే కథనం బాగుంది కానీ చాలా ఆన్రియలిస్టిక్ గా అనిపించింది. అమెరికా పాత్ర తగ్గడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆ దేశ ప్రాముఖ్యత తగ్గడాన్ని సూచిస్తుందేమో.ఆసియన్ సెంచరీ అని ఉదహరించినప్పుడు [...]
మీ అందరికి ఈ వికారి సంవత్సరం శుభప్రదం కావాలని, ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ ...~సూర్యుడు :-)
ఈమద్య అటుఇటు తిరుగుతున్నప్పుడు గమనించిందేమంటే మన నదుల్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి. పూర్వం రైల్లో వెళ్తుంటే గోదావరిలో బోళ్ళు నీళ్లుండేవి, అలాగే ఇంచుమించుగా కృష్ణాలో కూడా. ఇప్పుడు ఈ నదుల్లో, అంటే రైలు వంతెనల క్రింద నీళ్లు పారడంలేదు, మహా అయితే కొన్ని నీటి గుంటలు / మడుగులు. ఒక కారణం వర్షాలు తగ్గడం కావచ్చు లేదా ఆనకట్టల వల్ల నీళ్లు అంతకుముందే ఎక్కడో నిలువచేయబడివుండొచ్చు. [...]
Wish you all a very happy, healthy and prosperous new year 2019రాబోయే సంవత్సరమంతా మీఅందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలను కలుగచేయాలని కోరుకుంటూ ... ~సూర్యుడు :-)
చాలారోజుల క్రిందట, అంటే చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పాత యువ పత్రికల్లో చదివిన నవలలు అంటే సంక్షిప్త నవలలు, మాయావి / మాయావిని. తర్వాత అవి ఎలాగో కనిపించకుండా పోయాయి. తర్వాత అంతర్జాలంలో ఎంత వెతికినా అవి కనిపించలేదు. ఈమధ్య ఎవరో మళ్ళీ ఆ నవలల గురించ్చి ప్రస్తావిస్తే మళ్ళీ వెతికితే ఎవరో పాత యువ పత్రికల్ని అంతర్జాలంలో పెడితే వాటిలో 1964 డిసెంబర్ పత్రికలో మాయావి కనిపిస్తే [...]
ద ప్రెసిడెంట్ ఈస్ మిస్సింగ్ నవల చదువుదామని మొదలుపెడితే ఇంతకీ ముందుకి కదలడంలేదు. సరే అని ద డైరెక్టర్ నవల మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇంక ఆపాలనిపించలేదు. చాలా ఉత్కంఠంగా ఉండి బాగుంది. మొత్తంమీద చూస్తే చాలా రంధ్రాలున్నాయి కాని ఇలాంటి నవలల్లో అవన్నీ ఓకే :)సైబర్ హ్యాకింగ్ ప్రధానాంశంగా చేసుకుని వ్రానిన నవల. ముఖ్యంగా స్నోడెన్ వ్వవహారం, వికీలీక్స్  తర్వాత [...]
మొత్తానికి ద ఇంక్రిమెంట్ నవల పూర్తిచేసాను. చాలా బాగుంది.  ఇప్పటిదాకా చదివిన David Ignatius నవలల్లో ఇదే బెస్టేమో. నవల చాలా ఉత్కంఠంగా ఉండి ఎక్కడా విసుగనిపించదు. Daniel Silva నవలల్లో వస్తుంటుంది, ఇరాన్ సీక్రెట్ సర్వీస్  Taqiyya (I think it is used in the sense of deception) సూత్రం ఆధారంగా పనిచేస్తుందని కానీ ఈ నవలలో, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డెసెప్షన్ వాడి ఇరాన్ న్యూక్లియర్ పోగ్రామ్ ని ఎలా సబొటాజ్ చేసిందో [...]
మీకు మీ కుటుంబ సభ్యులకు -మహర్నవమి మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు!!హ్యాపీ దసరా~సూర్యుడు :-)
 అలన్ ఫర్స్ట్ నవలా కాదు జాన్ లె కారి నవలా కాదు కాని ఫెడ్రిక్ ఫోర్సిత్ నవల ద ఫాక్స్ చదివాను. ఇది సైబర్ వార్ఫేర్ మీద ఆధారపడ్డ నవల. బాగానే ఉంది. Asperger's syndrome తో బాధపడుతున్న Luke అనే పద్దెనిమిది సంవత్సరాల UK కుర్రాడు NSA డేటాబేస్ ని హ్యాక్ చెయ్యడంతో మొదలవుతుంది. మామూలుగానే అమెరికా కుర్రాడిని అమెరికాకి అప్పచెప్పమంటుంది కానీ ఒక UK రిటైర్డ్ స్పై అధికారి (Adrian Weston), ప్రస్తుత బ్రిటిష్ [...]
డానియల్ సిల్వా ద అదర్ వుమన్ చదవడం పూర్తయింది. ఇది ఇంతకుముందొచ్చిన డానియల్ సిల్వా రెండు నవలలుకన్నా బాగుంది. రష్యన్ ఆపరేషన్ నవలల్లో ఇది మూడోదేమో. ఇంటరెస్టింగ్ ప్లాట్. చాలావరకు తెలిసి పాత్రలే :)ఇంతకుముందే ఎక్కడో అన్నట్టు డానియల్ సిల్వా నవలల్లో నాకు నచ్చే అంశం వ్రాసే విధానం. అయన మొదట్లో విలేఖరి కాబట్టి, విలేఖర్లకు వ్రాసేవిధానమే ముఖ్యం కాబట్టి అయన బాగా వ్రాయడంలో [...]
అదే ద ఫారెన్ కరెస్పాండెంట్ అని ఒక నవల చదివాను. నా మొదటి Alan Furst నవల, పూర్తిగా చదివినది. ఇంతకుముందు ద స్పైస్ ఆఫ్ వార్సా మొదలుపెట్టాను కాని పూర్తిచెయ్యలేదు. ద ఫారెన్ కరెస్పాండెంట్ నవల బాగుంది. ముస్సోలిని ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కొంతమంది ఇటలీ పౌరులు ఫ్రాన్స్ ఇటలీలనుండి నడిపించిన వ్యతిరేక ఉద్యమ కథ. ఇది 1938 నుండి 1939 మద్యలో జరిగిన సంఘటనలు, కల్పనా అయ్యుండొచ్చు లేదా నిజమైన [...]
ఆమద్యంతా గూఢచారి నవలలు చదివి చదివి విసుగొచ్చి అపరాధ పరిశోధన నవల చదవాలని నిర్ణయించి "ద ఫాలెన్ " నవల కొన్నాను. నవల బాగుంది. సమకాలీన అమెరికా సమాజానికి అద్దం పట్టిందోలేదో నాకు తెలీదు కాని దగ్గరగా ఉండొచ్చేమో.అమెరికాలో ప్రజలు ఎలా ఓపియాయిడ్ బారిన పడుతున్నారో అన్న ఇతివృత్తమ్మీద ఆధారపడిన నవల. పనిలోపనిగా ఆటోమేషన్ వల్ల ప్రజలెలా జీవనోపాధి కోల్పోతున్నారా కూడా చర్చించాడు [...]
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విళంబి నామ్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.మీ అందరికి ఆయురారోగ్యఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ~(ఉగాది) సూర్యుడు :-)
బాడీ అఫ్ లైస్ పూర్తైన తర్వాత "ద ఇంక్రిమెంట్" ఓదలుపెట్టాను కానీ అది ముందుకు వెల్లడం లేదు. ఈ మధ్య క్రొత్త పుస్తకాలకోసం వెతుకుతుంటే Alex Berenson అనే క్రొత్త రచయిత కనపడ్డాడు. Alex Berenson వ్రాసిన "ద ఫెయిత్ ఫుల్ స్పై" చదివాను. బాగానే వుంది. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లతో పోలిస్తే వ్రాసే విధానం కొంచం భిన్నంగా వుండి బాగుంది. ఈ ముగ్గురిలో డానియల్ సిల్వా నాకు బాగా నచ్చాడు , ఆతర్వాత [...]
గూగుల్ వూరికే అనువదిస్తా అనువదిస్తా అని విసికింకేచేస్తోందని సరే నా పాత టపాని ఇంగ్లీష్ లోకి అనువదించామన్నా. ఇక్కడ చూడండి నా టపా తర్వాత దాని కింద గూగుల్ అనువాదం :-)సామాజిక ప్రసార మాధ్యం - వ్యక్తిగత అభిరుచులుసామాజిక ప్రసార మాధ్యం అంటే అదే నా ఉద్దేశ్యంలో సోషల్ మీడియా. ఇంతకు ముందు అంటే వాట్సాప్ లేని రోజుల్లో, ఇష్టం ఉంటే బ్లాగులు, పేస్బుక్కులు, ట్విట్టర్లు చూసుకునేవారు, [...]
సంఘ ప్రసార మాధ్యం అంటే అదే నా ఉద్దేశ్యంలో సోషల్ మీడియా. ఇంతకు ముందు అంటే వాట్సాప్ లేని రోజుల్లో, ఇష్టం ఉంటే బ్లాగులు, పేస్బుక్కులు, ట్విట్టర్లు చూసుకునేవారు, లేదంటే గమ్మునుండేవారు. కానీ ఇప్పుడలా కాదే, స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ లేకుండా ఉండదు (ఇప్పుడర్ధమవుతోంది ఎఫ్ బి వాడు అంత పెట్టి ఎందుకు కొన్నాడో :)), అదుంటే గ్రూపులు ఉండకుండా ఉండవు, అందులో ఉంటే మెసేజస్ రాకుండా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు