ఇది ఒక సారి చదవడానికీ, కరెంట్ అఫైర్స్ రిఫ్రెషర్ లాంటి  పుస్తకమే. ఇది సాహిత్యం కాదు. కొందరి జీవితం.  ఎప్పటికప్పుడు మారిపోయే వార్తల్లో ఒక భయంకరమైన కధనం. కాకపోతే ఈ కధ లో బోల్డన్ని మనకి తెలిసినవీ, తెలియనివీ థియరీలు ఉన్నాయి.  ఈ కార్పొరేట్ తరహా, ఎక్సిక్యూటివ్ ఉగ్ర సంస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి చాలానే పుస్తకాలొచ్చాయి. అన్నిట్నీ చదవలేకపోయినా, నేను తడిమిన రెండు మూడు [...]
ఈ రోజు ఇంకో మంటో కధ.సిరాజ్నాగపడా పోలీస్ స్టేషన్ దగ్గర ఇరానీ రెస్టారెంట్ దగ్గర దీపపు స్థంబానికి తలనానించుకుని నించునుంటాడు ఢూండూ.   అతనికి ఈ ముద్దు పేరు ఎవరు పెట్టారో గానీ, సరిగ్గా అతికినట్టు ఉంటుంది ఈ పేరు. 'ఢూండూ' అంటే 'వెతికి పెట్టేవాడు'  అని అర్ధం. సరిగ్గా అదే పని చేస్తాడు మనవాడు. విటులు కోరే ఎటువంటి అమ్మాయినైనా చిటికెలో సమకూర్చడం అతని వృత్తి.   అతనొక పింప్.ఏ [...]
ద బుక్ థీఫ్. ఇది బాల సాహిత్యం.   ఈ కధ పుస్తకాలెత్తుకుపోయే పదీ పన్నెండేళ్ళ ఏళ్ళ అమ్మాయి  "లీసెల్ మెమింగర్" ది.   గత ఏడు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతూన్న అంతర్యుద్ధం కారణం గా దాదాపు ప్రతి రోజూ జరుగుతున్న బాంబు దాడులూ, వాటిల్లో వందల్లో చచ్చిపోతున్న చిన్న పిల్లలూ, -  ఒక కొత్త తరాన్ని అంతరింపజేసేస్తున్న యుద్ధం -  ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.  యుద్ధాల్లో అసలైన [...]
సాదత్ హసన్ మంటో కధలు  రెండు :1. Mozelleత్రిలోచన్ నాలుగు సంవత్సరాలుగా బొంబాయిలో ఉంటున్నాడు. అద్వానీ టవర్స్ లో.. అతను సాంప్రదాయాన్ని పాటించే సిఖ్.   పల్లెలో ప్రైమరీ విద్య పూర్తయ్యాకా, హైస్కూల్ కి పట్నం వచ్చేసాడు.  కాలేజీ చదువు కూదా పట్నం లోనే. బొంబాయి చేరే ముందు ఉపాధి కోసం ఎక్కడెక్కడో తిరిగాడు.  బొంబాయి వచ్చాకా యూదులు ఎక్కువగా నివసిస్తూండే ప్రాంతాల్లో అద్వానీ టవర్స్ లో [...]
అది 1961 సెప్టెంబరు.  పూనా లో మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీ లో  మా కోర్స్ ముగిసిన తరవాత మా మొదటి పోస్టింగ్ సిక్కిం. ఆ రోజుల్లో అది ఇంకో రాజ్యం లా ఉండేది.  అప్పుడే అక్కడ చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్ ఆఫీసర్ల స్థానాన్ని మేము భర్తీ చేస్తున్నాం అన్నమాట.   అక్కడ మా యూనిట్ కు చేరగానే నన్ను కధా స్థలానికి వెళ్ళమన్నారు.   కాకులు దూరని కారడవిలో హీమాలయ సానువుల్లో  ఇక్కడ ఒక రోడ్, [...]
"ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్" - రాల్డ్ డాల్ రాసిన ఎన్నో కధల్లో ఒకటి. అయినా నాకు ఈ " పేద్ధ " కధ చాలా ఇష్టం. ఇది కధలో కధ, కధలో కధ.. అలా సాగుతుంటుంది. అదీ చాలా ఆశక్తికరంగా !  సో ఆ కధ చెప్తానన్నమాట.  కాసేపు ఇది 'ఒక యోగి ఆత్మకధ' లాగా అనిపిస్తుంది. దానికి మనమేమీ చెయ్యలేం. లండన్ లో ఒకానొక  'హెన్రీ షుగర్'  చాలా డబ్బున్న ఒంటరి యువకుడు. ఆస్థి,  ఇటీవలే మరణించిన [...]
మీసం - గై డి మపాసా                                                                                                                               సొల్ దివాణం [...]
ఓర్హాన్ పాముక్ రాస్సిన ఓ అద్భుతమైన నవల మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్ ! ఇది ఓ పురుషుని ప్రేమ గాధ. ప్రేమ అంటే అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. దేవదాసు లాంటి ఇంటెన్స్ ప్రేమ. దాన్ని వ్యక్తపరచడం లో పిచ్చి. ప్రేమను కోల్పోవడంలో పిచ్చి. విరహం లో పుట్టిన పిచ్చి. ఓ పురుషుని ప్రేమ ! విశేషం అంతా ఇదే. ఇస్తాంబుల్ లో ఓ ధనిక యువకుడు కెమాల్. ఎంగేజ్మెంట్ అయిన రెండో నెల లో కాబోయే భార్య కు హాండ్ బాగ్ [...]
అప్రస్తుతమైన విషయాల గురించి ప్రపంచంతో పాటూ వెర్రెక్కిపోకుండా అపుడపుడూ దూరదర్శన్ అనే టెలివిజన్ చానల్ ను శృతించి చూడడం నాకో  ఓ వెర్రి అలవాటు.  బీ.బీ.సీ నాలుగు చానళ్ళూ, ఐ టీవీ, చానెల్ ఫోర్ లాంటి విదేశీ చానళ్ళ డాక్యుమెంటరీ ల తో సాటి రాదగ్గ మంచి డాక్యుమెంటరీ ని చూసే భాగ్యం కలిగిందీ సారి.  నాకు సాధారణం గా యుద్ధ గాధలు ఇష్టం. రెండు ప్రపంచ యుద్ధాల గాధలతో వెలువడిన చిత్రాలూ, [...]
1994 లో గుజరాత్ లో ప్లేగ్ మహమ్మారి విజృంభించినపుడు ఎపుడో నలభయి ఏళ్ళనాడు మన తెలుగాయన ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టిన టెట్రాసైక్లిన్  కాప్స్యూళ్ళని నాలుగు రోజుల్లో అయిదులక్షల దాకా ఉచితంగా వీధుల్లో పంచిపెట్టారు. ప్లేగు ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో, అంతే వేగంగా పారిపోయింది.  అదెప్పుడో ఈ సుబ్బారావు కనిపెట్టిన మందునే, ఫైలేరియా కి, Q ఫీవరు కీ, కండ్లకలక కీ, కొన్ని రకాల [...]
Proud to share this video.  Well Done everyone.
ఈ మధ్య మా అమ్మాయి తో కలిసి టీవీ చూస్తున్నపుడు డిస్నీ చానెల్లో ప్రసారమైన పాట. అబ్బ ఎంత బావుందో! పాట బర్ఫీ లోనిది. పిల్లల ఫంక్షన్ల లో స్కూల్ ఫంక్షన్ల లోనూ డాన్స్ వేసేందుకు భలే బావుంది.
 నాకు చాలా నచ్చింది ఈ సినిమా. జూడ్ లా అంటే ఉన్న ఇష్టం వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూంది.  ఇక్కడ ఇద్దరికీ అస్సలు సంబంధం వుండదు. భాష తెలీదు.. అయినా ఎలానో కనెక్ట్ అవుతారు. అసలతను అంత పెద్ద సినీ తార అని ఇంకో పెద్దాయనకి తెలీదు. తన నిత్యజీవితం లో తన ఇమేజ్ మూలంగా తరచూ ఇబ్బందులు పడే జూడ్, తనని సహజం గా, తోటి ప్రయాణికుడి గా మాత్రమే భావించిన ఆ అపరిచితుడి తో ఎంత బాగా మూవ్ అవుతాడో [...]
ఇది స్లో గా మొదలయ్యి.. సమాజపు కుత్సితాన్ని ఎండగడుతూ, దుర్భాగ్యుల దైనందిన జీవితం లో ఓ రెండ్రోజుల ని అత్భుతం గా అల్లి షాకు ల మీద షాకులిస్తూ – దర్శకుడు పచ్చిగా, నిస్సిగ్గుగా, నిష్పాక్షికంగా, నిష్పూచీగా చూపించే వ్యధా గాధల్ని – ముందు పెడుతుంది.     చెప్పడానికి ఇందులో  ప్రధాన పాత్రలు చిన్న పిల్లలే అయినా, కధ మాత్రం, పెద్ద వాళ్ళది. కధ ప్రత్యేకంగా చెత్త కుండీల్లో, [...]
 ‘బౌల్ డి సూఫ్’  ప్రెంచు పేరు. దాన్ని  ఇంగ్లీష్ లోకి అనువదిస్తే బాల్ ఆఫ్ ఫాట్ (Ball-of-Fat) –  ఈమె చిక్కగా, లావుగా, ఆకర్షణీయమైన వొంటి  రంగూ,  నిండైన అవయవ సంపద తో  దొండపండు లాంటి  పెదవులు ఎపుడూ, తడితో మెరుస్తూ ముద్దుపెట్టుకోవాలనిపించేలా వుంటాయంట.  అయితే దురదృష్టవశాత్తూ ఈ అందగత్తె, ఒక వేశ్య!     వేశ్య కు మానాభిమానాలూ, ఆలోచించే విచక్షణా, దేశభక్తీ లాంటివి ఉంటాయని [...]
లెస్ మిసెరబుల్స్ - నిజానికి ఫ్రెంచు పదం - దాన్ని సరిగ్గా 'లే మిసారబ్'  అని పలకాలి. ఈ సినిమా కి చాలా వెర్షన్లు ఉన్నాయి. ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో 1862 లో రాసిన నవల ఇది. దీన్ని ఇదే పేరుతో సినిమాగా తీసారు. కొన్ని సార్లు కొంచెం కొంచెం మార్చారు. ఇలాంటి క్లాసిక్ ని పరిచయం చెయ్యబోయే ముందు 'ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని మిమ్మల్ని కోరుకొంటూ, మొదలు పెడతాను.  ఇపుడు చెప్పబోయేది, 1998 [...]
2004 - డిసెంబర్ 26. ఆరోజు నేను డిల్లీ లో వున్నాను.   కాలింగ్ కార్డు ల రోజులవి. హాస్టల్లో కిందకొచ్చి, క్యూ ప్రకారం, లాండ్ లైన్ దొరికాక, ఓ తొమ్మిది గంటలకి, ఇంటికి ఫోన్ చేసాను. అపుడు నాన్న గారు, 'పొద్దున్న కాఫీ కోసం లేచినపుడు  లైట్ గా భూకంపం వచ్చింది తెలుసా?' అన్నారు.  'అవునా' ! అన్నా. వైజాగ్ లో బీచీ లో నీళ్ళన్నీ వెనక్కి వెళిపోయాయి. జనం వింతగా బీచ్ రోడ్ కి వెళ్ళి, ఖాళీ అయిపోయిన [...]
పుస్తకాలు - ఒక వ్యామోహం కొందరికి. వ్యసనం మరి కొందరికి. కొందరికి  హస్త భూషణం. ఎవరింటికైనా వెళ్ళినపుడు వాళ్ళింట్లో పుస్తకాల షెల్ఫుల్ని బట్టి ఒక మంచి/చెడ్డ అభిప్రాయం ఏర్పరుచుకోవడం కూడా పరిపాటి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పుస్తకాల గురించి చర్చలూ, విమర్శలూ, మెచ్చుకోలులూ, ప్రస్తావనలూ, నిరాశలూ, ప్రొమోషన్లూ, కొనుగోళ్ళూ - ఇవన్నీ మనకిపుడిపుడే అందుబాట్లోకి వస్తున్నాయి.  [...]
గాంధీ గారు - మహాత్ములు. దేశానికి అహింస అనే అజేయమైన ఆయుధాన్ని కనిపెట్టిచ్చిన శాస్త్రవేత్త. 200 సంవత్సరాలు విడదీస్తూ పాలిస్తూ, దేశాన్ని చిధ్రం చేసిన విదేశీ పాలన నుండీ, పేదా గొప్పా, పండిత పామరులనూ, స్త్రీలనూ, పురుషులనూ, వీరూ వారూ అన్న తేడా లేకుండా ప్రభావితం చేసి, స్వాతంత్ర్య పొరాటానికే దిశానిర్దేశం చేసి, జీవితాంతం ప్రజలకు ఆదర్శం గా నిలుస్తూ, మహాత్ముడై, జాతికి పిత యై, [...]
వేసవిలో కష్టపడకుండా చెమట చిందించేయొచ్చు. గాఢ నిద్ర లోంచీ, వొళ్ళంతా, దిండంతా చెమటకి తడిచిన చెమ్మకి మెలకువ రావడం, మా వూరి స్పెషాలిటీ.  ఏసీ లొచ్చి బ్రతికించాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఈ విపరీతమైన ఉక్క పోత ప్రాణసంకటం.చండీదాస్ నవలల్లో విశాఖ తీరం అందాల్ని గుర్తు తెచ్చుకుందుకు.. మహరాణీపేట లేడీస్ హాస్టల్ డౌను రోజుల్ని నెమరు వేసుకుందుకూ బీచీకి కారు లో షికారు పోయేరు. అద్దం [...]
Pictures taken in Glasgow, Millport Cumbrae and Ferry point at Largs, Scotland.
1. కొందరు నిరుద్యోగం భయంతో 'చిరుద్యోగాలు' చేస్తుంటారు.  ఎంత చిరుద్యోగాలయినా పర్లేదు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరి 'పెర్మినెంట్ ' ఎప్పటికైనా అవుతామేమో అని ఎదురు చూసే చాలా మంది ఆశావహుల్ని చూస్తుంటాం.  ఇది ఒక రకం అబధ్రత.  ఈ చిన్న ఉద్యోగం కూడా లేపోతే ఏం కాను అనే బెంగ తో కూడా ఆ చిన్న ఉద్యోగాన్ని చేస్తూనే వుంటారు.   కాంప్రమైస్ అయ్యి, ఆ తరవాత పోటీలో నెగ్గలేక, తరవాత [...]
గోవింద్ నిహలానీ, జయా బాధురీ, నందితా దాస్, సీమా బిస్వాస్, అనుపం ఖేర్ లాంటి దిగ్గజాల సినిమా కాబట్టి తప్పకుండా చూడాలనుకుంటూనే ఆ సరైన 'సమయం ' (ఎటువంటి అడ్డూ ఆటంకాలూ లేని, మూడ్ ఉన్నపుడు, వీలున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఇవన్నీ కలిసొచ్చినా, మతిమరుపు పరాక్రమించకుండా, టైం కి గుర్తు వచ్చి, వెతికి, దొరికి) వచ్చి, చూసానీ అత్భుతమైన సినిమా. ఆర్ట్ సినిమా అనొచ్చు. 1970 లలో బెంగాల్లో [...]
అరవై ఏళ్ళకి పైగా మనం నిస్సిగ్గుగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరో అమర వీరుల త్యాగాల ఫలితం.  విషయానికొస్తే ,  చరిత్ర లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ (చారిత్రాత్మక సంఘటనలు ?!) వుంటాయి.  మొదటి స్వాతంత్ర్య పోరాటం, ఉప్పు సత్యాగ్రహం, జలియన్ వాలా బాగ్ ఉదంతం, భగత్ సింగ్ ఉరితీత వగైరా.  ఇవన్నీ భయంతో అన్నిట్నీ సహిస్తూ పోయే అతి సామాన్య సామాజికుడ్ని కూడా తాకుతాయి. [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు